ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? మార్చి 20 నుండి 26 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ప్రణాళికాబద్దంగా పనులను పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. కొన్ని విషయాల్లో స్నేహితులు అండగా నిలుస్తారు. గృహంలో మార్పులు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. దంపతులు అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు. పెట్టుబడులకు అనుకూలం. సామాజిక సంబంధాలు బలపడుతాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగులు మెరుగైన పనితీరుతో అధికారుల మన్ననలు పొందుతారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సమయానికి ధనం అందుతుంది. ఖర్చులున్నా ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఇబ్బందులు తొలగుతాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ఆదాయం బాగుంటుంది. సంతాన సౌఖ్యం. ముఖ్యమైన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. స్థాన మార్పులు ఉన్నాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆగిపోయిన పనులను కొత్త ఉత్సాహంతో పూర్తి చేస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)
మీ ఆలోచనా పటిమతో శక్తికి మించిన పనులు చేస్తారు. నష్ట ద్రవ్య లాభం పొందుతారు. సాంఘిక కార్యక్రమాల్లో గౌరవ మన్ననలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు బంధుమిత్రులతో కలిసి దర్శిస్తారు. ఇంటి కార్యక్రమాలు ఒక కొలిక్కి వస్తాయి. దంపతులు పట్టింపులకు పోకుండా పనులు చక్కబెట్టుకోవాలి. మానసిక తృప్తి లభిస్తుంది. మీ మాటకు ఎదురులేకుండా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, విద్యా రంగాల వారు అనుకున్న ఫలితాలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
స్థిర నిర్ణయాలతో పనులు అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక, విద్య, వినోద, కళారంగాల్లో ముందడుగు వేస్తారు. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. సంతాన అభివృద్ధి సాధ్యం. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుని పైచేయి సాధిస్తారు. దంపతులు సమన్వయంతో పనులు పూర్తి చేసుకుంటారు. శుభకార్యాలు కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వదంతులకు దూరంగా ఉండండి. అప్రయత్న ధనలాభముంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
స్వశక్తితోనే మీ పనులు చక్కబెట్టుకోవాలి. ధైర్యంతోనే సత్ఫలితాలు సాధ్యం. మిత్రులతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశముంది. ఇతరుల మాటలను తేలికగా నమ్మవద్దు. కొత్త పనులు వాయిదా వేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. విద్య, ఉద్యోగ, వృత్తి, కళలు, రాజకీయ రంగాలవారు లబ్ధి పొందుతారు. పెట్టుబడులు స్వల్పంగా లాభిస్తాయి. గాభరా పడకుండా ముఖ్యమైన పనులు పూర్తి చేయటం మంచిది. దైనందిన కార్యాలందు స్వీయ పర్యవేక్షణ అవసరం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
చాకచక్యంతో పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. దంపతులు అన్యోన్యతతో ఉంటారు. సంతాన భాగ్యం పొందుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు మంచి ఫలితాలను పొందుతారు. కోపతాపాలు లేకుండా వ్యవహరించడం మేలు. ఆదాయానికి లోటుండదు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కుటుంబ సఖ్యత గోచరిస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. మీ మీద ఆధారపడిన వారికి సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి అవకాశం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. దంపతుల మద్య స్పర్థలు తొలగి అన్యోన్యంగా ఉంటారు. సాంకేతిక పరికరాలు కొంటారు. పొగడ్తలకు దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్ స్వల్పంగా లాభిస్తుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. కోపతాపాలు నియంత్రించుకోవాలి. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవటం మేలు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. హద్దుల్లో ఉండటం మంచిది. అప్రయత్న ధనలాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగార్థులు స్థిరత్వాన్ని పొందుతారు. స్పెక్యులేషన్ అనుకూలం. భాగస్వామ్య వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రయాణాలు శుభకరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)
పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది. ధైర్యంతో ఆ పనులు పూర్తి చేస్తారు. అవసరానికి మిత్రులు ఆదుకుంటారు. అవగాహన లేని పనుల జోలికి వెళ్లొద్దు. శుభకార్యాల్లో పాల్గొని మంచి గుర్తింపు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. దంపతులు ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఓర్పు, నేర్పుతో కాలక్షేపం చేయటం మేలు. ఆదాయ వ్యయాలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థులు పట్టుదలతోనే ఫలితాలను పొందుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
అప్రయత్నంగా అన్ని పనులు పూర్తవుతాయి. ధనాదాయం బాగుంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన బదిలీలు ఉంటాయి. అధికారుల మన్ననలు పొందుతారు. గృహ మార్పులున్నాయి. మీ ప్రమేయంతో సంఘంలో కొన్ని సమస్యలు తొలగిపోతాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
అనుకున్న పనులు సానుకూలంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్పెక్యులేషన్ వ్యవహారాల్లో వాయిదా మేలు. వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు విజయవంతమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుంది. దంపతులు భేషజాలకు పోకుండా ఉంటే ప్రశాంతత సాధ్యం. ఎవరినీ నిందించకండి. పొగడ్తలకు లొంగకండి. ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ధన వ్యయమయినా, అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలందు లాభాలు గడిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్పెక్యులేషన్ స్వల్పంగా లాభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇతరుల కార్యాల్లో అనవసరంగా తలదూర్చకండి. కొత్త వాహనాలు, ఆభరణాలు కొంటరా. ఓ వార్త మీకు ఆనందాన్నిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855