యువ

కుర్రాళ్లోయ్ .. కుర్రాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా!
ఒక్క ఐడియా వేలాది
జీవితాల్లో వెలుగు నింపుతుంది!
శ్రీరామ్ వర్మ, కృష్ణతేజ అనే ఇద్దరు
కుర్రాళ్లకి కూడా ఓ మంచి ఐడియా వచ్చింది. వచ్చిందే తడవు దానిని
అమల్లో పెట్టారు. విజయం
అందుకున్నారు. వేనోళ్ల ప్రశంసలు
అందుకుంటున్నారు
==============
ఓ ఐడియా కథ!

ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు? వారికొచ్చిన ఐడియా ఏమిటి?
ఇండియాలో ప్రతి ఐదుగురిలో ఒకరు సెక్స్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ, వీరిలో చాలామంది డాక్టర్లను సంప్రదించేందుకు వెనకాడేవారే! ముఖ్యంగా సెక్సాలజిస్టులను సంప్రదించేందుకు మహిళలు ఎక్కువగా విముఖత చూపుతున్నారు. ఫలితంగా వ్యాధి ముదిరి ప్రాణాంతకంగా మారిన ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో ప్రజలను జాగరూకుల్ని చేసే దిశగా కృషి చేస్తున్నా, అది పెద్దగా ఫలితమివ్వడం లేదు.
*****
శ్రీరామ్ వర్మ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కృష్ణ తేజ భువనేశ్వర్ ఐఐటిలో చదువుకున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి వయసూ పాతికేళ్లే. ఊరికే కాలం గడపడం ఇష్టం లేక ఓ హెల్త్‌బేస్డ్ కన్సల్టెన్సీలో చేరారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే వారికో ఐడియా వచ్చింది. సెక్స్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికోసం ఆన్‌లైన్‌లో ఓ స్టార్టప్ మొదలుపెట్టాలని. అనుకున్నదే తడవు ‘క్యుపిడ్ కేర్’ పేరుతో గత అక్టోబర్‌లో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు. పేషెంట్లు డాక్టర్ల వద్దకు రానక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే డాక్టర్లు సలహాలిస్తారు. వీడి యో ఛాట్ ద్వారా, టెలిఫోనిక్ కాల్స్ ద్వారా లేదా టెక్స్ట్ మె సేజ్‌ల ద్వారా సందేహాల నివృ త్తి జరుగుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 2016 స్మాష్ అప్ ఈవెంట్‌లో శ్రీరామ్, కృష్ణతేజల ఐడియాకు 20 లక్షల బహుమతి రావడంతో ఇక వారు వెనుదిరిగి చూసుకోలేదు. క్యుపిడ్ కేర్‌డాట్ ఇన్‌లో లాగిన్ అయితే చాలు పలువురు డాక్టర్లు అందుబాట్లోకి వస్తారు. డాక్టర్‌ను ఎంచుకుని, ఫీజు కట్టి, సమస్య చెప్పడమే తరువాయి, ట్రీట్‌మెంట్ మొదలవుతుంది.
‘మన దేశంలో సెక్స్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువమందే. కానీ వీరిలో చాలామంది డాక్టర్‌ను సంప్రదించేందుకు ఇష్టపడరు. కాబట్టి ఈ రంగంలో స్టార్టప్ ప్రారంభించడం బాగుంటుందని భావించాం. ప్రస్తుతం నగరాల్లో రోగులకోసమే సేవలందిస్తున్నాం. భవిష్యత్తులో పట్టణాలకూ విస్తరిస్తాం’ అంటూ వివరించాడు క్యుపిడ్ కేర్‌కు సిఇఓగా వ్యవహరిస్తున్న శ్రీరామ్. సెక్స్ సంబంధిత వ్యాధులతోబాధపడుతున్నవారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు, వారిలో అవగాహన పెంచేందుకు ఎన్జీఓలతోనూ క్యుపిడ్ కేర్ టై అప్ చేసుకుంటోంది.
సో, ఓ మంచి ఐడియాను అమల్లోకి తెచ్చిన శ్రీరామ్, కృష్ణతేజల ద్వయానికి ‘యువ’ బెస్ట్ఫా లక్ చెబుతోంది!
*
** కృష్ణతేజ , శ్రీరామ్‌వర్మ**