రాష్ట్రీయం

అదో బ్లాక్ పేపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబు బాక్సైట్ శే్వతపత్రంపై రఘువీరా విసుర్లు

విశాఖపట్నం, డిసెంబర్ 7: బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసింది శే్వతపత్రం కాదని, అవాస్తవ పత్రమని, బ్లాక్ పేపర్ అని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విరుచుకుపడ్డారు. బాక్సైట్‌పై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వాస్తవ పత్రాన్ని రఘువీరారెడ్డి సోమవారం విశాఖలో విడుదల చేశారు. తాము విడుదల చేసిన వాస్తవ పత్రంలో ఒక్క అవాస్తవం ఉన్నా, తాము ప్రజల ముందు వంద గుంజీళ్లు తీస్తామని అన్నారు. ఇదంతా వాస్తవమని చంద్రబాబు అంగీకరిస్తే, ఆయన తన తప్పును అంగీకరించాలని కోరారు.
2000 సంవత్సరంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నింస్తే, అప్పటి గవర్నర్ రంగరాజన్ దానిపై తీవ్ర అభ్యంతరం చెప్పారని అన్నారు. అదే చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు శాసనసభలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. ఆరోజు బాక్సైట్ తవ్వకాలు, దానికి సంబంధించిన ఒప్పందాలపై సభలో చంద్రబాబు చేసిన ప్రసంగం సిడిలను ఈ సందర్భంగా పత్రికలకు విడుదల చేశారు. అప్పుడు గిరిజనులపై ప్రేమాభిమానాలు ఒలకబోసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి నాలుగు లేఖలు రాసి, అనుమతులు ఎందుకు తెప్పించారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను తీసుకురావడంలో చంద్రబాబు ప్రయత్నించటం లేదని, బాక్సైట్ తవ్వకాల అనుమతుల కోసం మాత్రం కేంద్రంపై వత్తిడి తెచ్చారని ఆయన విమర్శించారు.
బాబు తన నిజ స్వరూం బయటపడకుండా, తప్పును కప్పి పుచ్చుకోడానికి శే్వతపత్రం విడుదల చేశారని రఘువీరా విమర్శించారు. చంద్రబాబు వాస్తవాలు చెప్పడానికి కూడా సాహసించలేకపోయారని ఆయన అన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు తనను గొప్ప నాయుకుడిగా గుర్తిస్తున్నాయని చెప్పుకుంటున్న చంద్రబాబుకు తెలియకుండా 97 జిఓ విడుదల కావడం విచిత్రంగా ఉందని రఘవీరారెడ్డి అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రులు శైలజానాథ్, బాలరాజు, వట్టి వసంతకుమార్, కృపారాణి, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.