ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (మార్చి 5 నుండి 11 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న పనులందు కార్యసిద్ధి. సంయమనంతో పనులు నెరవేర్చుకుంటారు. సమర్థతో సమస్యలను పరిష్కరించుకుంటారు. గతం కంటె శుభ సమయం. ఆర్థిక లాభ మార్గాలు. ప్రయాణాలు మెరుగవుతాయి. కొత్త పనులు లౌక్యంతో పూర్తి చేస్తారు. స్ర్తిలకు అనుకున్నవి అందేట్లున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో సమర్థవంతంగా మెలగుతారు. ఆశించిన ఫలాలు సమయానికి అందుకుంటారు. స్పెక్యులేషన్ మిశ్రమం. కొత్త పనులు ముందంజలో సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అందిపుచ్చుకునే సమయం. గృహంలోకి వస్తువులు సమకూర్చుకుంటారు. వాహన, భూ వసతి యోగాలు. ఆర్థిక పుష్టి. ఏకాగ్రత మీ నిర్ణయాలకు ఉపయోగపడుతుంది. దంపతులు సమిష్టిగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబానికై సుఖ సంతోషకరమైన కార్యాలు చేస్తారు. విందు వినోదాలందు బంధుమిత్రులతో పాల్గొంటారు. స్పెక్యులేషన్ దీర్ఘకాలం యోగిస్తుంది. ముందు ప్రణాళికలు యోగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి మార్గం సుగమం. సంతాన సౌఖ్యం. సాలోచన అన్నింటికీ మంచిది. వృత్తి, వ్యాపార ఉద్యోగాలు మెరుగవుతాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

అనుకున్నట్లు అన్నీ అవుతాయనే భావన వద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శ్రద్ధ వహించండి. ప్రయాణాలలో జాగ్రత్త. విలువైన ఆభరణాలతో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. తొందర నిర్ణయాలు వద్దు. మిత్రుల సాయం అందుతుంది. స్ర్తిలు కొత్త జీవితాన్ని చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక రంగాలకు శుభప్రాప్తి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభ సూచకం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శ్రమానుకూలంగా ఉంటాయి. అన్నింటా గుర్తింపును తెస్తుంది. సంఘ కార్యాలందు మీదైన పద్ధతిలో పాల్గొని ప్రశంసలు పొందుతారు. చెల్లింపులు జరుగుతాయి. వాయిదా పడిన కార్యాలు పూర్తవుతాయి. మీ ఉత్సాహం మీకు ఆనందాన్నిస్తుంది. స్తోమత మరచి హామీలు ఉండకండి. పనులు హడావిడిగా నిర్వహించకండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాల్సిన సమయం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక లావాదేవీలు సంతోషాన్నిస్తాయి. మీ వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాలు గతం కంటె బాగుంటాయి. శుభ కార్య ప్రయత్నాలు మెరుగవుతాయి. మీ సూచనలు హితులకు మార్గదర్శకత్వం అవుతుంది. దంపతులు మెరుగైన జీవితానికై ప్రయత్నిస్తారు. కొంచెం అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. స్పెక్యులేషన్ మిశ్రమం. ఏజెన్సీలు, టెండర్లు, బృంద కార్యాలకు అనుకూలం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

వేడుకలకు హాజరవుతారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతం కంటె మెరుగవుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభ వర్తమానాలు వింటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాదోపవాదాలకు దిగవద్దు. స్పెక్యులేషన్ ఫలప్రదం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పనుల్లో కార్య అనుకూలత. అన్నింటా మంచి ఫలితాలు అందుకుంటారు. ధన లాభం. వస్తు ప్రాప్తి. వాహన యోగం. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. సంప్రదింపులు ఆనందాన్నిస్తాయి. మీ ప్రతిపాదనలు అనుకూలిస్తాయి. బద్ధకం విడనాడండి. విశ్రాంతి తీసుకోండి. అవివాహితులు శుభ వార్తలు వింటారు. విద్య, వ్యాపార, వృత్తులు ఫలప్రదం. పరిచయాలు పెరుగుతాయి. ప్రయోజనకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్ మిశ్రమం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్న కార్యాలు సఫలీకృతం. మానసిక ఆందోళనలు దూరమవుతాయి. విజయం సాధిస్తారు. మీ నిర్ణయాలు మీవే. ఇతరుల ప్రమేయం వద్దు. విందు వినోదాల్లో బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు కొత్త పుంతలు తొక్కేట్లున్నాయి. పంతాలకు పోవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యాలు నెరవేరనున్నాయి. లౌక్యం అన్నింటా మంచిది. శక్తికి మించి హామీలు వద్దు. స్పెక్యులేషన్ మిశ్రమం. స్ర్తిలకు ఆభరణాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

మీ సమస్యల నుంచి బయటపడతారు. హితుల సాయంతో కష్టమైన పనులు పూర్తి చేస్తారు. అభివృద్ధి గోచరిస్తోంది. సుఖశాంతులు, కుటుంబ సభ్యులతో అనుకూలం. కుటుంబ విస్తరణలుంటాయి. ప్రయాణాలందు మెళకువలు పాటించాలి. ఆభరణాలతో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బలపడతాయి. స్ర్తిలు ఏకాగ్రత పాటించాలి. పెద్దల ఆశీస్సులుంటాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. వాహన ప్రమాదాలకు దూరం పాటించండి. స్పెక్యులేషన్ అనుకూలం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అనుకున్నవి పూర్తి చేస్తారు. బంధుమిత్రులు సమయానికి సాయపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. పరిస్థితులు, గతులు మీకు ఈ వారం అనుకూలం. పెట్టుబడి వల్ల రాబడి ధనం అందుతుంది. కొన్ని ఖర్చులుంటాయి. అప్పులు తీరుస్తారు. అనవసరమైన మాటలు వద్దు. ఒక వార్త మీకు ఆనందాన్నిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మెరుగవుతాయి. అనుకున్న లాభాలు అందుకుంటారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

నిర్ణయాలకు అనుకూలంగా పనులు పూర్తి చేస్తారు. మిత్రులు, హితులు అనుకోకుండా పైకం సర్దుబాటు చేస్తారు. ప్రయాణాలందు మెళకువలు అవశ్యం. ఆర్థిక లావాదేవీలు ఫలప్రదమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. చేపట్టిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు అపశృతులు లేకుండా జాగ్రత్త వహించాలి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బకాయి పనులు పూర్తవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. వాహన సౌఖ్యం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

సమస్యలున్నా లౌక్యం, నేర్పుతో వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు మెరుగైన జీవితాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలపడ్డా కొన్ని ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. మీ స్వీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏ పనీ చేయవద్దు. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. మిత్రుల సూచనలు మీకు శక్తినిస్తాయి. సమయానుకూలంగా వ్యవహరించండి. స్పెక్యులేషన్, పెట్టుబడులు ఫలప్రదం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855