రాష్ట్రీయం

ఎడమకాల్వ ఆధునికీకరణపై ఇంజనీర్లకు వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, నవంబర్ 30: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ ఆధునికీకరణ విషయంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, టేకులపల్లి సర్కిల్ కార్యాలయాల పరిధిలోని ఇంజనీర్లకు సోమవారం నాగార్జునసాగర్‌లో విజయవిహార్ సమావేశ మందిరంలో ఒక్కరోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు 120మంది ఎన్‌ఎస్‌పి ఎడమకాల్వ పరిదిలోని ఇంజనీర్లు హాజరయ్యారు. సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ ప్రాజెక్టు డైరెక్టర్ మల్సూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో రిటైర్డ్ ఇఎంసి చంద్రమోహన్, ప్రపంచ బ్యాంక్ కన్సల్‌టెంట్‌లు శరత్‌చంద్రారెడ్డి, ప్రకాశ్, థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డిలు వర్క్‌షాప్‌కు హాజరైన ఇంజనీర్లకు పలు అంశాలపై వివరించారు. ఎడమకాల్వ పరిధిలో ఆధునీకరణలో భాగంగా నిర్వహిస్తున్న పనుల విషయంలో ఏవిధంగా చేపట్టాలి అనే దానిపై పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎడమకాల్వ పరిధిలోని ఆధునీకరణకు సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులను, వాటి నమోదును ప్రాజెక్టు డైరెక్టర్ మల్సూర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునీకరణలో పనులను ఏవిధంగా చేపట్టాలి? నాణ్యత లోపించిన పనుల విషయంలో వాటిని తొలగించి మరల ఎక్కడెక్కడ కట్టాలి అనే అంశంపై ఇంజనీర్లకు సూచనలు ఇచ్చారు. పనులు పూర్తిస్తాయిలో జరగకపోయినా, నాణ్యత లోపించినా, అధికారులు బిల్లులపై సరైన క్రమంలో పరిశీలించి సంతకాలు చేయకపోయినా సదరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు జరగదని ఆయన హెచ్చరించారు. ఈసమావేశంలో ప్రాజెక్టు పరిధిలోని చీఫ్ ఇంజనీర్ పురుషోత్తంరాజు, ఎస్‌ఇ విజయభాస్కర్‌రావు, టేకులపల్లి ఎస్‌ఇ కోటేశ్వర్‌రావు, మూడు సర్కిల్ కార్యాలయాల పరిదిలోని ఎస్‌ఇలు, డిఇలు, జెఇలు, డ్రాఫ్ట్‌మెన్‌లు పాల్గొన్నారు. (చిత్రం) ఇంజనీర్లకు వర్క్‌షాప్ నిర్వహిస్తున్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు