ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( డిసెంబర్ 4 నుండి 10 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కృషి మేరకే అనుకున్న పనులు పూర్తవుతాయి. అనుకున్నట్లు కొన్ని కార్యాలు ఉన్నా, చివరలో ఆలస్యంగా పూర్తి కానున్నాయి. వృత్తి, వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటిలా ఉంటుంది. చేపట్టినవి సంయమనంతో పూర్తి చేసుకోవాలి. ఆదాయం అవసరాలకు తగ్గట్లు ఉంటుంది. మధ్యవర్తిత్వాలకు, హామీలకు దూరంగా ఉండండి. కుటుంబ సౌఖ్యం. నిరుద్యోగులకు, చిరుద్యోగులకు విద్యార్థులకు కృష్యానుకూలంగా ఫలాలందుకుంటారు. వాతావరణానుకూలంగా ఆరోగ్యం యోగ్యం. సంతాన ప్రాప్తి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

స్ర్తిలదే పైచేయి. పేచీలు లేని జీవితాన్ని గడుపుతారు. ఆదాయ లావాదేవీలు స్ర్తి ప్రమేయంతో గాడిన పడుతాయి. శుభాలను అందుకుంటారు. ఉద్యోగాదులందు అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో పోటీ. ప్రయాణాలందు సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండండి. అనుకోని పైకం అందుతుంది. పెట్టుబడులపై లాభాలుంటాయి. ప్రయాణాలందు విలువైన వస్తువులతో జాగ్రత్త. ఆభరణాలు కొనే అవకాశాలున్నాయి. శక్తికి మించి అప్పులు ముప్పు అని గుర్తించండి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. అన్నింటా అప్రమత్తత అవసరం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

స్ర్తి పురుషులు ఒకే మాటపై ఉంటూ కార్యాలు కొనసాగించండి. వృత్తి, ఉద్యోగాలందు స్వల్ప ఇబ్బందులు. మనసెరిగి, వయసెరిగి ప్రవర్తించాలి. అగ్రిమెంట్లు, అడ్వాన్సుల విషయంలో చికాకులుంటాయి. విద్యార్థులకు కృషికి అనుకూలంగా మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు ఇది పరీక్షా కాలమా అన్నట్లుంటుంది. అన్నింటా సమీక్షలు అవసరం. అదనపు ఆదాయానికి అవకాశముంది. గోప్యతను పాటించండి. దంపతులు తృప్తిని పొందుతారు. స్పెక్యులేషన్ దీర్ఘకాలంలో లాభాలను అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే అనుకున్నవి పూర్తి చేయగలుగుతారు. అన్యమనస్కంగా ఉండకండి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆలస్యంగా పనులు ప్రారంభించినా, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి విలువలు పెరుగుతాయి. స్ర్తిలు అనుకున్నది అందుకుంటారు. శుభ ప్రయాణాలుంటాయి. ఆభరణాలతో ప్రయాణాదులందు అప్రమత్తంగా ఉండండి. అన్ని రంగాల వారు వైవిధ్యాన్ని, అనుకూల మార్పులను చూస్తారు. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

అధిక భాగం కొత్త పనులు మెరుగవుతాయి. విద్యార్థులకు శ్రమానుకూలంగా మంచి ఫలితాలందుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకోని ఉపాధి అవకాశాలున్నాయి. నైపుణ్యాన్ని అన్నింట్లో పెంచుకుంటే భవిష్యత్తు ఆనందమయం. వివరణాత్మక ధోరణితో మెలగాలి. బంధుమిత్రుల సహకారాలుంటాయి. మిషనరీ, వెహికల్స్ మెయిన్‌టెనెన్స్ అధికమవ్వవచ్చు. ప్రయాణాలందు వేగాన్ని నియంత్రించుకోవాలి. స్ర్తిలకు ఉపాధి ప్రాప్తి. సంతాన ప్రాప్తి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలాలు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి కలసి వస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు కలసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. స్పెక్యులేషన్ లాభదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, స్థలాలు కొనాలనుకున్న వారికి మంచి సమయం. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. అనుకోని ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. స్ర్తిల మాట, పలుకుబడి వృద్ధి అయ్యే సూచనలున్నాయి. శత్రుత్వం నశిస్తుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

తులనాత్మక పరిశీలన అవసరం. మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన వ్యాపార సంప్రదింపులకు, వ్యవహారాలకు మంచి సమయం. సంతానంతో సఖ్యత అవసరం. రాబడికన్నా పోబడి తక్కువగా ఉండేటట్లు ప్రణాళిక వేసుకోండి. ఇతరులకిచ్చే సలహాలు, మార్గదర్శకాలు త్వరలో గుర్తింపు పొందుతాయి. విద్య, వైద్య, చేతివృత్తుల వారు అనుకున్నవి ఆలస్యంగా అందుకుంటారు. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవాలి. విషయ చర్చలు పంచుకోవాలి. మంచి మార్గాన్ని ఎంచుకోవాలి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ సభ్యుల సహకారాలుంటాయి. అనుకున్న కార్యాలు లక్ష్యసాధనతో మెరుగవుతాయి. వృత్తి, వ్యాపారాలందు పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల విషయాలందు దూరం పాటించండి. స్వశక్తితో ప్రాధాన్యతలు ఎంచుకోండి. ప్రయాణాలందు మెళకువ మేలు. లక్ష్యాలు నెరవేరుతాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఆర్థిక వ్యవహారాలందు సంతృప్తి. రావలసిన పైకం ఆలస్యంగా అందుతుంది. వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పరిచయ లాభం. సంతానప్రాప్తి. ఆనంద ప్రాప్తి. వృద్ధి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

వృత్తి, వ్యాపారాలు మంచి ఫలాలందిస్తాయి. స్ర్తిలు అధికంగా లాభపడతారు. సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. సమాజంలో మీ కృషి ఫలితంగా పేరు ప్రఖ్యాతులుంటాయి. స్పెక్యులేషన్ లాభదాయకం. ఇతర వృత్తులు చేపట్టే అవకాశముంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. మిత్రవర్గం వారు కలిసే అవకాశాలున్నాయి. యాత్రలు, శుభకార్యాలందు మీ ప్రమేయం గుర్తింపును తెస్తుంది. సంభాషణా సరళి మార్పునకై ప్రయత్నించండి. మెరుగైన ఫలాలందుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పట్టుదలతో కార్యసిద్ధి. కోపతాపాలు దరికి రానీయకండి. ప్రయాణాదులందు అప్రమత్తంగా ఉండండి. ట్రీట్‌మెంట్‌కు కమిట్ అవ్వాల్సి వస్తుంది. అన్నిచోట్ల ఆదరణ మీ లౌక్యం మేరకు పెరుగుతాయి. ఆప్యాయతలు తగ్గుతాయి. ఉద్యోగ, వ్యాపార, నాటక, సాంఘిక, సాహిత్య రంగాల వారు అంకితభావంతో ఉండాలి. నిరుద్యోగులకు, అవివాహితులకు మంచి సమయం. ఇబ్బంది పెట్టేవారిని దూరంగా పెట్టాలి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలు. కొత్త అధికారాలు రానున్నాయి.

కుంభం ( ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రమానుకూలంగా విజయాన్ని పొందుతారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. ఇష్టకార్యసిద్ధి. ఉద్యోగ, వ్యాపార, వృత్తులందు మిశ్రమ ఫలాలందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలందు మీ సూచనలు ఉపయోగపడతాయి. అవసరానికి అనుగుణంగా మారండి. కొన్ని నిర్ణయాలతో తప్పులు దొర్లేటట్లున్నాయి. సరిచూసుకోవాలి. బంధుమిత్రుల ధోరణిని పరిశీలించండి. స్ర్తిలు అనుకున్నది సాధించుకుంటారు. రాబడిపై దిగుబడి మేలు కలుగజేస్తుంది. అన్నింటా పనుల విస్తరణకు అవకాశాలున్నాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం మీ పనులు సాఫీగా సాగుతాయి. పరీక్షలలో విజయం. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయమున్నా ఖర్చులందు నియంత్రణ మేలు. ప్రయాణాదులందు మతిమరుపు లేకుండా ఉండండి. చేసే పనులందు ఏకాగ్రత పాటించండి. సంతాన సౌఖ్యం. వాహన సౌఖ్యం. అన్నింటా మీదే పైచేయి. మాటలవల్ల జయం పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సందర్భానుసారంగా ప్రవర్తించండి. అతిగా ఆలోచించకండి. మీ అర్హతకు ప్రతిఫలాన్ని అందుకుంటారు. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855