ఆటాపోటీ

ప్రో రెజ్లింగ్ ఆవిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) తెరపైకి రావడంతో ఈఏడాది భారత రెజ్లింగ్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రపంచ మేటి రెజ్లర్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నుంచి సుశీల్ వైదొలగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంతేగాక సుమారు ఏడాది కాలంగా అతను గాయాలతో బాధపడుతూ చాలా టోర్నీల్లో పాల్గొనలేకపోయాడు. వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకూ 74 కిలోల విభాగంలో మాత్రమే క్వాలిఫై అయింది. రెండు పర్యాయాలు ఒలింపిక్స్‌లో పతకాలను సాధించిన సుశీల్ కుమార్‌కు అవకాశం ఇస్తారా లేక నర్సింగ్ బరిలోకి దిగుతాడా అన్నది ఆసక్తిని రేపుతోంది. లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ 66 కిలోల విభాగంలో పోటీపడి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యవ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ 74 కిలోల విభాగంలో మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై వెనుదిరిగాడు. 2013లో అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (్ఫలా) కొత్త నిబంధనలను ప్రకటించడంతో సుశీల్ కూడా 76 కిలోల విభాగంలోనే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ ఒకే కేటగిరిలో ఉన్న నేపథ్యంలో సుశీల్, నర్సింగ్ మధ్య నెలకొన్న పోటీ ఆసక్తిని రేపుతున్నది. ఈ ఏడాది మొత్తం చాలా టోర్నీలకు సుశీల్ దూరంగా ఉన్నాడు. అతను కేవలం రెండు టోర్నీల్లో పాల్గొని, ఒక స్వర్ణం, ఒక రజత పతకం సాధించాడు. అయితే, సుశీల్ పోటీపడని చాలా టోర్నీల్లో దేశానికి నర్సింగ్ ప్రాతినిథ్యం వహించాడు. నిలకడగా రాణిస్తున్నాడు. దోహా ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం, ఇంటర్నేషనల్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఎవరూ ఊహించని విధంగా కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అంతేగాక, భారత్‌కు 74 కిలోల విభాగంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను సంపాదించి పెట్టాడు. రియోకు అధికారులు సుశీల్‌ను పంపిస్తారా లేక నర్సింగ్‌కు అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తిని రేపుతున్నది. బజ్రంగ్ పునియా, ప్రవీణ్ రాణా, అమిత్ కుమార్, బబితా కుమారి, వినేష్ ఫొగత్ తదితరులు వివిధ టోర్నీల్లో భారత కీర్తి బావుటాను ఎగురవేశారు. అంతర్జాతీయ రెజ్లింగ్‌లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించారు.