ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (అక్టోబర్ 9 నుండి 15 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

పనులను సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాలు మెరుగవుతాయి. పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలందు ఉత్సాహంతో పాల్గొంటారు. దంపతులు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు బదిలీలు ఊపందుకుంటాయి. ప్రయాణాలు, స్థల మార్పులుంటాయి. మాట పట్టింపులకు పోవద్దు. తరచుగా మీ వద్దకు వచ్చేవారిని గమనించండి. వాహనప్రాప్తి, స్నేహ సంబంధాలందు సంతృప్తి. బంధువులు మిమ్మల్ని, మీ పనులను మెచ్చుకుంటారు. బాకీలు వసూలవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలు జరుగనున్నాయి. ఇతరుల పొగడ్తలకు లొంగకండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎదురుచూస్తున్నవి మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఆలోచనా దృక్పథం మార్చుకుంటరా. శుభకార్యాలు కలసి వస్తాయి. చేసే పనులందు పర్యవేక్షణ అవసరం. ఆర్థిక సర్దుబాట్లుంటాయి. చివరి క్షణంలో ముఖ్యమైన పనులు కొన్ని పూర్తవనున్నాయి. వస్తు, వాహనాలు పొందుతారు. కొన్ని పనులు పదేపదే చేయాల్సి వస్తుంది. అనుకోని ప్రయాణాలున్నాయి. అప్రమత్తత అవసరం. వాతావరణం అనుకూలంగా ఉండి కార్యాలు సిద్ధిస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

శుభకార్యాలు కలసి వస్తాయి. అనుకోకుండా ఆదాయం అందుతుంది. మిత్రులు, బంధువులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక, వ్యవహారిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతులు సయోధ్య పాటిస్తారు. కోపతాపాలు దరికి రానివ్వకండి. నూతన పరిచయాలు లాభిస్తాయి. సంతాన ప్రాప్తి. నిబద్ధతతో పనులు పూర్తి చేస్తారు. గమనింపు అన్నింటా మంచిది. స్ర్తిలు ఆరోగ్య సూత్రాలు పాటించండి. విలువైన వస్తువులు పొందుతారు. ప్రయాణాలందు అప్రమత్తత మేలు. స్పెక్యులేషన్ మిశ్రమం. మీ నిర్ణయాలు ఫలిస్తాయి. అందరినీ గమనించండి. తగాదాలు వద్దు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

స్వయంకృషితో పనులు పూర్తి చేస్తారు. అన్నింటా సంతృప్తిని అందుకుంటారు. వ్యాపార విషయంలో తగాదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగాలందు మార్పులుంటాయి. ప్రయత్న కార్యాలందు అనుకూలతలున్నాయి. కుటుంబ సభ్యులు శుభాలు అందుకుంటారు. ఆరోగ్య విషయాలందు అప్రమత్తత అవసరం. స్పెక్యులేషన్ మిశ్రమం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు మెరుగవుతాయి. మిత్రులు సమయానికి సాయం అందిస్తారు. విలువైన వస్తువులు పొందుతారు. అనుకోని ప్రయాణాలు. ఖరీదైన వస్తువులతో ప్రయాణం క్షేమకరం కాదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

గత వారం కంటె ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం తృప్తినిస్తుంది. ప్రణాళికల మేరకు మీరు ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు బంధుమిత్రులతో కలిసి వెళ్లే అవకాశముంది. ఆరోగ్యం ఫరవాలేదు. దంపతుల మధ్య అవగాహన మెరుగవుతుంది. కుటుంబ సభ్యులకు అనుకూల సమయం. ఆస్తి విషయాలందు ఆలోచన, అప్రమత్తత అవసరం. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకుంటారు. శత్రువులతో దూరంగా ఉండటం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. శుభకార్యాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలందు ఇతరుల ప్రమేయం లేకుండా ముందుకు వెళ్లండి. పుణ్యక్షేత్ర దర్శనం, ఆధ్యాత్మిక ప్రయాణాలుంటాయి. సంఘ కార్యాలందు హితులతో కలిసి పాల్గొంటారు. మిత్రుల వ్యవహారాల్లో మార్గదర్శకత్వం వహిస్తారు. అన్ని విషయాలందు సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలందు అప్రమత్తత అవసరం. సమయానికి ధనం అందుతుంది. నూతన వస్త్రాలు, వస్తువులు అందుకుంటారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పనులు పూర్తి చేస్తారు. అన్ని కార్యాలు ఒకేసారి చేయవద్దు. ఇతరుల పర్యవేక్షణ ఉన్నా మీరూ గమనింపుతో మెలగాలి. ఆస్తి వ్యవహారాలు చర్చకు వస్తాయి. రాజకీయ రంగంలో పలుకుబడి వృద్ధి అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. ప్రయాణ సౌఖ్యం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారి ఆటంకాలున్నా నియంత్రణతో పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చి పరిష్కారమవుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

కార్యాలు పూర్తి చేస్తారు. వివాదాలు సమసిపోతాయి. నూతన వ్యాపార, సేవా రంగాల వారిలో శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఆదాయ లావాదేవీలందు అప్రమత్తత అవసరం. అనుకున్న పత్రాలు దొరుకుతాయి. గందరగోళం మధ్య ఏ పనీ చేయవద్దు. పోటీ పరీక్షలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులున్నాయి. చేసే పనులందు ఆలోచనలు, దృష్టి పెట్టండి. స్ర్తిలు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహార విషయాలందు శక్తికి మించి చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

గత వారంలాగే ఈ వారం కూడా పనులు పూర్తవుతాయి. పోటీతత్వం అన్నింటా ఉంటుంది. అనుకోకుండా ముఖ్యమైన ఖర్చులకు పైకం అవసరమవుతుంది. సమయానికి పైకం అందుతుంది. ఇతరులకు పైకం సర్దుబాటు విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆలోచనలను పాటించండి. తప్పిపోయాయి అనుకున్నవి పొందే అవకాశముంది. వృత్తి, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాల వారు మెరుగైన ఫలాలందుకుంటారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక భావనలు వృద్ధి అవుతాయి. ఉద్యోగులు సమిష్టిగా కృషి చేస్తేనే సత్ఫలితాలు అందుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అన్నింటా సహాయ సహకారాలు అందుకుంటారు. మాట పట్టింపులకు పోవద్దు. వృత్తి, ఉద్యోగాలందు తరచూ మార్పులుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమవుతారు. నిరుత్సాహాన్ని దరి చేరనీయకండి. ప్రయాణాలు, శుభకార్యాలు అనుకూలం. ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలం. శ్రద్ధ ఆసక్తి పెంచుకుంటేనే. స్ర్తిలు బృంద కార్యాలందు పాల్గొంటారు. అవివాహితులకు మంచి రోజులు. ప్రయాణాలందు జాగ్రత్తలు పాటించటం మేలు. శత్రవులపై విజయం సాధిస్తారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

సంఘంలో పేరు ప్రఖ్యాతులు మెరుగవుతాయి. కష్టాలున్నా ఇష్టమైన పనుల ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. వ్యవహారాలందు మిత్రుల సాయంతో వివాదాలను పరిష్కరిస్తారు. మీ ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు మంచి సమయం. మీ మాటల చాతుర్యంతో శుభకార్యాలు సఫలమవుతాయి. చుట్టుపక్కల వారిని గమనించండి. ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా ఏ పనీ చేయవద్దు. అన్నింటా ప్రాధాన్యత మేరకు పనులు పూర్తయి మీకు సంతృప్తి నిస్తాయి. వాహనాలు ఇతరులకు ఇచ్చేటపుడు జాగ్రత్త పాటించాలి. నూతన వాహనాల ప్రయత్నాలు మెరుగవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయ వ్యయాలు పోటీ పడనున్నాయి. ఇతరులతో మాట్లాడేటపుడు అప్రమత్తంగా ఉండాలి. వాహన, భూ వసతి, ఇతర సౌకర్యాల చర్చలు సఫలమవుతాయి. వివాహ ప్రయత్నాలు మెరుగయ్యేట్లు చూడండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అన్ని రంగాల్లో పోటీతత్వం పెరుగుతుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యాలందు పెద్దల ఆశీస్సులు, మన్ననలు పొందుతారు. చేజారినవి అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855