వరంగల్

ప్చ్.. రైతన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, నవంబర్ 20: కేంద్రం తీసుకున్న పాతపెద్ద నోట్ల రద్దు కర్షకులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. పాతపెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధించడంతో వ్యాపారులు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన గుగులోతు రాజు అనే రైతు తన పత్తిచేనులో ఏరిన రెండు బస్తాల పత్తిని విక్రయించేందుకు మోటార్‌సైకిల్‌పై కేసముద్రం మార్కెట్‌కు తీసుకురాగా.. మార్కెట్‌లో క్రయవిక్రయాలు నిలిపివేసిన విషయం తెలుసుకొని మిల్లుల వద్దకు వెళ్లగా.. అక్కడ కూడా నగదు చెల్లించలేమని.. చెక్కు ఇస్తామని చెప్పడంతో రెండు బస్తాలమ్మితే వచ్చేది.. రెండు వేలు కూడా రావని.. ఈ మాత్రం దానికి ఇక చెక్కు తీసుకొని ఏం చేసుకోవాలంటూ.. పత్తి అమ్మితే కాస్త చేతిలో నగదు ఉంటుందని అంత దూరం నుంచి ఎంతో ఆశతో వచ్చిన రాజు చేసేదేమిలేక నిరాశతో వెనుతిరిగాడు. ఇలా రాజు ఒక్కడే కాదు.. అనేకమంది రైతులు తాము పండించిన పంట దిగుబడులను విక్రయించుకునే వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటతో కేసముద్రం మార్కెట్‌కు వస్తే నగదుతో ఇంటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మార్కెట్‌ను పునఃప్రారంభిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సిఎం సహాయనిధి పంపిణీ
* ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
వడ్డేపల్లి, నవంబర్ 20: ప్రజల ఆరోగ్య సంరక్షణ, పేదవారి ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్షా 75వేల రూపాయల చెక్కులను పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బాధితులకు ఆదివారం అందజేశారు. కరీమాబాద్ ప్రాంతానికి చెందిన రజినికి 36వేల రూపాయలను, పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన రోహిత్‌కు లక్ష రూపాయల చెక్కులను, న్యూశాయంపేటకు చెందిన యాదగిరికి 39వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపాలని అన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ప్రజలకోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి దిశగా సాగుతుందని పేర్కొన్నారు.