ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( మార్చి 19 నుండి 25 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మీ పరిధికి అనుకూలంగానే నిర్ణయాత్మకంగా కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాభివృద్ధి. వ్యాపారంలో అభివృద్ధి. వృత్తిలో ప్రవృత్తికి అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సాయం అందుతుంది. ఆర్థికంగా ఫరవాలేదు. కుటుంబంలో అనుకున్నవి జరుగనున్నాయి. ఉపయుక్తమైన నిరీక్షణ ఉంటుంది. స్ర్తిలు అనుకున్నట్లుగా అన్నీ పొందుతారు. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు మంచి సమయం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

పనులు ఊపందుకుంటాయి. అన్నింటా లాభాలను అందుకుంటారు. ఉత్తమ ఆలోచనల ద్వారా మేలు పొందుతారు. సమస్యలున్నా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ధైర్యంతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహార సరళి గుర్తింపును ఇస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశాలు. దంపతులు శుభ పరిణామాలకు అనుకూలంగా వ్యవహరించాలి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలాలుంటాయి. మిత్రుల సహాయం అందుతుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక నిర్ణయాలు ఆలోచింపజేస్తాయి. మీ ఆలోచనా విధానంలో మంచి మార్పుల ద్వారా కార్యాలు పూర్తి చేస్తారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకండి. మీరు చేసే పనులు మీకు కీర్తిప్రతిష్టలను తెచ్చిపెడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గతం కంటె మంచి పేరు తెస్తాయి. పోటీ తత్వంతో ముందడుగు వేయండి. విద్య, పోటీ పరీక్షల అభ్యర్థులు శ్రమానుకూలంగా వృద్ధి నొందుతారు. విజయం అనుకూలిస్తుంది. మంచి వార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. అన్ని పనులు మీరే చేయాలి అని త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకండి. ఒద్దికగా కార్యసిద్ధి చేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో ప్రయాణాలుంటాయి. పరిస్థితులు అనుకూలంగా మార్చుకోండి. కృషికి అనుకూలంగా ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు అనుకూల వాతావరణం. ఇంటి పనులు లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

లక్ష్యాలకు కక్ష్యలు నిర్ణయించుకొని పూర్తి చేయాలి. ఆర్థిక స్థితిగతులు అనుకూలం. జీవితంలో ఉన్నతిని అందుకుంటారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు కష్టంపై పూర్తి కావలసినట్లు ఇతరుల సాయంతో పూర్తవుతాయి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. విందు వినోదాలలో మిత్రులతో కలిసి పాల్గొని ఆనందాన్ని పొందుతారు. అనుకోని ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్ మిశ్రమం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

కార్యసాధనకు సమయాన్ని ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది. ఆర్థిక విషయాదులు గతం కంటె మెరుగవుతాయి. వస్తు, వస్త్ర లాభాలు అందుకుంటారు. మీ ప్రమేయంతో శుభ కార్యాలు ముందుకెళతాయి. ఆందోళనలతో పనులు నిర్వహించకండి. పనులు పద్ధతిగా చేయండి. ప్రయోజనాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు గతం కంటె ఉన్నతంగా ఉంటాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పరిశీలనాత్మక పర్యవేక్షణతో పనులు పూర్తి చేస్తారు. ఇతరుల రాక మీ విషయాల్లో వేగాన్ని తగ్గించవచ్చు. ఆర్థికంగా ఎదుగుదల. వ్యయ నియంత్రణ అనుకున్నట్లుంటుంది. ఇంటి విషయాలందు ఆసక్తి చూపవలసి వస్తుంది. ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. మీరు చేపట్టిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఇతరులను ఆలోచింపజేస్తాయి. గుర్తింపు లభిస్తుంది. వృద్ధికి సాయం ఉంటుంది. స్ర్తిలు లౌక్యంతో మెలగుతారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

మీ నిర్ణయాలకు అనుగుణంగానే పనులు చేయండి. ఆదాయం ఖర్చుకన్నా వొకింత బాగానే ఉంటుంది. మీకు అవసరమైనవి, ఇంటికి ఉపయుక్తమైనవి ఖరీదుకు అనుకూలం. నిరుద్యోగులకు శ్రమానుకూలంగా ఉద్యోగావకాశాలున్నాయి. ప్రైవేటు ఉద్యోగుల స్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సౌలభ్యం. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అన్నింటా తృప్తి పొందుతారు. వాతావరణం అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆర్థిక వ్యవహారాలు ఆలోచింపజేస్తున్నా పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించండి. వృత్తి, వ్యాపార ఉద్యోగాలు ఫలప్రదం. స్ర్తిలకు శుభప్రదం. ఆభరణాల కొనుగోలు, సమాజ రంగాల్లో మంచి గుర్తింపు, మిత్రుల సాయం లభిస్తుంది. శుభకార్యాలు దగ్గరుండి పూర్తి చేయిస్తారు. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అన్నింటా నియంత్రణ ఉపయుక్తం. స్పెక్యులేషన్ స్వల్ప లాభప్రదం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆలోచనకు అనుగుణంగా పనులు చేయాలి. అవకాశాలు సరైన సమయానికి అందుకుంటారు. మీ సమస్యలు మీ తెలివితేటలతో పూర్తి చేసుకోవటం మంచిది. బంధుమిత్రులు మీ పనులను గమనిస్తారు అన్న విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. విందులు వినోదాల్లో బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు. మీ పనులకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక, హార్థిక ప్రగతి. వాహన యోగం. కొన్ని అవకాశాలు మీకు మంచి గుర్తింపును తెస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు శ్రమాధిక్యత లేకుండా, ఆరోగ్యానికి అనుగుణంగా వ్యవహరించండి. స్ర్తిలు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సాధించాల్సిన కార్యాలు పూర్తి చేస్తారు హితుల సాయంతో. స్పెక్యులేషన్ మిశ్రమం. దంపతుల మధ్య అవగాహన వృద్ధి. పైకం నియంత్రణ మంచిది. అనుకున్నట్లు లక్ష్య సాధన ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక లావాదేవీలు ఫలప్రదం. బాధ్యతలను ఇతరులకు అప్పగించకండి. ఇబ్బందులున్నా సిబ్బంది సాయంతో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకుని గుర్తింపును తెచ్చుకోవాలి. విద్య, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు మాట పట్టింపులు లేకుండా వ్యవహరించుకోవాలి. దంపతులు వదంతులు నమ్మకండి. పరిచయం లేనివారితో అప్రమత్తంగా ఉండాలి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855