జాతీయ వార్తలు

యోగా దైనందిన జీవితంలో భాగం కావాలి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: యోగాను ప్రతి దేశం తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం అని అన్నారు. రోగాలు దరిచేరకుండా దోహదపడుతుందని అన్నారు. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. శుక్రవారం అయిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభాత్‌ తారా మైదానంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నేతృత్వం వహించారు. దాదాపు 40వేల మంది యోగా అభ్యాసకులతో మోదీ ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పురాతన పద్ధతులకు ఆధునిక ఫలితాలు జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. యోగాకు వయస్సు, రంగు, కులం, మతం తేడా లేదు. యోగాకు సంపన్నులు, పేదలు అనే తేడా లేదన్నారు.