ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (జనవరి 22 నుండి 28 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
సాలోచనలతో చేయవలసిన కార్యాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు ఉపకరిస్తాయి. పోటీ పరీక్షలందు కష్టంపై నెగ్గుకొస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వైద్య రంగాల వారు గతంలో కంటె వృద్ధిలో ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థికంగా ఫరవాలేదనిపిస్తుంది. వాహన ప్రయాణంలో జాగ్రత్త వహించండి. ఆభరణాలతో ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అవసరాలను గుర్తించి వ్యయాన్ని నియంత్రించుకోవాలి. వెంటవెంట కొన్నింటిని మరల మరల చేయవలసి రావచ్చు. స్పెక్యులేషన్ మిశ్రమం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. వదంతులు వ్యాప్తి చేసేవారు మీకు ఎదురవుతారు. ఆందోళన విడనాడండి. ఆర్థిక లావాదేవీలపట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ ఫర్వాలేదు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆహార విహారాదులందు నియమాలు పాటించండి. గొలుసు దొంగతనం జరిగేందుకు అవకాశం ఉంది. వాహన ప్రమాదం. విలువైనవి ఖరీదు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఏకాగ్రతతో ముందుకెళతారు. అధికారుల, పెద్దల ఆదరాభిమానాలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలందు అనుకూలత. సరైన సమయానికి పైకం అందుతుంది. కొన్ని సమస్యలు పరిష్కరించుకొంటారు. ఎంచుకున్న రంగాలు, పెంచుకున్న ఆశలు ఇబ్బంది కలిగించవచ్చు. ప్రయాణాలుంటాయి. వాహన రిపేర్లుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. స్ర్తిలు విలువైన వస్తువులు పొందుతారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మంచి వార్తలు వింటారు. బోనస్, ఇంక్రిమెంట్లు, ఆర్థిక లాభాలుంటాయి. స్పెక్యులేషన్ స్వల్ప లాభం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్నవి జరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండకండి. ప్రభుత్వంతో పనులు సజావుగా జరిగే అవకాశాలున్నాయి. మంచివారిని గుర్తించండి. ఈ సమయం ప్రయోజనకారిగా ఉంటుంది. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి. వృత్తులందు అన్నింటా పోటీ తత్వముంటుంది. విలువైనవి చేజారకుండా జాగ్రత్త వహించండి. గౌరవ మన్ననలు అందుకుంటారు. క్రయ విక్రయాదులందు అప్రమత్తత మేలు. ఆర్థిక విషయాలు ఫరవాలేదు. స్ర్తిలు, నిరుద్యోగులకు శుభ సమయం. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని పరిణామాలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక లావాదేవీల్లో దిశా నిర్దేశం చేసుకుంటారు. అనుకోనివి కూడా మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. మీ మార్గదర్శకత్వంలో సంఘ కార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు మెరుగవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. దంపతులు అనుకున్నవి మెల్లగా సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాలు పూర్తవుతాయి. విలువైనవి పొందుతారు. అనుకోని రంగాలందు ప్రవేశం లభిస్తుంది. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఆత్మబలంతో వృద్ధిని పొందుతారు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

పెళ్లికాని వారికి అనుకూల వాతావరణం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకున్నట్లుగా జరుగుతాయి. అయితే అనుకోని చోట, వేరే ప్రదేశాల్లో ఉండాల్సి రావచ్చు. అధిక పైకంతో ప్రయాణాలు చేయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రైవేటు రంగాల వారికి వృద్ధి సూచనలున్నాయి. ఆర్థిక, వ్యయాలు పొంతన లేకుండా ఉంటాయి. ఖర్చును తగ్గించుకోవాలి. స్ర్తిలు అపనిందలు పడకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో సంతోషాలుంటాయి. కీర్తి లాభం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెట్టుబడులకు, రాబడులకు అనువైన సమయం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

తులనాత్మక పరిశీలన, పర్యవేక్షణలతో అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైద్య, సాంకేతిక, చిల్లర వ్యాపారాలు మెరుగవుతాయి. స్ర్తిలు వీలువెంట అనుకూల వాతావరణంలో అనుకున్నవి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్వేగాలు మారుతుంటాయి. సంయమనం పాటించాలి. ఆదాయ వృద్ధి. ఖర్చులు నియంత్రించుకోవాలి. విదేశీ విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇబ్బందులు కలిగినా లౌక్యంతో లాభాలను అందుకుంటారు. స్పెక్యులేషన్ అనుకూలం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

సూక్ష్మ పరిశీలన, స్వశక్తితో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కొత్త ఆలోచనకు పునాది వేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, పాడి రంగాలు మెరుగవుతాయి. మంచి వార్తలు వింటారు. నిరుద్యోగులకు చిరుద్యోగాలు. ప్రైవేటు రంగాల వారికి అనుకూల మార్గాలు ఊపందుకుంటాయి. మీ పెట్టుబడితో సరైన రాబడిని అందుకుంటారు.రియల్ ఎస్టేట్ వారికి విస్తరణకు అవకాశం. దూర ప్రయాణాలు. ఇతరుల వ్యవహారాలందు జోక్యం వద్దు. సంప్రదింపులు మెరుగవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ప్రతి పనిలో ఉత్సాహాన్ని చూపిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. విలువైనవి ఖరీదు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను వినియోగించుకోవాలి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారు వృద్ధిని చవి చూస్తారు. నూతన పరిచయాలు ప్రయోజనాలిస్తాయి. స్పెక్యులేషన్ అనుకూలం. చిన్నచిన్న ఆటంకాలెదురైనా నిబద్ధతతో వాటిని అధిగమిస్తారు. ఒకరి రాక మీకు సంతోషాన్నిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఆర్థిక లాభాలు, ఖర్చుల నియంత్రణ ఉంటాయి. ఊహకు అనుకూలంగా అన్నీ పూర్తి చేసుకుంటారు. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఊపందుకుంటాయి. ఆస్తి విలువలు వృద్ధి అవుతాయి. సమయానికి హితులు సాయపడతారు. సంతాన ప్రాప్తి. కుటుంబ సభ్యులకు ఆర్థిక స్వావలంబన ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణ సౌఖ్యం లేకున్నా ఫలవంతమవుతుంది. బంధుమిత్రుల కలయిక. నూతన పరిచయ లాభం. శారీరక సౌఖ్యం. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాన్నిస్తుంది. అన్నింటా జాగ్రత్త అవశ్యం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆరంభమైన పనులు లౌక్యంతో పూర్తి చేయనున్నారు. ఆర్థికానుకూలతలు, అసమానతలు తొలగనున్నాయి. మానసిక తృప్తితో కుటుంబ సభ్యుల సాయంతో అనుకున్న ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు. టెన్షన్లున్నా అటెన్షన్‌తో అన్నీ అనుకూలంగా మార్చుకుంటారు. విదేశీ యత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇల్లు మార్పు, స్థల సేకరణకు అనుకూల సమయం. దంపతులు, నిరుద్యోగులకు శుభ సమయం. వాహన ప్రయాణాలందు జాగ్రత్త. స్పెక్యులేషన్ మిశ్రమం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అపారమైన తృప్తిని అందుకుంటారు. బుద్ధిబలంతో పనులు పూర్తి చేయనున్నారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కొన్ని ఇబ్బందులున్నా అనుకున్నవి పొందుతారు. చివరకు మీదే విజయం. స్పెక్యులేషన్ ఫలప్రదం. స్వశక్తితో ఉన్న స్థితులను జయప్రదం చేసుకుంటారు. హితుల సాయంతో అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. స్పెక్యులేషన్‌పై దృష్టి పెట్టండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855