ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? (జనవరి 7 నుండి 13 వరకుకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కార్యసిద్ధి. విజయప్రాప్తి. అనుకున్నవి ఆలస్యంగానైనా పూర్తవుతాయి. కుటుంబ సమస్యలను పరిశీలనతో పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగంలోని వారు పోటీని ఎదుర్కొనవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. పిల్లలతో సంయమనం పాటించాలి. అన్నింటా లౌక్యంగా వ్యవహరించండి. ప్రతి దానికీ ఎదురు చూడాల్సి వస్తుంది. స్పెక్యులేషన్‌లో తొందరపాటు పనికిరాదు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

పెట్టుబడులు లాభిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేయనున్నారు. డబ్బు విషయంలో వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. వస్త్ర ప్రాప్తి. వాహన యోగముంది. స్పెక్యులేషన్ మిశ్రమం. మీ సాయంతో శుభకార్యాలు పూర్తవుతాయి. అన్ని పనులూ నెమ్మదిగా పూర్తి చేస్తారు. నిరాశను దరికి రానీయకండి. అన్నింటా తృప్తి పడండి. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది. మతిమరుపును దరికి రానీయకండి. విషయ సేకరణకై వచ్చేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్లున్నారు. అనవసరంగా నిందలు వేస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సంతోషకరమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నూతన సమస్యలు లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. స్ర్తిలకు యత్నాలు సఫలమవుతాయ. శక్తికి మించి అప్పు చేయవలసి వస్తుంది. ప్రయాణాదులందు జాగ్రత్తలు పాటించండి. పెట్టుబడులకు వనరులు సమకూర్చుకోండి. పెట్టుబడులు రాబడికి అనుకూలం. ఎదుటివారిని అంచనా వేయడం మరచిపోకండి. సన్నిహితులు, విద్య, వైద్య, వ్యవహార రంగాలు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు.
కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అన్నింటా జయం. మీరు చేపట్టే పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు మేలును కల్గిస్తాయి. ఉద్యోగాలందు అనుకూలత ఉంటుంది. విందులు వినోదాలలో మిత్రులతో కలిసి పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం తృప్తినిస్తుంది. వాహన మార్పులు, సౌఖ్యం ఉంటుంది. స్పెక్యులేషన్ అనుకూలం. పెట్టుబడి ద్వారా రాబడులుంటాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. శత్రుత్వం తగ్గుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక శక్తి పెరుగుతుంది. లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. మిశ్రమ ఫలితాలు కొన్నింటిలో గోచరిస్తున్నాయి. శ్రమానుకూలంగా కార్యాలు అనుకూలిస్తాయి. విషయ అవగాహన ఆలోచనలకు అనుకూలంగా పనులు నిర్వహించండి. వృత్తి, వ్యాపార, వ్యవహారాలలో శ్రమకు గురవుతారు. ఉద్యోగ, ఇంటి విషయాలలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. పెద్దవారితో పరిచయాలు అనుకూలిస్తాయి. ముఖ్య విషయాల్లో గోప్యత పాటించాలి. వాహన రిపేరులుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అన్నింటా శుభాలుంటాయి. సంతోషంగా ఈ వారం గడుస్తుంది. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు ఫలప్రదం. ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎంచుకున్న రంగాలు విస్తరణకు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఐక్యత, సఖ్యతలుంటాయి. ముఖ్యులను కలుసుకుని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అన్నింటా మీదే పైచేయి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
మనఃస్థిమితంతో వ్యవహరించాలి. ఆదాయానికి లోటుండదు. అనుకున్న కార్యాలు తలవని తలంపుగా పూర్తి చేస్తారు. స్నేహమయ వాతావరణం నెలకొంటుంది. సంతాన సౌఖ్యం. మంచి వార్తలు కుటుంబానికి ఉపకరిస్తాయి. నిరుద్యోగులకు ముఖ్యంగా స్ర్తిలకు ఉద్యోగ ప్రాప్తి. పనులందు అభివృద్ధి కానవస్తున్నది. పెట్టుబడులకు చక్కని అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలోచనాత్మకంగా విషయాలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రత్వం విస్తరిస్తుంది. స్ర్తిల మూలక లాభాలుంటాయి. వారాంతంలో పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
కొన్ని ఇబ్బందులున్నా అంతిమంగా జయం పొందుతారు. ఆదాయం కుదుట పడుతుంది. మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షా సమయం. బంధువుల సాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలు సత్ఫలితాలను ఇస్తాయి. దూరపు ప్రయాణాలకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. అనుకున్న కార్యాలు మెల్లగా పురోగమిస్తాయి. హితుల సాయం సమయానికి అందుకుంటారు. గృహ మార్పులున్నాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. నూతన వస్తు ప్రాప్తి. వదంతులు నమ్మకండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

పోరాట ఆరాటాలతో ఈ వారం నడుస్తుంది. ధైర్యంగా ముందుకెళ్లండి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయండి. కొన్ని పనులు మధ్యలో నిలిచేట్లున్నాయి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. అనుకోని సమస్యలు ఉండే అవకాశముంది. సంయమనంతో పరిష్కరించుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చకండి. ప్రయాణాలందు మెళకువ పాటించాలి. అనుకోని శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అంతిమ విజయం మీది అన్నట్లు ఈ సమయం మీకు అనుకూలిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

బుద్ధిబలం, అంగబలం, అర్థబలం కలయికతో ఈ వారం ముందుకెళతారు. ప్రయాణాదులందు మెళకువ అత్యావశ్యకం. చేపట్టే పనులందు మీదే పైచేయిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూసుకోండి. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. శక్తికి మించి రుణాలు ఇవ్వకండి. అప్పుల తిప్పలు పడకండి. ఎంచుకున్న రంగాలలో అభివృద్ధి గోచరిస్తోంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అనుకున్నవి పూర్తి చేస్తారు. సంపద లభిస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు అనుకూల సమయం. వాహన మార్పులు. అనుకోకుండా ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. ఎంచుకున్న రంగాలు వృద్ధి బాటలో ఉంటాయి. వ్యవహారాదులు కలసి వస్తాయి. శత్రుత్వాన్ని నివారించుకోవాలి. సంతాన సౌఖ్యం. కుటుంబంలో ఆనందం విస్తరిస్తుంది. అన్నింటా అవగాహన ముఖ్యం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

వనరులకు అనుగుణంగా వ్యవహరించండి. హితుల సహాయం ఉపకరించినా మీ ఆలోచనల మేరకు పని చేయాలి. అనాలోచిత కార్యాలు ఇబ్బందిని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార, రియల్ ఎస్టేట్ రంగాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు, విద్యార్థులకు అనుకూల కాలం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అన్నింటా పరిష్కార మార్గాలు గోచరిస్తాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855