ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (జనవరి 1 నుండి 7 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అనుకున్నట్లు చేపట్టిన పనులు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతోషాన్నిస్తాయి. ఆలస్యం ఆశాభంగంలా ఉంటుంది. వినోదాలు, ఉత్సాహ కార్యాలందు నిమగ్నమవుతారు. ఆర్థిక స్వావలంబన వృద్ధి, బంధుమిత్రుల రాకపోకలు ప్రయోజనకారిగా ఉంటాయి. అన్నింటా ప్రగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు పోటీ పరీక్షలందు జయం. విదేశీ యత్నాలు ఉపకరిస్తాయి. తడబాటు వద్దు. గమనింపుతో వ్యవహరించాలి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కొత్త పరిచయాలు ఆలోచింపజేస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
స్వయంకృషితో, నిబద్ధతతో పనులు పూర్తి చేస్తారు. సమిష్టి నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆదాయ వ్యయాలు అంచనాలను మించనున్నాయి. అనుకోకుండా పైకం సర్దుబాటవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో శ్రమకు గురికావలసి వస్తుంది. మిత్రులు సాయపడతారు. కుటుంబ సమస్యలు సంయమనంతో పరిష్కరించుకుంటారు. మీ మాట, చేతల విలువ పెరుగుతుంది. వాదులాటకు తావివ్వకండి. పూర్వ మిత్రులతో కాలక్షేపం. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలందు మితిమీరిన వేగం వద్దు. సంకల్పం నెరవేరుతుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ధనధాన్యాభివృద్ధి. సంతోషాలు పంచుకుంటారు. మనస్సాక్షిగా వ్యవహరించండి. త్వరిత నిర్ణయాలు క్షేమకరం కాదు. ఆటంకాలున్నా జయం పొందుతారు. వాతావరణానికి అనుగుణంగా మెలగండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మెరుగైన విధంగా మలచుకుంటారు. ఆస్తి విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. శత్రుత్వంపై మిత్రత్వం గెలుస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు, చిరుద్యోగులకు మేలైన అవకాశాలు లభించనున్నాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని ఆటంకాలున్నా అంతిమ విజయం మీదే. మిత్రులు సమయానికి వచ్చి సాయపడతారు. ఆదాయ వ్యయాదులు ఆలోచింపజేస్తాయి. డబ్బు సమస్యలు వచ్చే అవకాశముంది. ముఖ్య కార్యాలందు స్వీయ వీక్షణ మేలు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విదేశీ విద్య, ప్రయాణాలు నెరవేరుతాయి. ఉద్యోగాలందు మార్పులుంటాయి. అధికారులు, పెద్దల ఆశీస్సులున్నప్పటికీ ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటం మంచిది. స్పెక్యులేషన్ ఫరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
వర్తమాన కాలం నుంచి భవిష్యత్తును వీక్షిస్తారు. బంధుమిత్రులు మీకు సాయపడతారు. గృహ లాభం గోచరిస్తోంది. విద్య, వ్యాపార, వ్యావహారిక విజ్ఞానం, అనుకోని ఘటనలు మీ నైపుణ్యంతో మెరుగవుతాయి. తోటివారి సలహాలు సత్ఫలితాలను అందిస్తాయి. వృత్తిలో గుర్తింపు. దంపతులు సామరస్య ధోరణితో ముందుకెళతారు. ఆదాయ వ్యయాలు అంచనాలను మించుతాయి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. విలువైన పత్రాలు అందుకుంటారు. తగాదాలు, వివాదాలు జోలికి వెళ్లవద్దు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
చిన్నచిన్న పనులైనా అలసత్వం పనికిరాదు. సమయపాలన అన్నింటా మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. దంపతులు సందేహాస్పదంగా ఉండకండి. ప్రయాణాలందు జాగ్రత్త వహించాలి. మీ చేతలు, మాటలు కీర్తిని తెచ్చిపెడతాయి. ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బంది. ఆటంకాలు దూరమవుతాయి. మీ వల్ల ఆత్మీయులు లాభ పడతారు. దూర ప్రయాణాదులు కలసి వచ్చినా, డబ్బు సమస్య వచ్చే అవకాశముంది. స్పెక్యులేషన్, పెట్టుబడితో రాబడి అంతంత మాత్రం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
నిర్దిష్ట పథకాలతో ముందుకెళతారు. పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల అండదండలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతాయి. ఆందోళనలు తగ్గుతాయి. గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వస్తు, వాహన మార్పులు గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. విలువైన వస్తువులు ఇబ్బంది పెట్టేట్లున్నాయి. అన్నింటా అందరికీ అప్రమత్తత, ఏకాగ్రత ఉత్తమం. వ్యాపారాలు పోటీకి గురవుతాయి. వృత్తిలో భాగంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి సఫలం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
మీ మిత్రులకు మంచి సలహాలిస్తారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు దూరమవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆదాయ వ్యయాలు తృప్తికరం. ఆకస్మికంగా పైకం అందుతుంది. ఒత్తిడికి లోనుకాకండి. విలువైన పత్రాలు జాగ్రత్తగా భద్రపరచుకోండి. ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. ఖర్చు విషయంలో నియంత్రణ అవసరం. మీ పనులు, బాధ్యతలలు స్వయంగా సంయమనంతో చూసుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్ ఫలప్రదం. క్రీడాకారులకు శుభప్రదం. శ్రీమతి సలహాలు ఉపయుక్తంగా ఉంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
అన్నింటా గోప్యత, స్పష్టత పాటించాలి. సంప్రదింపులు, ఒప్పందాలు, స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. గాబరా పడకుండా అప్రమత్తంగా ఉంటే చాలు. ఆర్థిక అంచనాలు తారుమారు అవనున్నాయి. అధికారులకు అనుకూలంగా మెలగాలి. పెద్దల మన్ననలు పొందుతారు. సంఘంలో గుర్తింపు పొందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్ సంతృప్తికరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
కార్యసాధనకు నేర్పు, ఓర్పు ప్రధానం. అవకాశాలను గుర్తించి అందిపుచ్చుకోవాలి. ఎవరు చెప్పినా కాదనకుండా విని, స్వీయ నిర్ణయానుకూలంగా వర్తించాలి. ఆదాయ వ్యయాదులు ఆలోచింపజేస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. దొంగతనాలు జరిగేట్లున్నాయి. అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా మాటలు, అపనిందలు పడవలసి వస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్తదనాన్ని ఆవిష్కరించుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
పోటీదారులు అన్ని రంగాల్లో ఉంటారని గుర్తించండి. అన్ని విషయాల్లో స్వీయ పర్యవేక్షణ, పరిశీలన అవసరం. ఆదాయం వున్నా సంబంధిత బంధుమిత్రుల ప్రమేయం వల్ల లోటుపాట్లు ఉండవచ్చు. వృత్తి యందు అనుకోని సాంకేతిక మార్పులు రానున్నాయి. విద్య, వైద్య, ప్రింటింగ్, పేకేజింగ్, డెయిరీ రంగాలలో అనుకూల మార్పులుంటాయి. వ్యాపార విస్తరణకు మంచి కాలం. అనుకున్నది మార్పులు చేర్పులకు లోనయి పనులు నెరవేరనున్నాయి. దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. పొలాలు, స్థలాల విలువ తారుమారవుతుంది. ఒక విషయం ఆలోచింపజేస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆత్మీయత, మానవీయ కళా రంగాలు వృద్ధిని చూస్తాయి. కార్యాలు పూర్తి కావాలంటే ఇష్టపడి పని చేయాలి. ఆలోచించి, పరికించి ఎంచుకున్న మార్గాన వెళ్లటం మేలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. పైకం సమయానికి అందుతుంది. స్ర్తిలవల్ల మీ పనులు వేగవంతమవనున్నాయి. పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి. స్పెక్యులేషన్ తృప్తినిస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది. సంతోషపరమైన ఘటనలు పునరావృతం అవనున్నాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855