మంచి మాట

యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైనందిన బ్రతుకుబాటలో పరిష్కరించుటకు సాధ్యంకాని సమస్యలు, ఒత్తిళ్ళు మనకు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలియనినాడు మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో ఉన్నత శిఖరాలకు ఎలా చేరాలో తెలియక మనసు తల్లడిల్లుతుంది. అలాంటి పరిస్థితులలో చక్కటి పరిష్కారం యోగ సాధనా ప్రక్రియ. ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, దైనందిన అభ్యాసం ద్వారా చురుకుదనం, ఉల్లాసం, ఉత్సాహం ద్విగుణీకృతం అవుతుంది. ఈనాడు కంప్యూటర్ కాలం వచ్చింది. ఒకే స్థానంలో కూర్చొని చిన్న వయసులోనే శారీరక బాధలు, మానసిక ఒత్తిళ్ళు అధికం కావడం మనం గమనిస్తున్నాము. ప్రాణాయామం యోగలో ఒక భాగం. గాలిపీల్చడం, వదలడంవల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాడులు సక్రమంగా పనిచేయడం, ఫలితంగా రక్తపోటు, గుండెనొప్పి లాంటి దీర్ఘవ్యాధులు మన దరిదాపుకు రావు. ఆసనాలవల్ల అధిక బరువు తగ్గుతుంది. పొట్ట భాగం తేలికగా అవుతుంది. నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు బాధలు నివారింపబడతాయి. ఇదంతా యోగాకు సంబంధించిన విషయం.
నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు, సమస్యలు పరిష్కార మార్గం దొరకక, రకరకాల ఆలోచనలు పరుగులు తీస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు మనం ఏదైతే నిజం అని నమ్ముతుంటామో, అది అంతా అసత్యం అవుతుంది. ఏదైతే అసత్యమని భ్రమించుతామో అది అంతా నిజం అవుతుందని విశ్వసించడంవల్ల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఊహించనివి, అనుకోని సమస్యలు ఢీకొడ్తాయి. పరిష్కార మార్గం ఏకాంతంగా సకారాత్మక ఆలోచనలతో ఆలోచించాలి. అంతేకాని తిరిగి మనం ఢీకొడతామని ఎదురొడితే గాయపడేది మనమే. దీనికోసం బంధాలు, అనుబంధాలు దాటి ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించాలి. తెలిసీ తెలియక మనం ఎన్నో తప్పులు చేస్తుంటాము. అవి తప్పు అని మనకు తెలియదు. మనం చేసిన పొరపాట్లకు దేవున్ని బాధ్యులు చేసేవారున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మన కర్మ, మన ప్రారబ్దం ఇంతే అని సర్దుకుపోవడంవల్ల కొంత ఉపశమనం మనుస్సకు కలుగుతుంది.
అనంతమైన ఈ సృష్టి జగన్నాటకంలో మనం పంచతత్త్వాలతో నిర్మితమైన ఈ శరీరమనే వస్త్రాన్ని ధరించి పాత్రలు అభినయిస్తున్నాము. సూత్రధారుడు ఆ పరాత్పరుడే. ఈ ఆటలో ఏ సమయంలో ఎలాంటి ఘటనా సంఘటనలు మనం అభినయించాల్సి వస్తుందో ఆ దర్శకుడు పరమాత్మ చేతిలో మనం కీలుబొమ్మలు పాత్రధారులం మాత్రమే. అపరిష్కృత సమస్యలకు ఇంతకంటె చక్కని ఆలచన వేరే గత్యంతరం లేదు. జీవితంలో ఎన్నో అనుకుంటాము. ఎన్నో కలలు కంటాము. ఏవి జరుగవు. ఒక్కోసారి తలవని తలంపుగా జరుగుతాయని. అన్నిటికీ నాటకంలో నా కర్మఫలం, నా ప్రారబ్దం, నా పాత్ర.. ఇంతే అనుకుంటే సంతృప్తి. ఆనందం లేకుంటే మిగిలేది దుఃఖం. ఆవేదన, శోధన, రోదన. ఇంతటి విశాల తత్త్వాన్ని అవగాహన చేసుకోవాలంటే ధైర్యం కావాలి. మనోనిబ్బరం కావాలి. ఆత్మాభిమాన స్థితి కావాలి. దీనికోసం యోగ సాధన చక్కటి ప్రక్రియ. జీవిత గమనంలో ఎన్నో రకాల అడ్డంకులు, అవరోధాలు కలిగినా రాజయోగ మెడిటేషన్‌తో విజయం సుసాధ్యం. అయితే మన కుటుంబంలో సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పంతాలు, పట్టింపులు వ్యక్తుల మధ్య వచ్చినపుడు వాటిని ప్రక్కకు త్రోసివేయాలి. ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అపుడే మెడిటేషన్ సులభతరం అవుతుంది. నిరాకార, నిరామయ, నిర్వికార పరంజ్యోతిద్భాంధువు పరమాత్మునికి ఈ బంధాలు, జనన మరణాలు ఏమీ లేవు. మన ఆత్మకు అన్ని బంధించి వున్నవి. వాటిని తొలగించి ఆ పరాత్పరునితో మమేకం కావడం, కలవడం యోగం. పరమాత్మ అనుభూతి మాటలకు అందనిది. ఈ యోగం సాధన ద్వారా శాంతి, ప్రేమ, అనురాగం, ఆత్మస్థైర్యం సహజంగా జాగృతమై మన కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం ప్రపంచం యావత్తు స్వర్గతుల్యం అవుతుంది. ఇది నిజం. యోగం అనేది భౌతికం, యోగం ఆధ్యాత్మికం. రెండింటి సమన్వయం అయితే అదే విశ్వకళ్యాణం అవుతుంది. అన్ని మతాల సారాంశం ఇదే.

-బ్రహ్మదేవర సాంబమూర్తి