తెలంగాణ

మహిళలు స్వయంశక్తితో ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసు శాఖలో 33శాతం మహిళా రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ

హైదరాబాద్, మార్చి 13: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధించిన వారవుతారని, అందుకు మహిళలు స్వీయ రక్షణతోపాటు ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సిఐడి, హైదరాబాద్ సిటీ పోలీస్, షీ టీమ్స్ సంయుక్త్ధ్వార్యంలో ‘లీగల్ రైట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్’పై చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సును డిజిపి అనురాగ్ శర్మ ప్రారంభించగా నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, సినీ నటులు మంచు లక్ష్మి, రాంచరణ్ తేజలతో పాటు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు పరచామని, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల భర్తీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని త్వరలో పోలీస్ శాఖలోని ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. గృహ హింస, లైంగిక వేధింపుల బాధితులు నేరుగా పోలీసు స్టేషన్లకు రావచ్చని, ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తారన్నారు.
నగర కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో వంద ‘షీ’ టీమ్‌లను ఏర్పాటు చేశామని, ఈవ్ టీజర్లను కనిపెట్టేందుకు ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వీటి పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని క్షణాల్లో పట్టుకునేందుకు వీలుగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా చైతన్య సదస్సుకు సంబంధించి పోస్టర్లు, ఆడియోను విడుదల చేసి వెబ్‌సైట్‌ను డిజిపి అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐడి ఐజి డాక్టర్ సౌమ్య మిశ్రా, జాయింట్ సిపి, షీ టీమ్స్ అధికారిణి స్వాతి లక్రా, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు.