జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని దేశంలో ఘనంగా నిర్వహించారు. యోగా అంటే ఒకప్పుడు భారతదేశానిదే అనే మాటకు కాలం చెల్లింది. అంతర్జాతీయ వేదికలలో సైతం యోగా విశిష్టితను చాటిచెబుతున్నారు. 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే ప్రాంతాల్లోనూ సైనికులు యోగాను ఆచరించి దీని ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. రాంచీలో 40వేల మంది యోగా సాధకులు పాల్గొన్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరై యోగాసనాలు వేశారు. ఇండో-మయన్మార్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ అసోం రైఫిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు యోగా డేలో పాల్గొన్నారు. గురుగ్రామ్‌లోని బీఎస్‌ఎఫ్ శిబిరంలో జవాన్లు గుర్రాలపై యోగాసనాలు వేయటం ఆశ్చర్యపరిచింది. పంజాబ్‌లోని బీఎస్‌ఎఫ్ జవాన్లు సైతం యోగాసనాలు వేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లా ఇండో-చైనా బార్డర్‌లో యోగా తరగతుల్లో పాల్గొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలోని డోర్నపాల్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు యోగాసనాలు వేశారు. ముంబయిలోని గేట్‌వే వద్ద సినీనటి శిల్పాశెట్టి నేతృత్వంలో యోగాసనాలు వేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండోటిబెటన్ పోలీసులు నదిలోకి దిగి నది యోగా చేశారు.