ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? ఏప్రిల్ 24 నుండి 30 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
వ్యవహార దక్షతతో రాణిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ఆత్మీయులకు మీ సలహాలు ఉపకరిస్తాయి. ఉద్యోగ, వ్యాపార, విద్య, వాణిజ్య రంగాల వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ధనాదాయం బాగుంటుంది. ఖర్చులున్నా సమయానికి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు ఇరుగు పొరుగు వారితో చెప్పి వెళ్లటం మంచిది. అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆచితూచి వ్యవహరించటం మంచిది. ధనాదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగ, వాణిజ్య, వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. దంపతులు అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి. ముఖ్యమైన పత్రాలు పొందుతారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)
లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బకాయి పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల వారు ప్రగతిని సాధిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్ర్తిలకు అనుకూల సమయం. వారి పేరున తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. సంతాప ప్రాప్తి. విందు వినోదాలలో పాల్గొంటారు. శక్తి సామర్థ్యాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఎంతటి కష్టమైన పనులైనా లౌక్యంతో పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల మన్ననలను పొందుతారు. ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ప్రయాణాలందు పరిసరాలను గమనించండి. మీ సలహా సంప్రదింపుల ద్వారా వ్యాపార, ఆస్తి వ్యవహారాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యం తృప్తికరం. విలువైన ఆభరణాలు ఖరీదు చేసినా సంతోషం ఉండదు. శుభకార్యాలు కలిసి వస్తాయి. పబ్లిక్ రిలేషన్లు రాణిస్తాయి. కొత్త పనులను వాయిదా వేయండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
పరిశీలనాత్మక ధోరణితో వ్యవహరించండి. పనులు పూర్తవుతాయి. ధనాదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికం. ముఖ్యమైన పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రశాంతచిత్తంతో కార్యాలు తలపెట్టండి. అనుకోని ధనాదాయం. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధ సేవనం కూడా చేయాల్సి రావచ్చు. ఉద్యోగులు, వ్యాపారస్తులకు పని వత్తిడి అధికం. వ్యాపార, వ్యవసాయదారులకు ముందున్నది మంచి కాలమన్న భావనతో కృషి చేయండి. దాంపత్య యోగం. విలువైన వస్తువులు, స్థలాలు కొనే అవకాశం ఉంది. ధనం ఆలస్యంగానైనా అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
పనులు ప్రారంభించకండి. బంధుమిత్రుల సాయం కోరండి. పనులు పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ జోక్యం అవసరం. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ధైర్యంతో వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్య, వ్యాపార, కళారంగాల వారు తమదైన పద్ధతిలో గుర్తింపును తెచ్చుకొంటారు. సమయానుకూలంగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేసుకోవాలి. దంపతుల మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆలోచన ముఖ్యం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఇతరులతో వాదులాటలు వద్దు. సామరస్యంతో కార్యాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహన సౌఖ్యం. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల వారు మంచి ఫలితాలను పొందుతారు. ఆదాయానికి చింతించాల్సిన పని లేదు. అనవసర అప్పులు వాయిదా వేయండి. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ధన, ధాన్య లబ్ధి. శుభకార్యాలు కలసి వస్తాయి. మానసిక తృప్తి లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ప్రణాళికలు కలిసివస్తాయి. పనులు పూర్తి చేస్తారు. అనుకోని వ్యయం ఉన్నప్పటికీ సమయానికి పైకం సర్దుబాటవుతుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు, విందు వినోదాలలో పాల్గొంటారు. పబ్లిక్ రిలేషన్స్‌లో గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు ఎక్కువవుతాయి. వ్యవహారాలు పరిష్కారమవుతాయి. సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు గోచరిస్తున్నాయి. దంపతులు ఒకరినొకరు గౌరవించుకొంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)
కార్యదక్షతతో కార్యక్రమాలు జయప్రదంగా పూర్తి చేస్తారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తికరంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఓర్పు, నేర్పు మేళవింపులతో బకాయి పనులు పూర్తి చేస్తారు. భేషజాలకు లొంగకండి. దంపతుల మధ్య అవగాహన కుదిరి ఆనందంగా ఉంటారు. ఆలోచనలు ఎల్లవేళలా అవసరం. స్పెక్యులేషన్ తృప్తికరం. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలస్యంగానైనా పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల పట్ల పునరాలోచన మంచిది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సమగ్ర పర్యవేక్షణ అవసరం. సాంఘికంగా రాణింపు. జీవన సౌఖ్యం. లబ్ధి పొందుతారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అకారణ కలహాలు, మాట పట్టింపులు కూడదు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరుల దృష్టి ఎల్లప్పుడూ మీ మీదనే ఉంటుందని గమనించండి. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. నిరుత్సాహాన్ని దరి చేరనీయకండి. ఉద్యోగులకు పని వొత్తిడి అధికమవుతుంది. ఇతరుల వ్యవహారాలను మీద వేసుకోవద్దు. వృత్తి, వ్యవసాయ, వ్యాపారాల వారికి కృషికి తగిన ఫలితం ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు వద్దు. నూతన ఏజెన్సీలు, వ్యాపార విస్తరణలకు అనుకూలం. సమభావన అవసరం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
జయప్రదంగా పనులు పూర్తి చేస్తారు. సంతాన ప్రాప్తి. ఆరోగ్యం సంతృప్తికరం. పోటీ పరీక్షలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. రుణ బాధలు కొంతైనా తీరుతాయి. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. లాభాలు పొందుతారు. శుభకార్యాలు కలసి వస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855