ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? (జూన్ 19 నుండి 25 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యం సఫలీకృతమవుతుంది. అనుకోని సానుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో సఖ్యత మేలు. కృషికి తగ్గ ఫలితాలు ఆలస్యంగా పొందుతారు. మీ మాటల వల్ల ఇతరులకు ఉపకారం కలుగుతుంది. శక్తికి మించిన పనులు చేయకండి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు మంచి ఫలితాలందుకుంటారు. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులు అధికారులతో వాదులాడవద్దు. దంపతులు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టినట్లయితే అనుకున్నవి సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
విజయాభివృద్ధితో పనులు నిర్వహిస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తెలివితేటలతో కార్యాలందు జయాన్ని పొందుతారు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు. విద్యార్థులకు పోటీ పరీక్షలందు ర్యాంకులున్నాయి. వ్యాపారాలందు ఇబ్బందులు రాకుండా యత్నాలు కొనసాగించాలి. ధైర్యంగా పనులు నిర్వహించండి. అలసత్వం వద్దు. ప్రయాణ ఉపయోగాలు అందుకుంటారు. దుందుడుకు పనులు చేయకండి. స్పెక్యులేషన్ స్వల్పంగా అనుకూలిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)
అంకిత భావంతో పనిచేసి విజయం సాధిస్తారు. అదృష్టం సిద్ధిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టవలసి రావచ్చు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలందు మీదైన నేర్పుతో మెరుగైన ఫలితాలందుకుంటారు. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్ర్తిలు హుషారుగా ఉంటారు. పనినే దైవంగా భావించి మన్ననలు పొందుతారు. ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. స్థల మార్పులున్నాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
కార్యసాఫల్యం. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. దూర ప్రదేశాలకు ప్రయాణించాల్సి రావచ్చు. బృంద కార్యక్రమాల్లో బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు. సమస్యలనుకున్నవి సమస్యలు కాకుండా తొలగిపోతాయి. విద్య, వృత్తి, వ్యాపార, కళ, సంగీత, సాహిత్య రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. అన్నింటా జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
లక్ష్య సాధనతో కార్యాలు సాధిస్తారు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్భయంగా పనులు పూర్తి చేయండి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో సఖ్యత మెరుగవుతుంది. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. శుభకార్యాలందు మీ మధ్యవర్తిత్వం ఉపకరిస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయటం మంచిది. వదంతులు నమ్మకుండా సామర్థ్యాన్ని నమ్ముకొని కార్యాలు నిర్వర్తించండి. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ వర్గాల వారికి మేలు కలుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ధనాదాయం వ్యయం ఉపయోగకరంగా ఉంటాయి. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల సహాయం అందుతుంది. మీ మాటకు విలువ, చేతలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలను ఆవిష్కరిస్తారు. సమస్యలను పరిష్కరిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినది ఆలస్యంగానైనా అందుతుంది. సంతానరీత్యా లాభాలు. ప్రలోభాలకు లోనవ్వకండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
తులనాత్మక పర్యవేక్షణతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళిక రచన ఇతరులకు యోగిస్తుంది. వృత్తి, వ్యాపార, కళ, పత్రిక, చేతివృత్తుల వారు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. విద్యార్థులు మంచి జ్ఞాపకశక్తితో, యుక్తితో, అనురక్తితో పరీక్షలలో అనుకూలతను సాధిస్తారు. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. సలహా సంప్రతింపులకై బంధుమిత్రులు మీ వద్దకు వస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కృషి అన్నింటా మెరుగవుతుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
కార్యాలను సాఫల్యం చేసుకుంటారు. ఆశించిన దానికంటే అధికంగా పొందనున్నారు. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. స్వీయ శక్తియుక్తులతో అయిన వారికి మార్గదర్శకత్వం వహిస్తారు. విద్యార్థులకు అన్ని పోటీ పరీక్షలకు మెరుగైన కృషితోనే లక్ష్యం సిద్ధించుకుంటారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు, ప్రయాణాలుంటాయి. దంపతులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించి నిర్ణయించుకొని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. గమనింపు అన్నింటా అవసరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)
ఉన్న అవకాశాలను వినియోగించుకొంటారు. కార్యసిద్ధి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి క్రమాభివృద్ధి ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకోవాలి. జీవన సౌఖ్యం. సాంఘిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఖరీదైన వస్తువులతో ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలందు పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
కార్యాలు సఫలీకృతమవుతాయి. ఆత్మబలం మిమ్ములను అన్నింటా కాపాడుతుంది. ఉద్యోగస్థులకు స్థాన చలనాలు. బదిలీలు, పదోన్నతులకు అవకాశం. బృంద కార్యక్రమాలు దంపతులకు ఉపకరిస్తాయి. విద్య, వాణిజ్య, రియల్ ఎస్టేట్, సాంకేతిక, కళారంగాల వారికి అనుకూలం. మీ మాటలు ఇతరులు వక్రీకరించే అవకాశముంది. సంతానం ద్వారా వృద్ధి. కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తుంది. వస్తువుల ఖరీదునందు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పులుంటాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
పరిష్కార ఆవిష్కార దిశగా కార్యాలనుకూలత. రావలసిన పైకం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలందు తృప్తి. వ్యాపార, వాణిజ్య, వైద్య రంగాల వారు విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది. దంపతులు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ వస్త్ర, వస్తువులు ఖరీదు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడికి అనుకూలమైన కాలం. రావలసిన పైకం మీకు గుర్తుండకపోయినా, లభిస్తుంది. ప్రయాణాలందు మెళకువలు పాటించాలి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
మంచితనంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఆందోళనలున్నా ఖర్చు నియంత్రణతో గట్టెక్కుతారు. శత్రువులు మిత్రులవుతారు. జీవన సౌఖ్యం. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం. ఆరోగ్యానికి ఔషధ సేవనం అవసరం కావచ్చు. శక్తికి మించిన బరువులు మోయవద్దు. విద్యార్థులకు పోటీ పరీక్షలందు విజయం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. స్పెక్యులేషన్ స్వల్పంగా అనుకూలిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855