వరంగల్

కొత్త జిల్లాలకు పెద్దనోట్ల ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 6: తెలంగాణలో కొత్తజిల్లాల ఏర్పాటు మురిపెం పట్టుమని నెలరోజులు కుడా నిలువలేదు. కొత్తజిల్లాల ఏర్పాటు సంతోషంతో ఒకవైపు ప్రజలు సంబురాల్లో ఉండగా కేంద్రప్రభుత్వం ఒక్కసారిగా పెద్దనోట్ల బ్యాన్‌తో పెద్ద బాంబు పేల్చింది. దీంతో ఒక్కసారిగా అటు రియల్ ఎస్టేట్ రంగంతోపాటు అన్నిరంగాలపై పెద్దనోట్ల బ్యాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. భూం ఉంటేనే రిజిస్ట్రేషన్ కార్యాకలాపాలు జరిగి ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చేది. భూముల క్రయ విక్రయాలతో మార్కెట్ కళకళలాడేది. రియల్ ఎస్టేట్ దందాతో నెలలో కోట్లాది రూపాయలు చెతులు మారాయి. గత ఆరు నెలల నుండే కొత్తజిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేయడంతో రియల్‌వ్యాపారులు కొత్తగా జిల్లాలు ఏర్పాటు ఖాయంగా అనుకున్న ప్రాంతాలపై కనె్నశారు. ముందస్తుగానే ఏకరాల కొద్ది భూములను కొనుగొలు చేసి వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒక వరంగల్ పాత జిల్లాలోనే మొత్తం అయిదు కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాలలో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలోచ్చి పదింతల రేట్లు పెరిగిపోయాయి. కొత్తజిల్లాల ఏర్పాటు నేపధ్యంలో భూముల ధరలు అమాంత్తం పెరిగిపోయాయి. ఇదే అదునుగా భావించిన కొందరు రైతులు వారి భూములను అమ్మకానికి పెట్టారు. ఏకరాల కొద్ది భూములు రియల్ వ్యాపారులు కొనుగొలు చేసి ప్లాట్లు చేసే క్రమంలో పెద్దనోట్ల బ్యాన్ ప్రకటన రియల్ వ్యాపారులపై పిడుగులా పడింది. పెద్దనోట్ల బ్యాన్‌తో మార్కెట్లో డబ్బు కొరత ఏర్పడింది. దీంతో భూముల క్రయవిక్రయాలు ఉన్నఫలంగా నిలిచిపోయాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు భూములపైనే పెట్టడంతో రియల్ ఏస్టేట్ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్లాట్లు చేయలేక, భూములను అమ్మలేక అయోమయంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం మరోవైపు ప్రతీ పైసాకు లెక్కచేప్పాలని, ప్రతిది కూడా నగదురహిత లావాదేవిలే జరుగాలని ఆంక్షలు విధించడంతో ఇక భూముల క్రయవిక్రయాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. డబ్బులు ఉన్నా కూడా భూములు కొనలేని పరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల బ్యాన్ ప్రభావం ఒక్క రియల్ ఎస్టేట్ రంగంపైనే కాకుండా ఇండ్ల కొనుగొలు అమ్మకాల విషయంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మార్కెట్లో భూములు, ఇండ్ల ధరలు సగానికి సగం పడిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో పదేండ్ల వరకు కూడా భూముల, ఇండ్ల రేట్లు పెరిగే పరిస్థితి కనిపించడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

గుడుంబా
నియంత్రణకు చర్యలు
* అధికారులకు కలెక్టర్, పోలీసు కమిషనర్ ఆదేశాలు

వరంగల్, డిసెంబర్ 6: గుడుంబా రహిత జిల్లాగా వరంగల్ అర్బన్‌ను మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. ప్రజలలో అవగాహన కల్పించటం ద్వారా పూర్తిస్థాయిలో గుడుంబాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మగంళవారం కలెక్టరేట్ మీటింగ్‌హాలులో గుడుంబా నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ ఆమ్రపాలి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతు పూర్వ వరంగల్ జిల్లాలో గత ఏడాది చేపట్టిన గుడుంబా నియంత్రణ చర్యల కారణంగా 90శాతం మేరకు గుడుంబా తయారీ, అమ్మకాలు నియంత్రణలోకి వచ్చాయని, గుడుంబా నియంత్రణ పూర్తిస్థాయిలో అమలుకు మరింతగా అధికారులు కృషి చేయాలని కోరారు. గుడుంబా నియంత్రణలో భాగంగా గుడుంబా తయరుచేసే, విక్రయించే కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధికి రుణాల కింద రాష్ట్రప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకంగా ఐదుకోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ నిధులతో 108కుటుంబాలకు ఇప్పటి వరకు 60లక్షల రూపాయలు విడుదల చేసామని అన్నారు. మిగతా 500 కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తే ఆర్థిక సహాయం విడుదల చేస్తామని ఆమె చెప్పారు. గుడుంబా ఎక్కువగా తయారయ్యే ప్రాంతాలను, తయారీదారులను గుర్తించి ఆకస్మిక దాడులు నిర్వహించాలని, గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం విక్రయించే వ్యాపారులను గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

అంబేద్కర్‌కు ఘన నివాళి

వరంగల్, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు జిల్లా యంత్రాంగం, వివిధ రాజకీయ పార్టీలు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించాయి. బడుగులకు రిజర్వేషన్లు కల్పించటంలో ఆయన పాత్రతోపాటు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని మననం చేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ పోలీసు కమీషనరేట్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు, జాయింట్ కలెక్టర్ దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పలువురు టిఆర్‌ఎస్ నాయకులు అంబేద్కర్‌కు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి, బడుగు, బలహీనవర్గాలకు చేసిన సేవలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్ట శ్రీనివాసర్, ఇవి శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు. టిడిపి అర్బన్ అధ్యక్షుడు ఈగ మల్లేశం, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, రూరల్ అధ్యక్షురాలు పద్మ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సిపిఎం అర్బన్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీనాయకులు రంగయ్య, వీరన్న, గొడుగు వెంకట్ తదితరులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతు అణగారిన వర్గాల కోసం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్లకు నేటి ప్రభుత్వాలు తూటు పొడుస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగ, ఉపాధి రంగాలలో బడుగులకు రిజర్వేషన్లు దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసారు. సిపిఐ నాయకులు భిక్షపతి, గుండె భద్రి, ఎల్లేష్, సాగర్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇజిఎంఎం మిషన్ డైరెక్టర్‌గా కపిలవాయి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 6: వరంగల్ నగరానికి చెందిన కపిలవాయి రాంబాబు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టులో రాంబాబుతోపాటు ముగ్గురు అనధికార డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. కపిలవాయి రాంబాబు గతంలో వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. చాలాకాలంగా ఆయన టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.

హోంగార్డుల సేవలు భేష్

వరంగల్, డిసెంబర్ 6: విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు పనిచేస్తున్నారని వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు కితాబు ఇచ్చారు. హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, రాష్ట్రంలో హోంగార్డులకు ఇచ్చే వేతనాలు మిగతా ఏ రాష్ట్రాల్లో ఇవ్వటం లేదని తెలిపారు. 54వ హోంగార్డుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో హోంగార్డుల నుంచి కమిషనర్ సుధీర్‌బాబు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోంగార్డుల కవాతును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ హోంగార్డులు పోలీసు శాఖలో ఒక భాగంగా గుర్తిసున్న ప్రభుత్వం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమంలో భాగంగా శుభకార్యాలు జరుపుకునే హోంగార్డులకు పోలీసు కల్యాణ మండపాన్ని ఉచితంగా ఇస్తున్నామని, అదే విధంగా పోలీసులతో సమానంగా హోంగార్డులకు అన్ని వసతులతో కూడిన విశ్రాంతి భవనాన్ని పోలీసు కమిషనరేట్ ప్రాంగణంలో నిర్మించామని చెప్పారు. పోలీసులు, హోంగార్డులు మరింత నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. హోంగార్డు విభాగంలో చాలాకాలంగా సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న కిరణ్, చిరంజీవి, అమీన్‌లను, పదవీ విరమణ చేసిన హోంగార్డు ఐలయ్యను పోలీసు కమిషనర్ ఘనంగా సన్మానించారు.