వరంగల్

సమస్యల లోగిళ్లు.. సర్కారీ స్కూళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 1: వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పాల్గొన్నారు. ముందుగా సమావేశం ప్రారంభం కాగానే విద్యావ్యవస్థపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంపై ఉన్న మక్కువతోనే నిరుపేదలు సైతం వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని, ఇందుకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనేక హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత కొరవడిందన్నారు. జనగామ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల వల్లే విద్యావ్యవస్థ కుంటుపడిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెప్పకుండా ఇతర వ్యాపారంలో వారు బిజీ కావడం వల్లే విద్యార్థులకు విద్యను అందించలేకపోతున్నారని అన్నారు. సకాలంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు రావడం లేదని వారు నెలవారి చీటీలు, రియలెస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేవారు. మహబూబాబాద్ అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ ఇంకా అనేక గ్రామాల్లో చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయన్నారు. కొన్ని గ్రామాల్లో ముగ్గురు విద్యార్థులు ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులు ఉండడం చాలా బాధకరమన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యావ్యవస్థ ఇబ్బందిగా తయారైందని, అధికారులెవరూ పట్టించుకోకపవోడం వల్లే రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశాలకు వచ్చే ముందు అధికారులు పూర్తిసమాచారంతో హాజరుకాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసే విధంగా తనవంతు కృషి చేస్తామని, త్వరలోనే కెజి టు పిజి అమలులోకి వస్తందని అన్నారు. ఉపాధ్యాయులు పని చేస్తున్న చోటనే ఉండాలని, షటిల్ సర్వీస్ చేయడం వల్ల విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. వైద్య, పారిశుద్ధ్యం, తాగునీటిపై సమావేశం చర్చించింది.