రాష్ట్రీయం

యాదాద్రిలో వైభవంగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి లక్ష్మీనరసింహుడికి దివ్య వాహన సేవలు

నల్లగొండ, మార్చి 11: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వాన పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాల సంరంభం ఘనంగా ఆరంభమైంది. శే్వతవస్త్రంపై స్వామి వారి ఇష్టవాహన గరుడిని చిత్రించి వేదమంత్రాలతో ఆవాహాన చేసి గర్భాలయం ఎదుట ధ్వజస్తంభంపై ధ్వజారోహణం చేశారు. గరుడ ఆళ్వారుడికి మహానివేదన చేసి జగద్రక్షుడు లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతు ధ్వజారోహణం నిర్వహించారు. గరుడ మాల మంత్రం జపించి గరుడ బలిముద్ధలను పైకి విసిరి సదరు ప్రసాదాన్ని భక్తులకు పంచారు. గరుడ ముద్దల కోసం భక్తులు ఎగబడ్డారు. భక్తుల సందడి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను సంతరింప జేసింది. అనంతరం రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం పూజ ప్రక్రియను నిర్వహించారు. రుత్వికుల ప్రబంధ పఠనం కొనసాగించారు. ధ్వజారోహణ పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహ్మాచార్యులు, కారంపూడి నర్సింహ్మాచార్యులు,కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నర్సింహ్మమూర్తి అర్చక బృంధం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్ధానం ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఏఈఓలు దోర్బల భాస్కర్‌శర్మ, ఆకునూరి చంధ్రశేఖర్, వేముల రామ్మోహన్‌లు పాల్గొన్నారు.
ఏకశిఖరుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుండి ఏడు రోజుల పాటు దేవదేవుడికి దివ్యవాహాన సేవలను నిర్వహించనున్నారు. నేడు శనివారం ఉదయం మత్స్యావతారం ఆలంకారం సేవ, రాత్రి శేషవాహన సేవలతో స్వామివారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు.
ధార్మిక సంగీత మహాసభలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు కూడా నేటి నుండి ప్రారంభంకానున్నాయి. కొండపైన సరస్వతి కళామందిరంలో నిర్వహించే ధార్మిక సభల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణాచారి, దేవాదాయశాఖ కమీషనర్ యన్.శివశంకర్, ప్రభుత్వవిప్ ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్‌లు హాజరుకానున్నారు.