నల్గొండ

గుట్టలో పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట,నవంబర్ 29:ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మనర్సింహ్మస్వామి దేవాలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది.పవిత్ర మైన కార్తీక మాసంకావడంతో భక్తులు భారీత్తున తరలివస్తున్నారు. ఆలయ వీధులు మండపాలు యాత్రికులతో క్రిక్కిరిసి పోయాయి.దైవదర్శణం కోసం క్యూకట్టిన భక్తులతో క్యూలైన్లు నిండి భారులు తీరారు.శనివారం మధ్యాహ్నం నుంచే భక్తుల రద్ది నెలకొంది.స్వామి వారి దర్శనానికి 5గంటల సమయం పట్టిందని దర్శించుకున్న భక్తులు తెలిపారు.ప్రసాదాల కొనుగోలు వద్దకూడా గంటల కొద్ది లైను కట్టారు.్భక్తులు నిర్వహించిన వ్రతాలతో సత్యనారాయణస్వామి వ్రత మండపాలు నిండిపోయాయి.స్వామి వారి నిత్యకళ్యాణం లో భక్తులు అధికంగా పాల్గొన్నారు.తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట భక్తుల రద్దీతో కిట కిట లాడింది.మహిళా భక్తులు అధిక సంఖ్యలో కార్తీక ధీపాలు వెలిగించారు.ప్రధాణ ఆలయంతో పాటు శివాలయంలోను భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు.కాగా నిమ్స్‌డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆదివారం వివిద విభాగాల నుండి 34లక్షల 17వేల 500రూపాయలు ఆధాయం సమకూరిందని ఆలయ ఈ ఓ ఎన్.గీత తెలిపారు.
కొండపైన భక్తుల ఇక్కట్లు
దనిక రాష్టమ్రైన తెలంగాణ యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం కొండపైన భక్తులు కనీస వసతులు లేక ఇక్కట్లకు గురయ్యారు.వసతి గదులకొరత,మరోవైపు పుష్కరిణిలో నీటి సమస్య, పుష్కరిణి వద్ద రాత్రి సమయంలో విద్ద్యుత్ లైట్లు వెలగక పోవడం వంటి ఇక్కట్లతో భక్తులు సతమతమయ్యారు. క్రిష్ణావాటరు గత కొంతకాలంగా రావడంలేదు.ముఖ్యంగా కొండపైన నీటి సమస్య,వసతి గదుల సమస్య భక్తులను పట్టి పీడిస్తుంది.ఆదివారం రోజున కేవలం రూ.150టికెట్ దర్శణం,ఉచితదర్శణం మాత్రమే ఉండటంతో సామాన్య భక్తులు రూ.150వెచ్చించి దర్శణం టికెట్ కొనుగోలు చేయలేక నొచ్చుకున్నారు.ఆదివారం రోజున కూడా మిగతా రోజుల్లో మాదిరిగా రూ.100టికెట్ దర్శణం,రూ.50 టికెట్ దర్శణం ప్రవేశ పెట్టి సామాన్యునికి స్వామి వారి దర్శణ భాగ్యం అందుబాటులో ఉండే విదంగా అధికార్లు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు చెప్పారు.ఏది ఏమైనప్పటికి దేవస్ధానం టెంపుల్ డెవలప్‌మెంటు అధారిటి (వైటిడి ఏ) పరిధిలోకి వెళ్లాక భక్తుల సమస్యలు పట్టించుకునే నాధుడే కనిపించడం లేదని స్ధానికులు భక్తులు వాపోయారు.