వరంగల్

అధికారం అండతో అక్రమ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జఫర్‌గడ్, డిసెంబర్ 9: జఫర్‌గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలంటూ ఆందోళన చేస్తున్న జెఎసి నాయకులపై అధికారం అం డతో అక్రమ కేసులు బనాయిస్తున్నాడని మాజీమంత్రి గుండె విజయరామారావు అన్నారు. శుక్రవారం జఫర్‌గడ్ మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయాలను సేకరించకుండా స్వలాభం కోసం జఫర్‌గడ్ మండలా న్ని జనగామ జిల్లాలో కలిపాడని, దీనిని అడిగినందుకే జఫర్‌గడ్ మండల జెఎసి నాయకులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక్క డ ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యమంత్రికి తెలియడం లేదా అని ప్రశ్నించారు. అధికారం అండ చూసుకొని పోలీసులను ఉసిగొల్పి చిన్నా, పెద్ద తేడాలేకుండా కనీసం మహిళలని చూడకుండా కేసులు పెట్టించడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేయ డం జరుగుతుందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వం గద్దెనెక్కాక ప్రజలను పూర్తిగా విస్మరిస్తుందని, ఇప్పటికైనా సిఎం కెసిఆర్ కళ్లు తెరిచి జఫర్‌గడ్‌లో జరుగుతున్న ఉద్యమాన్ని చూడాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, జైపాల్‌రెడ్డి, సోమయ్య, సదయ్య గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా
పరకాల, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ కెసిఆర్ దీక్ష చేస్తే తెలంగాణ రాలేదని, సోని యా ప్రకటిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ చిత్ర పటం ప్రతి ఇంట్లో పెట్టుకున్నారని చెప్పారు. పరకాల ప్రజ ల బలమైన ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ కోసం తాను పరకాలలో 72 గంటల పాటు అమర నిరహార దీక్ష చేసినట్లు తెలిపారు. అయిన ఎమ్మెల్యే స్పందించకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నారని చెప్పారు. తాను నిర్వహించిన అమర నిరహార దీక్షకు జన మద్దతు పలకడంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే తూతూ మంత్రంగా దామెర మండలాన్ని ప్రకటించి చేతులు దులుపుకొని పరకాల చరిత్రను కాలగర్భంలో కలపడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ డివిజన్ తీసుక వచ్చే సత్తా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి లేకపోతే రాజీనామా చేయాలని ఇనగాల డిమాండ్ చేశారు. తాను గత కొద్ది రోజుల నుండి విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల కోసం విద్యార్థులలో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 2 లక్షల విద్యార్థుల సంతకాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలువనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ జడ్పిటిసి లేతాకుల సంజీవరెడ్డి, బొచ్చు క్రిష్ణారావు, పరకాల, మాదారం పిఎసిఎస్ చైర్మన్లు దేవేందర్‌రెడ్డి, గొల్కండ సదానందం, మడికొండ సంపత్, బండి సారంగపాణి, క్రిష్ణయ్య, తిరుపతిరెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, మడికొండ శ్రీనివాస్, పసుల రమేష్, మార్క రఘుపతిగౌడ్, రాంమూర్తి, ఆత్మకూర్, గీసుకొండ, సంగెం మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.