ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( డిసెంబర్ 11 నుండి 17 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

భేషజాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, విద్య, వైజ్ఞానిక, యంత్ర రంగాల వారు ఆలస్యంగానైనా అనుకున్నవి అందుకుంటారు. ఆశయాలు నిరాశలు కావు. సమయానికి కుటుంబ సభ్యులు, బంధు వర్గం సాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అవకాశాలను వినియోగించుకోవాలి. ఆర్థిక అసమానతలు లేకుండా ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రయాణాదులందు విలువైనవి చేజారకుండా చూసుకోవాలి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

మేలైన ఆలోచనా విధానంతో కార్యాలు పూర్తి చేస్తారు. ఒక లావాదేవీలో లాభపడతారు. కోర్టు వ్యవహారాలుంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకొంటారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రతిభతో అధిగమిస్తారు. గిట్టనివారి దుష్ప్రచారం ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు కొత్త విధానాలు అనుకూలిస్తాయి. కలహాలకు స్వస్తి చెప్పండి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

కచ్చితత్వంతో ముందడుగు వేస్తారు. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఇష్టులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మన్ననలను అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు, చిత్రాలు, నోటీసులు అందుతాయి. అన్యమనస్కంగా ఉండకండి. వృత్తి వ్యాపారాదులు మామూలుగా ఉండాలి అనే భావన మేలు. అధిక స్టాక్స్ పెట్టుకోవద్దు. కమ్యూనికేషన్స్‌తో ఇబ్బంది రావచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్లండి. శుభాలు ప్రారంభం. ప్రలోభాలకు లొంగకండి. హితులు అనుకొన్న వారు ఇబ్బంది పెట్టవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అంకిత భావంతో పనిచేయండి. అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు జరుగకుండా జాగ్రత్త పడాలి. శుభవార్తలు వింటారు. గెలుపు వరిస్తుంది. సమిష్టి నిర్ణయాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అవరోధాలు, విరోధాలను అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు దశ, దిశ మార్చుకుంటాయి. మొహమాటం వద్దు. భవిష్యత్ ప్రణాళికలు మేలు. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

పోటీ పరీక్షలందు విద్యార్థులకు, ఉద్యోగులకు శుభ పరిణామం. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు. అవివాహితులకు వివాహ యత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారాలు మెరుగవుతాయి. అనవసర ఆలోచనలు కూడదు. ఆదాయ యత్నాలు ఫలిస్తాయి. వ్యయాలు ఆలోచింపజేస్తాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. మార్పులకు అవకాశముంది. ఆస్తి విలువలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. స్పెక్యులేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. సంభాషణలు భూషణంగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

కొత్తగా చేపట్టే పనులు వాయిదా వేయండి. రోజువారీ పనులు మేలు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బంది కల్గించవచ్చు. వృత్తి, ఉద్యోగస్థులు పెద్దల సహకారంతో మెళకువలు తెలుసుకుంటారు. చిరు వ్యాపారస్థులు లాభపడతారు. శుభకార్యాలు కలసి వస్తాయి. అనుకున్న ధనం సమయానుకూలంగా అందనుంది. వ్యతిరేక భావనలు ఎందులోనూ వద్దు. హద్దు మీరి ప్రవర్తించకండి. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య సూచనలు. ఆందోళన వద్దు. భాగస్వామ్యాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. మిత్రులు, హితులు, సన్నిహితులు మీకై ఒకటవుతారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అనుకూల వాతావరణంలో అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. లోగడ పెండింగ్‌లో వున్నవి సన్నిహితుల సాయంతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్, పూజా సామాగ్రి, సాంకేతిక, ఎలక్ట్రానిక్ పరిశ్రమల వారు అనుకున్న లాభాలను అందుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకుంటారు. తెలివితేటల్తో అందర్నీ ఆకట్టుకొంటారు. స్ర్తిలు ఆస్తి ఏర్పాటు చేసుకుంటారు. నూతన వ్యవహారాల్లో లాభాలు చూస్తారు. శత్రుత్వంపై ఆధిక్యత. ఆదాయ వ్యయాదులు అనుకోకుండా అంచనాలు మించుతాయి. రావలసిన పైకం వసూలు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఐచ్ఛికత్వంతో మీ ఆలోచనలకు అనుగుణంగా కార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. ఇతరులకై ఖర్చు చేయవలసి వచ్చినపుడు ఆలోచించడం మంచిది. విలువైన వస్తువులతో ప్రయాణాలు జాగ్రత్త. ఆహ్లాదకర వాతావరణంలో స్ర్తిలు మిశ్రమ ఫలితాలందుకుంటారు. వాహన మార్పులు. భార్యాభర్తల మధ్య అవగాహన కుదురుతుంది. అనుకున్నవి సాధిస్తారు. సంతాన ప్రాప్తి. సంతాన సౌఖ్యం. స్పెక్యులేషన్ అనుకూలం. నూతన పరిచయాలందు పరిమిత ప్రయోజనాలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

కుంటుపడకుండా కార్యాలు పూర్తి చేసుకోవాలి. ఎవరో వచ్చి సాయపడతారని బద్దకంతో ఉండకండి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం ఫరవాలేదు అనుకుంటారు కానీ ఔషధ సేవనం తప్పనిసరి. స్ర్తిలు ఆర్థికంగా లాభపడినా, ఖర్చులు బాగా చేయవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగ, వృత్తి, ఉత్పత్తులు విపత్తులు దాటేట్లు ప్రయత్నించాలి. మిత్రుల సహాయం ఆలస్యంగా దొరుకుతుంది. దంపతులు ఏకీకృతంతో కుటుంబానికి అంకితమవుతారు. సంఘంలో గౌరవ మన్ననలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలాలందుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ప్రయాణాలందు అలసత్వం వద్దు. వాహనాలను వేగంగా నడపకండి. అనుకోని అతిథులు వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అనుకున్నవి వేరే విధంగా జరిగేట్లుంది. ఆదాయం సమయానికి అందుతుంది. వృధా ఖర్చులు. ఆభరణాలు, వస్త్రాలు, బహుమతులు ప్రాప్తి. వృత్తి, వస్త్ర, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాల వారు అనుకున్నవి అందుకుంటారు. విద్యార్థులకు కృషి మేరకు ఫలితాలు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్ర్తిలకు ఆర్థిక ఉన్నతి. మాట విలువ పెరుగుతుంది. సంతానాభివృద్ధి. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

పనులు నత్తనడకనయినా పూర్తవుతాయి. జీవితంలో స్థిరత్వానికి అవకాశం ఉంది. ఆందోళన వద్దు. మాటల్లో నేర్పును, ఓర్పును చూపాలి. స్ర్తిలు విలువైన మాటలతో అభివృద్ధిని అందుకుంటారు. ప్రణాళికలు వేసుకొని లబ్ధిని పొందుతారు. వాతావరణానికి అనుకూలంగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ప్రయాణాలందు అప్రమత్తత అవశ్యం. దంపతులు సంయమనం పాటించాలి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాలందు మార్పులుంటాయి. బదిలీలు, పదోన్నతులు, అదనపు బాధ్యతలు శ్రమకు గురి చేస్తాయి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

వౌనంతో పనులు నిర్వహించాలి. పరిశీలన అన్నింటా మేలు. వృత్తి, వ్యాపారాల విస్తరణకై ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఆర్థిక స్థితికి అనుకూలంగా మెలగండి. స్ర్తిలు స్వయంప్రతిపత్తితో ఎదుగుతారు. అడగాలా వద్దా, తెలపాలా వద్దా అన్న సంశయం వద్దు. ధైర్యంతో ప్రవర్తించండి. సుఖమయం, స్నేహమయం. వివాద రహితాలకై యత్నించండి. పెట్టుబడులు రాబడికి అనుకూలంగా ఉంటాయి.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855