ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? (డిసెంబర్ 17 నుండి 23 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కీలక విషయాలను వాయిదా వేయకండి. అన్నింటి మీదా మీదే పైచేయి. గృహ మార్పులు గోచరిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు అవకాశాలు మెండు. శ్రమానుకూల ఫలితాలు అందుకుంటారు. స్పెక్యులేషన్‌లో వొడిదుడుకులు లేకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల సఖ్యతకు మీ సలహాలు మేలు చేస్తాయి. సంప్రదింపుల ద్వారా హితుల సమస్యలను పరిష్కరిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
పెట్టుబడులు లాభిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేయనున్నారు. డబ్బు విషయంలో వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. వస్త్ర ప్రాప్తి. వాహన యోగముంది. స్పెక్యులేషన్ మిశ్రమం. మీ సాయంతో శుభకార్యాలు పూర్తవుతాయి. అన్ని పనులూ నెమ్మదిగా పూర్తి చేస్తారు. నిరాశను దరికి రానీయకండి. అన్నింటా తృప్తి పడండి. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది. మతిమరుపును దరికి రానీయకండి. విషయ సేకరణకై వచ్చేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్లున్నారు. అనవసరంగా నిందలు వేస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. మిత్రులతో కలసి ప్రయాణాలుంటాయి. ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ ప్రమేయంతో శుభకార్యాలు ముందంజ వేస్తాయి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. ఎంచుకున్న వృత్తి, వ్యాపార, వ్యవహారాదులు శ్రమానుకూల సత్ఫలితాలను ఇస్తాయి. ధైర్యాన్ని వీడకండి. మంచి పరిణామాలుంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ధన లాభం. విజయప్రాప్తి. పాత బకాయిలు తగ్గించుకుంటారు. మానసికంగా ప్రశాంతత నెలకొంటుంది. దూరపు హితులు వస్తారు. అనుకున్న ప్రయోజనాలు పొందుతారు. అనుకున్నవి సాధిస్తారు. మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. కొన్ని పనులు లౌక్యంతో పూర్తి చేసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

విమర్శించేవారు అధికమవుతారు. అనుకోని శుభ పరిణామాలున్నాయి. ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. చిన్ననాటి హితులను కలుసుకుంటారు. వారాంతంలో మీరు ఎంచుకున్న రంగాల్లో గుర్తింపుని అందుకుంటారు. కొన్ని విషయాల్లో మీ జోక్యం అనివార్యమవుతుంది. ప్రముఖులు మిమ్మల్ని సంప్రదిస్తారు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. ఆంతరంగిక విషయాలు బహిర్గతం చేయకండి. కొత్త పరిచయాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఆర్థిక విషయాలు తృప్తినిస్తాయి. పదవీ యోగం, గౌరవ మర్యాదలు అందుకుంటారు. సన్నిహితత్వాన్ని పెంచుకుంటారు. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు చక్కని గుర్తింపుని ఇస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఆత్మీయుల సాయం అందుకుంటారు. ప్రారంభోత్సవాలలో, శుభకార్యాలలో పాల్గొంటారు. మీ బాధ్యతలను మీరే పూర్తి చేయాల్సి ఉంటుంది. అతిగా ఎవరినీ నమ్మకండి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
పరిశీలనాత్మకత మీకు మేలు చేస్తుంది. శ్రమ అధికం. ఫలితాలు అత్యల్పం. పొరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక స్థిరత్వానికై ప్రణాళికలు వేయవలసి వస్తుంది. అనుకున్న పైకం ఆలస్యంగా అందుకుంటారు. ఆందోళన వద్దు. మీరు ఆశిస్తున్నవి అందుకుంటారు. అన్ని రంగాల్లో సఫలీకృతులవుతారు. మీ పనులు ఇతరులకు సంతోషాన్ని పెంచుతాయి. మీ మాటలను వక్రీకరించే వారున్నారు. గమనించండి. నిదానం మీద శుభ పరిణామాలు అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
విత్తశుద్ధి. ఖర్చులున్నా సమయానికి ఏదో విధంగా పైకం సర్దుబాటవుతుంది. నిరుత్సాహ పడకండి. ప్రయాణాలలో అనుకోని మార్పులు ఉంటాయి. స్ర్తిలతో పనులు లాభిస్తాయి. శుభ వర్తమానాలు వింటారు. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. బ్యాంకు లావాదేవీలందు గోప్యత పాటించాలి. మతిమరపుని దరికి రానీయకండి. విషయ సేకరణకై వచ్చేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్లున్నారు. అనవసరంగా నిందలు వేస్తారు. ధైర్యాన్ని వీడకండి. మంచి పరిణామాలుంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

దైనందిన కార్యక్రమాలకు సమయం కేటాయించండి. ఆర్థిక లావాదేవీలు ఫలవంతం. మీ ధోరణిలోనే పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలు మీ ప్రమేయంతో ముందుకు నడుస్తాయి. ఒప్పందాలకు అనుకూలం. ఎంచుకున్న రంగాలు వృద్ధి చెందుతాయి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలాలను అందిస్తుంది. అనుకోని విధంగా శుభకార్యాలు పూర్తవుతాయి. శుభకాలం. ప్రస్తుతం మీకు నిబద్ధత అన్నింటా ముఖ్యం. కొత్త పరిచయాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
శ్రమానుకూలం జయప్రదం. ఆర్థిక విషయాలందు శుభ పరిణామాలుంటాయి. ఆదాయం విషయంలో అనుకూల వాతావరణం. కొత్త ప్రయత్నాలు అనుకోకుండా పూర్తవుతాయి. వ్యాపార, వ్యవహారాలందు శ్రమానుకూల ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త మిమ్ములను ఆలోచింపజేస్తుంది. వస్త్ర, వస్తు ప్రాప్తి. మానసిక తృప్తి కలుగుతుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ధన సంపాదన, వినియోగం మీకు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలందు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వారాంతంలో ముఖ్యమైన పనులు పూర్తవటం వల్ల సంతోషంగా ఉంటారు. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలు. మీ వ్యవహారాలను కనిపెడుతూండేవారున్నారు. గమనిస్తూ ఉండండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటారు. మీ మాటలు, చేతలు ఎదుటివారికి తృప్తినిస్తాయి. హితులు అవసరమైన సహాయాన్ని అందించనున్నారు. దంపతుల మధ్య అనురాగం నెలకొంటుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలందు శుభ ఫలితాలుంటాయి. ఓర్పు, నేర్పు అన్నింటా అవసరం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855