సబ్ ఫీచర్

యోగా.. ఒంటికి మంచిదేగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరూపిస్తున్న 97 ఏళ్ల వృద్ధురాలు * గిన్నిస్ రికార్డు సృష్టించిన బామ్మ
600 మంది గురువులకు మార్గదర్శి * కుటుంబ సభ్యులంతా యోగాభ్యాసకులే

నడివయసు దాటితే చాలు.. ఇక తమ పని అయిపోయిందంటూ చాలామంది కృష్ణా!రామా! అని మూలన కూర్చునే రోజులివి. కాని 97 ఏళ్ల నానమ్మాళ్ చూస్తే ఔరా!అని అనకుండా ఉండలేరు. ఎముకలు తప్ప కండలేని ఈ దేహం యోగాసనలు వేస్తుంటే చూసేవారికి ఒళ్లు జలదరిస్తుంది. దేశంలోనే అత్యంత వృద్ధ యోగా టీచర్‌గా చరిత్ర సృష్టంచిన ఈ బామ్మ అబ్బుర పరిచే యోగా విన్యాసాలతో ఇటీవలనే గిన్నిస్ బుక్‌లోకి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె తన యోగా జీవిత ప్రస్తానాన్ని వివరించారు.
ఎనిమిదేళ్లకే యోగా
కొయంబత్తూర్‌లోని నానమ్మళ్ ఇంటికి వెళితే ఉదయం వందలాది మంది టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలకు యోగా నేర్పుతూ కన్పిస్తారు. ఇలా రోజుకు కొన్ని వందల మందికి యోగా నేర్పుతుంది. నిద్రలేవగానే అర లీటరు నీళ్లను పరగడపున తాగి తన దినచర్యను ఆరంభిస్తుంది. యోగాను ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆరంభించింది. ఆమె తండ్రి కూడా యోగా చేసేవారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కూడా. ఆమె భర్త రైతు. ఆయన కూడా సిద్ద యోగాలో నిష్ణాతులు. పెళ్లయిన దగ్గర నుంచి ఆమె ప్రకృతి వైద్యానే్న నమ్ముకుంది. ఇంత వయసు వచ్చినా ఒక్కరోజు కూడా యోగాభ్యాసం మానలేదు. అదే తన ఆరోగ్య రహస్యం అని చెబుతోంది.
ఆమె దినచర్య ఇలా..
తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేస్తుంది. పరగడుపున అర లీటరు నీరు తాగుతుంది. ఇప్పటికీ పళ్లు తోమటానికి వేపపుల్లనే ఉపయోగిస్తుంది. విదేశాలకు వెళ్లినా వేపపుల్లలను వెంట తీసుకువెళుతుంది. ఉదయం ఆమె పనులు పూర్తి చేసుకున్న తరువాత విద్యార్థులకు యోగాసనాలు నేర్పుతుంది. ఉదయం పూట దోశ లేదా ఇడ్లీని ఫలహారంగా తీసుకుంటుంది. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటుంది. కాల్షియం, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలతో సొంతంగా చేసుకున్న వంటకాలే ఆమెకు ఇష్టం. ఎలాంటి రసాయనికి ఎరువులు వేయని సేంద్రీయ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలనే సొంత పొలంలో పండించుకుని వండుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో పాలకూరతో చేసిన కూర తప్పనిసరి. రాత్రిపూట ఏడున్నరకల్లా భోజనం చేసేస్తుంది. రాత్రి భోజనంలో ఒక పండు, అరగ్లాసు పాలలో తేనె కలుపుకుని తాగుతుంది. తెనే లేకపోతే పసుపు లేదా మిరియాల పొడి వేసుకుని తాగుతుంది. ఆమెకు అల్లం టీ అంటే ఇష్టం. కాఫీని కూడా అల్లం లేదా కొత్తిమీరతో తయారు చేసుకుని తాగుతుంది. పంచదార అంటే సుతరామూ ఇష్టపడదు. ఆమె పిల్లలు, మనవళ్లు మనవరాళ్లు పంచదారకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తారు.
గిన్నిస్ రికార్డు..
ఇటీవల కొయంబత్తూర్‌లో 20వేల మందికి యోగా నేర్పి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. పెళ్లయినా యోగాను ఆపకుండా చేశానని గర్వంగా చెప్పుకుంటున్న ఈమె మహిళలు, చిన్నారులకు యోగాపట్ల అవగాహన కల్పించాలన్నది లక్ష్యం. సకల రోగాలకు యోగాయే దివ్యౌషధం అని నమ్మే నానమ్మళ్ 2003లో మొట్ట మొదటిసారి యోగా పోటీలల్లో పాల్గొని తన సత్తా చాటింది.
యోగా కుటుంబం
ఇప్పటి వరకు దాదాపు వంద పోటీల్లో ఆమె పాల్గొన్నారు. బామ్మ కుటుంబంలో దాదాపు 36మంది యోగా టీచర్లుగా ఉన్నారు. ఆమె వద్ద యోగా నేర్చుకున్నవారిలో దాదాపు 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా గురువులుగా పేరు సంపాదించారు. యోగాపట్ల ఆమెకున్న మమకారాన్ని గుర్తించిన ఎన్నో ఇన్‌స్టిట్యూషన్లు, ఎందరో యోగాని నేర్పించమని ఆహ్వానాలు పంపినా వెళ్లలేదు.తనకు ఇంగ్లీషు రాకపోవటమే అందుకు కారణమని చెబుతారామె.