ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
నిర్దిష్ట ప్రణాళికలతో మీరు పనులు పూర్తి చేస్తారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుతాయి. అధికారుల మెప్పు పొందుతారు. మీ కృషి సామర్థ్యం ఫలిస్తాయి. సహచరుల సహకారంతో పనులు వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన కార్యాలు కొద్దిపాటి ధన వ్యయంతో పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, వ్యాపార రంగాల వారికి లాభం చేకూరుతుంది. ప్రలోభాల్లో పడకండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పెట్టుబడులకు అనుకూలమైన కాలం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
స్వయంకృషితో పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో మీ మార్గదర్శకత్వం అవసరపడుతుంది. వాగ్వివాదాలకు చోటివ్వకండి. అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు ఎంత కష్టపడినా ఫలితాలు అంతంత మాత్రమే. మిత్రులు, బంధువులతో కలిసి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని రీతిలో గుర్తింపు లభిస్తుంది. ఖర్చులను నియంత్రిస్తారు. బకాయి పనులు పూర్తి చేయగలరు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)
స్వీయ పర్యవేక్షణతో లక్ష్యాలను చేరుకొంటారు. పనులు పూర్తవుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. సొంత ఇంటికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించండి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. పెట్టుబడులకు అనుకూలం. కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి. అదనపు బాధ్యతవల్ల ఆరోగ్యం స్థిమితంగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. ఇల్లు, వాహనాలు, విలువైన ఆభరణాలు సమకూర్చుకో గలుగుతారు. ధనం సమయానికి అందటంవల్ల ఖర్చులకు వెనుకాడరు. సమస్యలు వచ్చినా స్వ నిర్ణయాలతో పరిష్కరిస్తారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కళారంగాల వారికి మంచి పరిణామం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. సరైన సమయానికి పనులు పూర్తి చేయటం మంచిదని గుర్తించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
మీ పనుల నిర్వహణలో ఇతరుల ప్రభావం పడకుండా జాగ్రత్త పడండి. లోగడ పూర్తి కాని పనులు స్వీయ పర్యవేక్షణలో పూర్తి చేయనున్నారు. పెద్ద ఆశీస్సులతో, పై అధికారుల సూచనలతో ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఇంటా బయట కొన్ని సమస్యలున్నా మెల్లిగా సమసిపోతాయి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రహస్య సమాచారం అందుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ప్రయోజనకరమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. పలు మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది. అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటారు. దంపతుల మధ్య అవగాహన అవసరం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఈ వారం అన్ని పూర్తి చేయగలుగుతారు. ఇతరుల సలహాలు పాటించినా, విశే్లషణతోనే పూర్తి చేయటం మేలు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వాహనం ఖరీదు చేస్తారు. ఆదాయ వ్యయాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు హామీలు ఇవ్వొద్దు. విలువైన పత్రాలు జాగ్రత్త. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. ప్రారంభంలో కొన్ని పనులు నత్తనడకన వున్నా తర్వాత సజావుగా పూర్తవుతాయి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కళా, రాజకీయ రంగాల వారు కొత్త పనులను వాయిదా వేసి ప్రస్తుత విషయాల్లో జయం ఉందని గ్రహిస్తారు. సాహిత్య, పత్రికా రంగాల వారికి శుభప్రదమైన సమయం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)
స్వ నిర్ణయాలతో పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులు ఉన్నత చదువులకు ప్రణాళికలు వేసుకొంటారు. విలువైన వస్తువులు కొంటారు. దంపతులకు అనుకూల సమయం. పెట్టుబడులందు జాగ్రత్త వహించడం మేలు. ముఖ్యమైన వార్తలు సంతోషాన్నిస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
కుటుంబంలో ముఖ్యమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. పనులు పూర్తి చేస్తారు. ధనాదాయమున్నా, ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. ఐ.టి, న్యాయ, వైద్య రంగాల వారు వారి పనుల్లో జయాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శత్రువులు మిత్రులవుతారు. పుకార్లను నమ్మకండి. ఆందోళన చెందవద్దు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
వ్యవహారాలు మందకొడిగా సాగినా, చివరికి ఇతరుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల అనారోగ్యం కలవరపెడుతుంది. ఆదాయ వ్యయాలు నియంత్రణలోనే ఉంటాయి. ఏకాగ్రత అవసరం. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకొంటాయి. ప్రయాణాలు చేస్తారు. ఆహార, పానీయ సేవనంలో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఇతరులు చెప్పింది విని, మీ నిర్ణయాలతో పనులు పూర్తి చేయడం మేలు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆటంకాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనం నడపటంలో అప్రమత్తత అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు జయాన్ని పొందుతారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. దంపతుల మధ్య అవగాహన అవసరం. సూటిపోటి మాటలకు, కొట్లాటలకు తావీయకండి. ముఖ్యమైన పత్రాలు, సమాచారం ఆనందాన్నిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855