ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( ఏప్రిల్ 23 నుండి 29 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అనుకున్న పనులు మీ ప్రయత్నానుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వృద్ధి వున్నా ఖర్చులు తగ్గించుకోవాలి. మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఆలోచింపజేస్తాయి. స్పెక్యులేషన్ పెట్టుబడులకు అనుకూలం. లౌక్యంతో పనులు పూర్తి చేయవలసి వస్తుంది. విందులు వినోదాలందు పాల్గొంటారు. ప్రశంసలు, సంబంధిత వారి నుంచి అందుకుంటారు. దంపతులు ఆలోచించే విషయాలు ఇతరులతో పంచుకోవలసి ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
విద్య, వ్యాపార రంగాల వారికి శుభప్రదం. ఉద్యోగులు తోటి వారి సాయంతో ఉన్నతిని అందుకుంటారు. శ్రీమతి సహకారంతో అన్నీ అనుకూలం. ఆర్థిక విషయాలు ప్రోత్సాహదాయకం. స్ర్తిలు సంయమనంతో మెలగాలి. అప్పులు అవసరానికి మించి చేయకండి. ఇతరులకై మీ పనులు దశ, దిశ మార్చుకోకండి. స్పెక్యులేషన్‌లో ప్రతిఫలాలు అందుకుంటారు. అనుకోని ఆదాయం అందుతుంది. కొత్త పరిచయాలు. మతిమరుపు లేకుండా అన్నీ విషయాలలోనూ ఆలోచించటం మంచిది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యూహాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగాలు సమయానికి ఆకళింపుతో వ్యక్తీకరించుకోవాలి. మిత్రుల సాయం అందుతుంది. వదంతులు నమ్మకండి. ప్రయాణాదులు ఆలోచించి చేయాలి. ఆరోగ్యానుకూలంగా వ్యవహరించండి. పెట్టుబడులపై రాబడి ఫలవంతం. అన్నింటా గమనింపు అవశ్యం. ప్రయాణాలు ఆర్థిక లాభాలను అందిస్తాయి. స్పెక్యులేషన్ మార్పులకు లోనవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
అన్నింటా ఉన్నతంగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని గమనిస్తున్నారన్నది గుర్తిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వృత్తిపరంగా మెళకువలు తెలుసుకుంటారు. కోపతాపాలు వద్దు. కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఆస్తి లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతంలా ఉంటాయి. హామీలు వద్దు. వృత్తిపరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు మంచి సమయం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
అధిక భాగం పనులు కుటుంబ సభ్యుల సాయంతో పూర్తి చేయనున్నారు. ఆరోగ్యం జాగ్రత్త. ఫలప్రదమైన ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. స్ర్తిలకు ఉద్యోగ మార్పులు. వృత్తి, వ్యాపార, సేవా రంగాలు విలువను పెంచుకుంటాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. మిత్రులకు మీ సహకారంతో ప్రగతి. ఆర్థిక లాభం. వినోదాలు, విహార యాత్రలు ఉంటాయి. గుర్తింపు వస్తుంది. చేసే వృత్తి, ఇతర కార్యక్రమాలు ఫలప్రదం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఏకాత్మత మంచిది. అనాలోచితం వద్దు. వ్యాపార పరంగా లాభదాయకం. పోటీ పరీక్షలకు అనుకూలం. స్ర్తిలు, దంపతులు, నిరుద్యోగులకు శ్రమానుకూల ఫలితాలు. కుటుంబ సభ్యుల వ్యవహారాలు మీ ప్రమేయంతో ఒక బాటన పడతాయి. వృత్తి, ఉద్యోగాలందు ఊహించని అనుకూల మార్పులు. ఆర్థికానుకూలతతో సంతోషంగా ఉంటారు. ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలందు మెళకువలు మేలు

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అన్నింటా మార్పులు, చేర్పులు. చేతలకు మంచి స్పందన. పనులందు గుర్తింపు. బృంద కార్యాలు, ప్రయాణాలు ఫలప్రదం. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికోన్నతి, పదోన్నతి. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, ఉద్యోగ, విదేశీ వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆందోళనతో పనులు నిర్వహించకండి. పైకం సర్దుబాటులో ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నీ మీకు అనుకూలంగా ఉండనుంది. స్పెక్యులేషన్ లాభప్రదం. మిమ్మల్ని అంతా గమనిస్తారన్న విషయం గుర్తించండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
హితుల పర్యవేక్షణతో పనులు పూర్తి చేస్తారు. తృప్తి అన్నింటా మంచిది. గొడవలు రాకుండా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉండకుండా చూసుకోండి. స్ర్తిల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పైకం వ్యయానికి అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సేవా రంగాలు మెరుగుపడనున్నాయి. హితులు సన్నిహితులవుతారు. స్పెక్యులేషన్ మిశ్రమం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
ఆర్థిక బలహీనతలను దరికి రానీయకండి. అన్నింటా మంచి ఫలితాలుంటాయి. మీ పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల ప్రమేయంతో ప్రయాణాదులు ఫలప్రదం. ఆరోగ్యం జాగ్రత్త. వాతావరణానికి అనుకూలంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సంతోషం మీకు ఆనందాన్నిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఆలోచింపజేస్తాయి. పెట్టుబడులు తృప్తినిస్తాయి. ఇంటి పనులందు ధ్యాస పెట్టండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. దేని కోసం ఎదురుచూడకండి. కొత్త ఆలోచనలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గతం కంటె అనుకూలం. విస్తరణకు అవకాశం ఉంది. స్వవిషయాలు అన్నీ బహిర్గతం చేయకండి. ఆలోచనాత్మకంగా వ్యవహరించండి. రియల్ ఎస్టేట్, భూ విలువలు పెరుగుతాయి. శక్తికి మించి పనులు చేయకండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థికంగా ఫలప్రదం. అనుకోకుండా పైకం ఒకదానికి ఖర్చు అనుకుంటే, మరొక దానికి వ్యయం చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వైద్య, విద్యా రంగాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. స్ర్తిల సాయంతో పనులు తేలికవుతాయి. చర్చలు మీకు అనుకూలిస్తాయి. చదువు, ఉద్యోగ ప్రయాసలు, బదిలీలు మీకు అనుకూలం. విలువైన వస్తువుల విషయంలో మెళకువలు మేలు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
అన్నింటా ఆలోచన పరిశీలన మంచిది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ ప్రమేయంతో ముఖ్యమైన కార్యాలు ఫలిస్తాయి. సంతోషాన్ని ముఖ్యులతో పంచుకుంటారు. ఆరోగ్యపరమైన నియమాలు పాటించాలి. స్ర్తిలకు అనుకోని ప్రయాణాలుంటాయి. డబ్బు విషయంలో మొహమాటం వద్దు. స్పందనకు అనుకూలంగా వ్యవహరించాలి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855