ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (ఏప్రిల్ 2 నుండి 8 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక లావాదేవీలందు తృప్తి. అన్ని విషయాలను అనుకూలంగా మార్చుకోండి. అజాగ్రత్త వద్దు. ఉద్యోగ, వ్యాపారపరమైన ఇబ్బందులున్నా సమయస్ఫూర్తితో సర్దుకుంటాయి. వృత్తిలో ఏకాగ్రత మేలు. హితుల వాక్కు మీకు మంచికే యోగిస్తుంది. సఖ్యత అవసరం. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు, స్ర్తిలకు మంచి కాలం. మీ బలం పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

మీ పనులు క్రమశిక్షణతో చేస్తేనే రాణింపు వస్తుంది. పైకం సమయానికి అందుతుంది. గౌరవ మన్ననలు పెరుగుతాయి. అన్నీ సకాలంలో పూర్తి చేయాలనుకున్నా వెనుక ముందు అవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ అవశ్యం. ముందుచూపుతో అవసరమైన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఆదర్శవంతంగా నిలుస్తాయి. స్పెక్యులేషన్ జయప్రదం. ఆభరణాల ధారణ, వాహన ప్రయాణాదులందు మెళకువ పాటించండి. విదేశీ యత్నాలు అనుకూలం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక బలం ఉంది. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. హితులు సాయపడతారు. వాదన మంచిది కాదు. ఒత్తిడితో పనులు చేయకండి. ఇతరులకు హామీలు ఇవ్వకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలు నత్తనడకన నడుస్తాయి. స్ర్తిలు సహేతుకంగా మాట్లాడుతారు. స్పెక్యులేషన్ మిశ్రమం. అభివృద్ధి ఉంటుంది. ఆలోచనలు అందిపుచ్చుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆర్థిక లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అపార అనుభవం వున్న వారిలా ముందుకు దూసుకెళతారు. జీవితంలో ఈ వారం ఓ పాఠంలా ఉంటుంది. బాధ్యతా యుతంగా కార్యాలు నిర్వర్తించండి. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. నిరుద్యోగులకు, ప్రైవేటు రంగాల వారికి అనుకోని లాభాలు. ఆరోగ్యం వాతావరణానుకూలంగా మార్చుకోండి. ప్రశాంత ఆలోచనలు మేలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ప్రణాళికలు లేకుండా పనులు చేయకండి. అన్నింటా మెళకువలు పాటించండి. స్ర్తిలు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు చర్యలు వద్దు. కలివిడిగా ఎంత పనైనా చేయవచ్చు. గౌరవ మన్ననలు, పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ఇతరులకు మీ కార్యాలు మార్గదర్శకత్వం వహిస్తాయి. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. లౌక్యంగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు గతం కంటే మేలు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

శుభకార్యాలు కలసి వస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక రంగాలందు అభివృద్ధి. అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. మీ కార్యాలు కుంటుపడకుండా ఉండేట్లు చూసుకోవాలి. మీరు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. కోపతాపాలను దరికి రానీయకండి. అనుకోని మిత్రులు వస్తారు. స్పెక్యులేషన్ లాభప్రదం. పేరు ప్రతిష్టలు పెరిగేట్లున్నాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అన్నీ పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. పనులు గాభరాగా చేయకండి. ఆర్థిక లాభాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపార రంగాలలో అవకాశాలు మెరుగుపడతాయి. అభివృద్ధి పథంలో దూసుకువెళతారు. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి. మీ నిర్ణయానికి పనులు సానుకూలం చేసుకుంటారు. విందు వినోదాలలో మీ ప్రమేయంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. శుభవార్త వింటారు. దంపతులు ఆందోళన పడకండి. పెద్దల ఆశీస్సులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని అపవాదులు మీద పడేట్లున్నాయి. అధైర్యపడవద్దు. నిర్ణయాలు వాతావరణానికి అనుకూలంగా తీసుకోవాలి. సత్వర విజయం ఉంది. ఆస్తిని అందుకునే అవకాశముంది. నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆలోచనలు అందిపుచ్చుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్ ఫలవంతం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు యధావిధిగా సాగుతాయి. హితులు మీకు సాయపడతారు. మంచి వార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

కోపతాపాలు లేకుండా పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. విజయం మీ వెంటే ఉంటుంది. ధన యోగముంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి వ్యవహారాలు ముందంజలో ఉంటాయి. స్ర్తిలు ఆభరణాలకై ఖర్చు పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్‌లో విజయం. అదృష్టం మీ వెంట ఉన్నా అయిష్టం చూపకండి. మిత్రులు సాయపడతారు. శ్రమకు గుర్తింపు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

హితుల సలహాలు మీకు యోగిస్తాయి. వాయిదా పడుతున్న పనులు ఆలోచనలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార, వృత్తులు పరిణితి చెందుతాయి. అన్నింటా ముందడుగు వేయండి. వెనుకడుగుకు తావివ్వకండి. ఆర్థిక లాభాలుంటాయి. దంపతులు సంవాదాలకు దూరంగా ఉండాలి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. స్పెక్యులేషన్ మిశ్రమం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆవేశాలు వద్దు. అందరినీ ఒకేలా చూడవద్దు. శ్రమ, పట్టుదలతో ప్రయోజనాలు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఆర్థిక బలముంటుంది. వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు చేపట్టే వృత్తి వ్యాపార, ఉద్యోగాలందు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయాణాదులు అనుకూలం. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమానుకూలం ఫలితం. లౌక్యం మేలు. స్పెక్యులేషన్ మిశ్రమం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

మీ పనులు పూర్తి చేసేందుకు ఆలోచించి, లౌక్యం చూపండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగావకాశాలు గతంకంటె మెరుగవుతాయి. దూరపు ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. స్ర్తిలు వాతావరణానుకూలంగా మెలగండి. స్పెక్యులేషన్, పెట్టుబడులు అనుకూలం. ఎవరికీ స్తోమతకు మించి హామీలుండవద్దు. అనుకున్నవి అనుకున్నట్లు మెల్లిగా పూర్తవుతాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855