జాతీయ వార్తలు

ఉగ్రవాది అరీజ్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్ర వాది ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అరీజ్‌ఖాన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. దేశంలో జరిగిన అనేక పేలుళ్ల సంఘటనల్లో అరీజ్ హస్తం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, జైపూర్ పేలుళ్ల సంఘటనలకు సూత్రధారి. బాంబుల తయారీలో నిష్ణాతుడైన అరీజ్ దుశ్చర్యలకు 165 మంది ప్రాణాలు కోల్పోయారు. 2007 నుండి పదేళ్లలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. 2008లో జరిగిన బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న అరీజ్ కోసం గాలిస్తున్న ఢిల్లీ ప్రత్యేక పోలీసుల బృందం చివరకు అతడిని పట్టుకోగలిగింది. అతనిపై రూ. 15 లక్షల రివార్డును గతంలో పోలీసులు ప్రకటించారు. కాగా 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియా నగర్‌లో బాట్లహౌస్‌లో అరీజ్‌తో మరో నలుగురు కలసి ఉండగా పోలీసులు దాడి చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు, ఇన్‌స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ మరణించారు. కాగా అప్పుడు పట్టుబడిన తీవ్రవాది షాహ్జాద్ అహ్మద్‌కు ట్రయల్‌కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై షాహ్జాద్ హైకోర్టులో చేసిన అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అరీజ్‌ఖాన్ అరెస్టు సంచలనం రేపింది. చాలాకాలంపాటు సౌదీఅరేబియా, నేపాల్‌లో తలదాచుకున్న అరీజ్ పాత సంబంధాలను పునరుద్ధరించేందుకు భారత్ వస్తూండగా నేపాల్ సరిహద్దుల్లో పోలీసులకు చిక్కాడు. ఇది తాము సాధించిన ఘన విజయమని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ప్రమోద్‌సింగ్ ఖుషావత్ పేర్కొన్నారు.

chitram....
ఢిల్లీ పోలీసులకు చిక్కిన తీవ్రవాది అరీజ్