ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
స్వశక్తితో కార్యానుకూలత. వృత్తి, వ్యాపార, ప్రయాణ సాధనాల ఏజెన్సీలు, సాంకేతిక రంగాల వారు ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాదులందు కదలికలుంటాయి. ప్రయాణాలలో సౌకర్యాల లేమి ఉన్నప్పటికీ ప్రయోజనాలుంటాయి. వెంటాడే సన్నిహితులను ఒక కంట కనిపెట్టండి. నూతన వ్యాపారపు భావనలు వాయిదా వేసుకోవాలి. తగుమాత్రం ఆదాయం ఉంటుంది. అదనపు ఖర్చులకై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు శ్రమపై అనుకున్నవి అందుకుంటారు. అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటారు.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
పనులు నిర్వహించేటప్పుడు తగిన ఆలోచన అవసరం. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల ప్రయోజనాలుంటాయి. వ్యాపారములందు చెల్లింపులు ముఖ్యం. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. సంతాన ప్రాప్తి. పాఠశాల, వైద్యశాల విస్తరణలకు అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులకు పైకం కేటాయించవలసి వస్తుంది. ప్రయాణాదులందు జాగ్రత్తలు పాటించాలి. దేహ బడలికలుంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన కుదురుతుంది. వృత్తి, విద్య, వ్యాపారాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. స్పెక్యులేషన్ తృప్తికరం.
మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆదాయంకన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. అన్నింటా పర్యవేక్షణ అవసరం. ఆస్తి వ్యవహారాలందు అప్రమత్తంగా మెలగాలి. యంత్ర, వాహనాదులందు మెలకువ మేలు. ఉద్రేకం, కోపతాపాలకు తావివ్వకండి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆలయ సందర్శనం. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు ఇబ్బందులు ఉన్నప్పటికీ, సర్దుకుంటాయి. పర్యవేక్షణ, సామరస్య ధోరణి అవసరం. కుటుంబ వ్యక్తుల ఖర్చులు అంచనాలకు మించకుండా చూసుకోవాలి.
కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆరోగ్య సమతుల్యతతోనే కార్యాలు పూర్తి చేసుకోవాలి. వృథా ప్రయాసలు వద్దు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి మెరుగవుతుంది. రియల్ ఎస్టేట్‌లో అభివృద్ధి. అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మెరుగైన ఫలితాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలందు ఆభరణాలు జాగ్రత్త. పాత బాకీలు వసూలవుతాయి. శత్రువులపై మీకు ఆధిక్యత లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీతో సంతోషాన్ని పంచుకుంటారు. విడిపోయిన హితులు కలుసుకుని ప్రయోజనాలు పంచుకుంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
గడచిన కాలంకన్నా ప్రస్తుత కాలం మీకు కలసి వస్తుంది. మీవల్ల మేలు పొందిన వారు మిమ్ములను అవమానించే మార్గాలు వెతుకుతుంటారు. జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య అవగాహన మెరుగవుతుంది. సంతాన వృద్ధివల్ల సంతోషాలను పంచుకుంటారు. ప్రయాణాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. విలువైన వస్తువులతో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలు అవసరమైతేనే చేయాలి. మొబైల్స్, ఎటిఎం, డెబిట్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
శుభకార్యాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉద్యోగులకు, అన్ని వృత్తుల వారు మిశ్రమ ఫలితాలందుకుంటారు. పెట్టుబడులు, రాబడులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. తడబాటుతనం, ఎడబాటుతనం వద్దు. ముఖ్య సమస్యల నుంచి బయటపడతారు. విందు, వినోదాలందు మిత్రులతో కలిసి పాల్గొంటారు. సంఘ కార్యాలందు మీదైన పద్ధతిలో రాణిస్తారు. ఇతరుల సమస్యల విషయంలో జోక్యం కూడదు. దీనివల్ల అపహాస్యం కావొచ్చు. వృత్తి, ఉద్యోగాదులు మెరుగైన ఫలితాలు అందిస్తాయి. అనుకున్న వారు వస్తారు. కావలసినవి ఇస్తారు.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఆదాయ వ్యయాలందు తృప్తి. ఉద్యోగులకు శ్రమానుగత, క్రమానుగత ప్రమోషన్లు, బదిలీలుంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఊపందుకుంటాయి మీకు అనుకూలంగా. మీ మాట విలువ పెరుగుతుంది. ప్రయత్న కార్యాలందు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఒకే పనిని మరల మరల చేయాల్సి రావచ్చు. ఇంటి నిర్మాణానికి, పిల్లల చదువులకు ధనం పోగు చేస్తారు. వ్యాపారాలు, వృత్తులు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాల వారు మంచి ఫలితాలను అందుకుంటారు.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
అభివృద్ధి మార్గంలో కార్యసిద్ధి. అన్నింటా మీదే పైచేయి అవుతుంది. డైరీ, వ్యవసాయ రంగాల వారు మేలైన ఫలితాలందుకుంటారు. పరిశ్రమ రంగాల వారు వ్యాపారాభివృద్ధికై ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అకాలంగా ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యం ఇబ్బందుల్లో పడవచ్చు. ఉద్యోగులకు స్థాన చలనాలు, వ్యాపారస్థులకు కొత్త అవకాశాలుంటాయి. రాజకీయ, ఆధ్యాత్మిక పెద్దలను కలుసుకుంటారు. ప్రయోజనాలు, ఆశీస్సులు అందుకుంటారు. ధన లాభం. వస్త్ర లాభం. విదేశీ ప్రయాణ యత్నాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
విద్యార్థులు లక్ష్యాన్ని సాధిస్తారు. కళాశాల మార్పులుంటాయి. క్రీడలందు ఆసక్తి అధికమవుతుంది. యోగ ప్రాముఖ్యతను గుర్తిస్తారు. అన్నింటా ప్రయోజనాలు పొందుతారు.క్రమానుగత పెట్టుబడులు రాబడులకు అనుగుణంగా ఉంటుంది. సమయానికి అప్పులు లభిస్తాయి. నిరాశా నిస్పృహలతో మెసలవద్దు. ఆరోగ్యం పదిలం. దంపతులు సంఘ కార్యాలందు నిమగ్నమవుతారు. స్పెక్యులేషన్ స్వల్పంగా మేలు. అవకాశాలను చేజార్చుకోవద్దు. కుటుంబ సభ్యులు ఆలోచనలు, మీ ఆలోచనలకు అనుగుణంగా లాభాలందుకుంటారు. వదంతులు నమ్మకండి. శుభాలు కలుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
సమస్యలున్నప్పటికీ పరిష్కార దిశలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలలో అనుకూలత. వాహన ప్రమాదాలు జరుగకుండా వేగ నియంత్రణ పాటించండి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. కష్టాలున్నా సంయమనంతో ఇష్టాలుగా వాటిని మరల్చుకుంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన కుదరటం వల్ల వ్యవహారాలు సక్రమంగా వొనగూడుతాయి. భూ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఖర్చులకై ధనాన్ని సమకూర్చుకుంటారు. అందరి మాటలు వినండి. మీ స్వీయ విచక్షణతో పని చేయటం మేలు.
కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
అనుభవం, ప్రాభవం వల్ల మంచితనంతో పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందులున్నా ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకొని, ప్రణాళికల మేరకు కార్యాలను ఆవిష్కరిస్తారు. స్థాన మార్పులుంటాయి. ప్రయాణాలు, యాత్రలు చేస్తారు. ఎదురుచూస్తున్న వారు అనుకోకుండా వచ్చి సంతోషపరుస్తారు. శక్తికి మించి పొగడ్తలకు లొంగి అధిక ద్రవ్య సాయ విషయాల్లో ఆలోచించండి. వృత్తి, వ్యాపార, పరిశ్రమ, వైద్య, న్యాయ రంగాల వారు సత్ఫలితాలను అందుకుంటారు. అకాల భోజనాలు వాయిదా వేయండి. ఔషధ సేవనం తప్పదేమో. ఒకటి అనుకుంటే మరొకటి మీ కనుకూలంగా మారుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రయాణాలందు, వాహనం నడిపేవారు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ, విద్య రంగాల వారు అనుకోని ఫలితాలు పొందుతారు. ఆదాయ లావాదేవీలను సమీక్షించుకోవాలి. రాబోయే ఖర్చులకై ధనాన్ని సముపార్జిస్తారు. మనశ్శాంతితో పనులు చక్కదిద్దుకోవాలి. ఎవరి ధోరణి వారిది అన్నట్లు కుటుంబ సభ్యుల వ్యవహారాలున్నా, మీ నేర్పుతో, ఓర్పుతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలందు విలువైన ఆభరణాల విషయంలో అప్రమత్తత అవసరం. నూతన పరిచయాలు ఆనందాన్నిస్తాయి.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855