రాష్ట్రీయం

యాగం ఏర్పాట్లు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, డిసెంబర్ 10: ఈ నెల 23నుండి 27వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని తన ఫాంహౌస్‌లో నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర సుభిక్షం కోసం కెసిఆర్ తలపెట్టిన ఈ యాగం పనుల ఏర్పాట్లు నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ యాగానికి రాష్టప్రతితో పాటు ప్రధాన మంత్రి, గవర్నర్ తదితర ముఖ్యులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. 108 హోమగుండాలు, యాగశాలలు, పీఠాధిపతులకు వసతి సౌకర్యాలు, భారీ పార్కింగ్, హెలిప్యాడ్‌లు ఏర్పాట్లు చేయగా, యాగస్థలానికి ముందు భారీ స్వాగత తోరణాలను ఏర్పాట్లు చేశారు. యాగశాల పరిసర ప్రాంతాన్ని బాంబు, డాగ్ స్కాడ్‌లతో అణువణువునా పరిశీలించి రక్షణ చర్యలు చేపడుతున్నారు. డిఎస్‌పి శ్రీ్ధర్ ఆథ్వర్యంలో ఇద్దరు సిఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 100మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.