వరంగల్

కోటి ఎకరాలకు నీరు ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 13: రాష్ట్రంలో రబీ సీజనలో కోటి ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రాష్ట్ర నీటి పారుదల సంస్థ (ఐబిసి) చైర్మన్ శంకర్‌రెడ్డిలు స్పష్టం చేశారు. గూడూరులోని పాఖాలవాగుపై రూ.7.49కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం మంత్రి చందూలాల్, ఐబిసి చైర్మన్ శంకర్‌రెడ్డి, మానుకోట ఎంపి సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ద సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. మంత్రి చందూలాల్, ఐబిసి చైర్మన్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోక వచ్చాక వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పంట పొలాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పాఖాల వాగుపై నిర్మించిన ఈలిప్టు ఇరిగేషన్ పథకం ద్వారా అయోధ్యాపురం శివారులోని 749 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు నీరు అందించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పాఖాల వాగు పరివాహాక ప్రాంతాలైన బొల్లేపల్లి, నాయకపల్లి, తీగలవేణి, గోవిందాపురం గ్రామాల సమీపంలో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని వివరించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బీరవెళ్లి భరత్‌కుమార్ రెడ్డి, జడ్పీటిసి మహ్మద్ ఖాసీం, ఎంపిపి చెల్పూరి వెంకన్న, సర్పంచ్ వాంకుడోతు మోతిలాల్, దామెర నర్సయ్య, నూకల సురేందర్, సంపత్‌రావు, మన్మోహన్‌రెడ్డి, వేం వెంకటక్రిష్ణారెడ్డి, యస్‌కేపాల్‌రెడ్డి, రణధీర్ రెడ్డి, చీదురు అనీల్, చీదురు వెంకన్న పాల్గొన్నారు.

చెత్త సేకరించే రిక్షా...
సైకిళ్లను ప్రారంభించిన స్పీకర్
పరకాల, డిసెంబర్ 13: భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని కాలనీల్లో చెత్తను సేకరించడం కోసం ఏర్పాటు చేసిన రిక్షా సైకిళ్లను మంగళవారం శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ, కమిషనర్ రవీందర్, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, జడ్పీటిసి మీరాబాయి, శిరుప అనిల్‌కుమార్, శ్రీనివాస్, రేగుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తగదు
* అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
* చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
* కమిషనర్ శృతి ఓఝా

వడ్డేపల్లి, డిసెంబర్ 13: క్షేత్రస్థాయిలో పారిశుద్ద్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం తగదని, చిత్తశుద్దితో విధులను నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పనులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పారిశుధ్ద్య పర్యవేక్షకులు, కార్మికులను నగర కమిషనర్ శృతి ఓఝా హెచ్చరించారు.
మంగళవారం ఫోర్టు వరంగల్ పరిసర ప్రాంతాలలో వేకువ జామున అకస్మిక పర్యటన చేసి, పారిశుద్ద్య కార్యక్రమాలను పరిశీలించారు. స్థానిక కార్పోరేటర్ బైరబోయిన దామోదర్ అభిప్రాయాలను డివిజన్‌లోని పారిశుద్ద్య కార్యక్రమాల అమలును అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ ఫోర్టు వరంగల్ స్లమ్ ఏరియాలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నిర్మూలించాలని, ఇక్కడ కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంహెచ్‌ఒ రాజారెడ్డిని ఆదేశించారు. దోమల నిర్మూలన, స్ప్రే, ఫాగింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టాలని అర్బన్ మలేరియా విభాగం అధికారులను ఆదేశించారు. అనంతరం ఫోర్టు వరంగల్‌లోని పార్కును సందర్శించి పార్కులో అవసరమైన చెత్తతరలింపు ట్రక్‌లను, ఫుష్ కాట్స్ తదితర పరికరాలపై నివేదికలు సిద్దం చేయాలని ఎంహెచ్‌ఒకు సూచించారు. తనిఖీలలో సానిటరీ సూపర్‌వైజర్ సురేందర్, ఇన్సిపెక్టర్లు భాస్కర్, శ్రీను పాల్గొన్నారు.
స్వైపింగ్ యంత్రాల ద్వారా పన్నుల చెల్లింపులు
* బ్యాంకు అధికారులను ఆదేశించిన కమిషనర్
వరంగల్ నగర పాలక సంస్థలో నగదు రహిత పన్నుల చెల్లింపులు చేసేందుకు వీలుగా 75 స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ శృతి ఓఝా స్పష్టం చేశారు.
మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ కార్యాలయంలో స్వైపింగ్ యంత్రాల ఏర్పాటుపై పలు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలకు చర్యలు చేపట్టాలని సూచించినందున కమిషనర్ కార్యాలయంలో 75 స్వైపింగ్ యంత్రాలు అవసరమని తెలిపారు. ఆస్తి, నీటి, ట్రేడ్ లైసెన్స్, యూజర్ చార్జీలు, ఇతరత్ర అన్ని చెల్లింపులకు నగదు రహిత విధానంలో చెల్లించడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని బ్యాంకు అధికారులకు తెలిపారు. నగర పాలకు సంస్థకు కావలసిన 75 స్వైపింగ్ యంత్రాలను బ్యాంకు అధికారులు సమకూర్చి ఉచిత సర్వీసును అందించాలని ఆమె కోరారు. వీటి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి వీలు కలుగుతుందని, బ్యాంకులకు, నగర పాలక సంస్థకు పరస్పర ప్రయోజనం కలుగుతుందని వివరించారు. దీరకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు షాహీద్ మసూద్, సురేంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, శాంతికుమార్, రమేష్, కరుణాకర్ పాల్గొన్నారు.