Others

స్క్రీన్‌పై రేసింగ్‌కు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యంగ్ హీరో శైలేష్ బొలిశెట్టి
బేసికల్‌గా కార్ రేసింగ్ ఛాంపియన్. 2011 నుంచి 2014 వరకూ ఇంటర్నేషనల్ రేస్ సర్క్యూట్స్‌తో బిజీ. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదా దూసుకుపోవడానికి సన్నద్ధమయ్యాడు ఓ యంగ్ హీరో. అనుకోకుండా వచ్చిన ఓ అవకాశం సినిమాపై ఆసక్తి పెంచితే, ఆహార్యం, చురుకుదనం కలిసొచ్చి ‘ముకుంద’ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ స్నేహితుడయ్యాడు. హీరోకి ఫ్రెండ్‌గా అర్జున్ పాత్ర పోషించిన రేసర్, ఇప్పుడు గుర్రమెక్కి చల్‌చల్ అనబోతున్నాడు. ఆ కుర్రాడే -‘చల్‌చల్ గుర్రం’ హీరో శైలేష్ బొలిశెట్టి.
రేసింగ్ రోడ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు.. ఎలా?
టాలీవుడ్‌కు ఎంతోమందిని అందించిన వైజాగ్ సత్యానంద్‌గారు మా కుటుంబానికి మిత్రులు. ఓరోజు పిలిచి సినిమా ఆఫర్ చెప్పారు. నేను ఆలోచించుకుంటున్న టైంలోనే -దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మాట్లాడమని చెప్పారు. ఆ చిత్రమే హీరో వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ముకుంద’. కథ వినటంతోనే మంచి సినిమాలో చేసే అదృష్టం దక్కిందనుకున్నా. సినిమా తాలూకు సమీక్షలు చదివినప్పుడూ, థియేటర్‌లో ప్రేక్షకుల ప్రశంసలు చూడటం.. అదో తీయటి అనుభూతి. అదే సినిమాపట్ల ఆసక్తి పెంచింది.
ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది?
ముకుంద తర్వాత మళ్లీ నా వ్యాపారాల్లోకి వెళ్లిపోయాను. లాజిస్టిక్స్ అండ్ కస్టమ్స్ క్లియరెన్స్ వ్యవహారాల్లో బిజీ అయిపోయా. కానీ -సినిమాపై ఆసక్తి తగ్గలేదు. సహజంగానే రేసర్‌ని కనుక -్ఫట్‌నెస్ కోసం ఎక్కువ టైంలో జిమ్‌లో గడిపేవాడిని. హీరో కావాలన్న ఆలోచన ఉంది కనుక -‘మిస్టర్ పర్‌ఫెక్ట్’గా ఉండాలనుకునేవాడిని. రేసింగ్‌ను కంటిన్యూ చేస్తూనే, సినిమా పర్ఫెక్షన్ కోసం కొద్దిగా కష్టపడాల్సి వచ్చేది. గత ఏడాదే మళ్లీ సినిమా ప్రాజెక్టు వచ్చింది.
ప్రాజెక్టు ఎక్కడివరకూ వచ్చింది?
నిజానికి గత జూన్‌లో నిర్మాత రాఘవయ్యగారిని కలిశాను. ఆయన ఎప్పటినుంచో మంచి కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. అదే టైంలో -దర్శకుడు మోహన్‌ప్రసాద్ కథ చెప్పటం.. అది నచ్చి నేను హీరోగా సినిమా మొదలుపెట్టడం జరిగిపోయింది. మళ్లీ నా సినీ ప్రస్థానం మొదలైంది. ఓవైపు బిజినెస్.. ఇంకోవైపు ఇష్టమైన రేసింగ్.. కొత్తగా సినిమా.. ఇలా మూడు రంగాల్లో కాలుపెడితే ఇబ్బందేనంటూ స్నేహితులు వారించేవారు. ప్లానింగ్ ప్రకారం వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని సినిమా పూర్తి చేశాం. సినిమా తాలూకు పోస్ట్‌ప్రొడక్షన్స్, డబ్బింగ్ పూర్తవుతున్నాయ.
హీరోగా ఫస్ట్ ప్రాజెక్టు ఎక్స్‌పీరియన్స్?
చల్‌చల్‌గుర్రం టీంతో పని చేయటం సరికొత్త అనుభవం, అనుభూతి అందించింది. నటనలోనే కాదు, టెక్నికల్‌గానూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సినిమా అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది. విశాఖలో రెండు పాటల చిత్రీకరించాం. ఈ ప్రాజెక్టులో నాగబాబుగారు కీలకమైన ప్రాత చేస్తున్నారు. దీక్షాపంత్, అంగనా రాయ్ ఫిమేల్ లీడింగ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ పూర్తి చేసి, ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత, దర్శకుల ఆలోచన. ఆ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

-ప్రవవి