వరంగల్

రబీ... ఇబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 15: పెద్దనోట్ల బ్యాన్ అన్నదాతలకు గుదిబండలా మారింది. రబీసీజన్ ప్రారంభమైనా రైతులకు పెట్టుబడులు దొరుకక ఆగమాగం అవుతున్నారు. పెద్దనోట్ల బ్యాన్‌తో బ్యాంకులు రైతుల గోడును పట్టించుకోవడంలేదు. బ్యాం కులో డబ్బుల కొరత కారణంగా రైతన్నలకు బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడంలేదు. ఖరీఫ్ పంటను అమ్ముకున్నప్పటికీ కొనుగొలు దారులంతా రైతన్నలకు చెక్కుల రూపంలోనే డబ్బులు చెల్లిస్తుండడంతో చేతుల్లో డబ్బుల్లేక రబీ పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. వడ్డి వ్యాపారుల వద్ద కూడా డబ్బు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 25నుండి 30వేల హెక్టార్ల పంట సాగుకు సిద్ధం చేసినా పెట్టుబడులు దొరుకక రైతన్నలు పడరానిపాట్లు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు జరుగుతుండడంతో పెట్టుబడులకు చేతిలో డబ్బుల్లేక రైతులు విలవిలలాడుతున్నారు. ఈ యెడాది వర్షాలు సంవృద్ధిగా కురిసి చెరువలకు జళకళ సంతరించుకొని వ్యవసాయానికి అనువుగా ఉన్నప్పటికీ పెద్దనోట్ల బ్యాన్ కారణంగా రైతులకు బ్యాంకు రుణాలు అందక, వడ్డి వ్యాపారులు కూడా పెట్టుబడులకు డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ఇంకా ఇలా ఎన్నాళ్లు ఈ పరిస్థితి ఉంటుందోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కాగా కేంద్రప్రభుత్వం మాత్రం రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బ్యాంకు లావాదేవీలు జరుగాలని ఒకవైపు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

నెల్లుట్లలో పోలీసుల తనిఖీలు
లింగాలఘణపురం, డిసెంబర్ 15: మండలంలోని నెల్లుట్ల గ్రామంలో గురువారం సాయంత్రం జనగామ డిసిపి తేజావత్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సిఐ లు ముస్కె శ్రీనివాస్, తిరుపతి, ఆది నారాయణలు జట్లుగా ఏర్పడి తమ సిబ్బందితో గ్రామంలోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన భాస్కర్ అనే చిరువ్యాపారి ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన సుమారు రూ.25వేల విలువ గల టపాసు తయారీ సామాగ్రిని స్వాధీ నం చేసుకున్నారు. అలాగే రహదారిపై, గ్రామంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి సంబంధిత వాహనాల దృవపత్రాలను పరిశీలించారు. 25 వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాలను జనగామకు తరలించినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు.

మిర్చి పరిశోధనా కేంద్రానికి 30కోట్లు
నర్సంపేట, డిసెంబర్ 15: నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో నెలకొల్పనున్న మిర్చి పరిశోధనా కేంద్రానికి 30 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమ్మతించారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని, త్వరలోనే అనుమతులు రానున్నట్లు వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నర్సంపేట డివిజన్‌లోనే మిర్చి పంట అత్యధికంగా సాగవుతుందని, గతంలో మిర్చి పంటలను అప్పట్లో సిఎం కెసిఆర్ స్వయంగ పరిశీలించారని చెప్పారు. ఈ ప్రాంతంలో పండే మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లు అయిన నాగ్‌పూర్, ముంబాయిలలో మంచి ధర పలుకుతుందని అన్నారు. ఇదే సమయంలో తెగుళ్ల మూలంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పారు. మిర్చి రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండే లక్ష్యంతో ఈ ప్రాంతంలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని తానే స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరడంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. అదే విధంగా వరంగల్ నుండి నర్సంపేట, పాఖాల, ఇల్లందుల మీదుగా కొత్తగూడెంకు నాలుగు లేన్ల రహదారి సైతం మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి సంసిద్దత వ్యక్తం చేశారని చెప్పారు. త్వరలోనే అధికారిక మంజూరు ఉత్తర్వులు రానున్నట్లు తెలిపారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని చెప్పేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల వచ్చే ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు.

క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
జనగామ టౌన్, డిసెంబర్ 15: క్రైస్తవుల సం క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వారికి నిరంతరం అండదండగా ఉంటుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ బాలాజీ కనె్వక్షన్ ఫంక్షన్ హాల్‌లో గురువారం క్రిస్‌మస్ వేడుకల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, వైస్‌చైర్మన్ నాగారపు వెంకట్, జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఎంపిపిలు బైరగోని యాదగిరి, భూక్య పద్మ, జడ్పీటిసి బాల్దె విజయలు హాజరై క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం నిర్వహించని విధం గా క్రిస్‌మస్ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాలతో జరపడానికి ప్రభుత్వం క్రైస్తవులకు అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధు లు కేటాయించి వారిని ఆదుకుంటున్నారని అన్నా రు. దేశంలో ఉన్న అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవనం సాగించినప్పుడే సమాజం శాంతి సామరస్యంతో వర్థిల్లుతుందని అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం అందచేస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నూతి భాగ్యమ్మ మాట్లాడుతూ జనగామ జిల్లావ్యాప్తంగా క్రిస్‌మస్ వేడుకలను పురస్కరించుకొని సుమారు 6వేల మంది పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక 6వేల మందికి సహపంక్తి భోజనాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కౌన్సిలర్లు కన్నారపు ఉపేందర్, ఎజాజ్, కల్యాణి, మల్లమ్మ, జనార్థన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు కెవిఎల్‌ఎన్ రెడ్డితో పాటు మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయ సూపరింటెండెంట్ ఎం. శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ మల్కపురం చందర్, క్రైస్తవ పెద్దలు కెఎం జాన్, ఏబేల్, చిట్టిబాబు, ఫిలిప్‌లు పాల్గొన్నారు.

కెయు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
నక్కలగుట్ట,డిసెంబర్ 15:కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యారు. ఈ పరీక్షలకు వరంగల్‌లో 40 కేంద్రాలు, ఖమ్మం 27, ఆదిలాబాదు 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల కేంద్రాన్ని విసి సాయన్న, పరీక్షల నియంత్రణాధికారులు ప్రొఫెసర్ పురుషోత్తం, మల్లారెడ్డిలు పరిశీలించారు. వారు మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాలకు పర్యవేక్షలకును ఏర్పాటు చేశామని, వారితోపాటు ప్రత్యేక తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

నగరంలోని దుకాణాల తనిఖీలు

వరంగల్, డిసెంబర్ 15: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్న షాపులపై వరంగల్ మహానగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగం సిబ్బంది వరంగల్ ప్రాంతంలోని పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు షాపులలో 50మైక్రాన్లకు తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను విక్రయించడాన్ని, వినియోగించడాన్ని గమనించి ఆయా షాపుల యాజమాన్యాలకు జరిమానా విధించారు. వరంగల్ నగరంలోని పలు షాపులలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాస్టిక్ సం చుల విక్రయం జరుగుతున్నట్లు చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అదే విధంగా చాలా షాపులలో తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచుల వినియోగం జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పిన్నావారి వీధి లో ప్లాస్టిక్ సంచులు విక్రయించే షాపులపై దాడులు నిర్వహించి తనిఖీలు జరిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి తక్కువ మందం ప్లాస్టిక్ సంచుల విక్రయాలు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ రకమైన అమ్మకాలు జరిపిన ఎంఎస్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఐదువేల రూపాయలు, శంకర్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యానికి, శారదా ఎంటర్ ప్రైజెస్‌కు, శ్రీసాయిదుర్గా ఎంటర్ ప్రైజెస్‌లకు రెండువేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. అదే విధంగా కాసం పుల్లయ్య సిల్క్స్‌కు ఐదువందల రూపాయల జరిమానా విధించారు. అనంతరం ముందస్తు సమాచారం మేరకు కోహినూర్ హోటల్‌పై ఎం.హెచ్.ఓ బృందం దాడిచేసి తనిఖీలు చేయగా నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులు లభించటంతో మూడువేల రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తే కఠినచర్యలు తీసకుంటామని ఎంహెచ్‌ఓ హెచ్చరించారు. నిషేధించిన ప్లాస్టిక్ సంచులను వినియోగించటం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడే పరిస్థితులు పెరుగుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల ను అరికట్టడంలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ దాడులలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉపేందర్, రాములు, సురేష్, అనిల్, సూపర్‌వైజర్ సురేందర్ పాల్గొన్నారు.

రెండవ ఎఎన్‌ఎంలను క్రమబద్దీకరించాలి
వడ్డేపల్లి,డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న 4000 మంది ఒప్పంద రెండవ ఎఎన్‌ఎంలను వెంటనే క్రమబద్దీకరించాలని తెలంగాణ యూనైటెడ్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం రాస్ట్ర అధ్యక్షుడు యాదా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఒప్పంద రెండవ ఎఎన్‌ఎంలను క్రమబద్దీకరించాలని కోరుతూ యూనియన్ అధ్వర్యంలో అర్బన్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా యాదా నాయక్ మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ ద్వారా తొమ్మిది సంవత్సరాల క్రితం నియమింపబడి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సేవల అందిస్తున్న కార్మికుల బాధలు వర్ణనాతీతం అని విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలైలో 40 రోజలు పాటు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మె నిర్వహించినా, ప్రభుత్వం ఇంత వరకు వారి సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని సిఐటియు అర్బన్ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగానే ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, విధి నిర్వహణలో పనిభారం పెరిగినందున ఎన్‌హెచ్‌ఆర్‌ఎం నిమయాలను అనుసరించి విధుల చేయించాలని, కార్మికుల వేతనాలను నెలనెల ఇవ్వాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతోకూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి సుధాకర్, నాయకురాళ్లు సరోజ, శిరీష, భారతి, ప్రశాంతి, విజయ, ఉమ తదితరులు పాల్గొన్నారు.

సంస్థానాల విలీనంలో సర్దార్‌దే కీలకపాత్ర
నక్కలగుట్ట,డిసెంబర్ 15:్భరత దేశపు ఉక్కుమనిషిగా పేరు గాంచిన వల్లభాయ్ పటేల్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధునిగానే కాకుండా, సంస్థానాలు దేశంలో విలీనం కావడానికి కృషి చేసిన మహనీయుడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం పటేల్ 66వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నాయిని మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని నెహ్రూ ఆశయాల మేరకు, దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా దేశాభివృద్దికి ఎంతో పాటు పడినారని కొనయాడారు. గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘీక ఉద్యమాలను చేపట్టారని గుర్తుచేశారు. బ్రిటీష్ వారు విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారని పేర్కొన్నారు.
నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో హోం శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారని, దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను అణచివేసి ఉక్కుమనిషిగా కీర్తింపబడినాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, రాంమోహన్‌రావు, శరత్, శశికుమార్, శ్యాం, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యపై విచారణ జరిపిన ఆర్డీఓ
నెక్కొండ, డిసెంబర్ 15: నెక్కొండ మండలం పనికర గ్రామనికి చెందిన రైతు గర్నెపెల్లి తిరుపతిరెడ్డి ఆరునెలల కిందట అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా ఆత్మహత్య కారాణలపై నర్సంపేట ఆర్డీవో రామకృష్ణారెడ్డి గురువారం విచారణ జరిపారు. పనికర గ్రామంలోని కుటుంబ సభ్యులను విచారించి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపారు. విచారణలో ఏడిఏ శ్రీనివాసరావు, ఎస్సై మిథున్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయాధికారి సంపత్‌రెడ్డి తదితరులు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులు అధికారులకు మొరపెట్టుకున్నారు.

వీరభద్రుని బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ
భీమదేవరపల్లి, డిసెంబర్ 15: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాల తేదీల శుభపత్రికను ఆలయ కార్యనిర్వహాణాధికారి రాజేందర్‌రావు గురువారం ఆవిష్కరించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుని ఆలయంలో ఆలయ పూజారులతో కలిసి ఆవిష్కరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో రాజేందర్‌రావు మాట్లాడుతూ జనవరి 9న వీరభద్రుని కల్యాణం, 10న స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, 11న గవ్యాంతం, నిత్యౌపాసన, నిత్యహోమం, నిత్యబలిహరణ, వాస్తుపూజ, 12న సూర్యయంత్రప్రతిష్ఠాపన, 13న భోగిపండుగ, చండీహోమం, శ్రీచక్రార్చన, నిత్యపూజలు, 14బండ్లు తిరుగుట, వీరభద్రునికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఉత్తరాయపుణ్యకాల మహాదర్శనం, మహాలింగార్చన, 15న వసంతోత్సవం, నాగవెళ్లి, నిత్య కార్యక్రమాలు, ఏకాంతసేవ, 16న త్రిళూల స్నానం, మమాపూర్ణాహుతి, కుంభాభాషేకం, 17న అగ్నిగుండాలు, స్వామివారికి అన్నాభిషేకం, సాయంత్రం స్వామి వారి గ్రామపర్యటన జరుగుతాయని వెల్లడించారు. ఈనెల 23న వాయిదా పడిన వేలం పాటలు తిరిగి నిర్వహించడం జరుగుతుందన్నారు.

నేడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాక
నక్కలగుట్టలోని నందనా గార్డెన్ అర్బన్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరుకానున్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై జరుగుతున్న అవకతవకలపై నిరసనగా అదాలత్ అమరవీరులు స్థూపం నుండి నందనా గార్డెన్ వరకు నిర్వహించే పాదయాత్రలో లక్ష్మణ్ పాల్గొంటారు. అనంతరం సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నట్లు అర్బన్ పార్టీ వర్గాలు తెలిపారు.

సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయాలి
ములుగుటౌన్, డిసెంబర్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లోని లబ్ధిదారులకు చేరవేసేలా యువజన సంఘాల సభ్యులు చేరవేయాలని నెహ్రూ యువజన కేంద్రం వరంగల్ ప్రతినిధి రవీందర్ పేర్కొన్నారు. ములుగులో గురువారం యువజన కేంద్రం ఆధ్వర్యంలో యువజన సంఘాల సభ్యులతో జరిగిన అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే విధంగా యువజన సంఘాల సభ్యులు సైనికుల్లా పనిచేసి నిరుద్యోగాన్ని రూపుమాపాలన్నారు. ఈ సమావేశంలో నెహ్రూ యువజన సంఘం వలంటీర్లు ముడిత మహేందర్, నాగరాజు, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమాలు
ములుగుటౌన్, డిసెంబర్ 15 : ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి, జెఎసి ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమాలను ఉధృతం చేయాలని జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముం జాల బిక్షపతిగౌడ్ ఈప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ములుగులో వేముల బిక్షపతి అధ్యక్షతన సమావేశం జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. స్వార్థ రాజకీయాల వల్ల ములుగు జిల్లా కాలేదని, ఈనెల 16 నుండి 21వతేదీ వరకు చేపట్టే జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పోరాడాలన్నారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కమిటి నాయకులు బాణాల రాజుకుమార్, చింతలపూడి నరేందర్‌రెడ్డి,్భస్కర్‌రెడ్డి, ఆడెపు రాజు తదితరులు పాల్గొన్నారు.