యువ

సవాళ్లపై స్వారీ ...! అదే విజయానికి దారి ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది యువ ప్రపంచం..యువత తలచుకుంటే అసాధ్యమేమీ లేదన్నంత విస్తృతంగా అవకాశాలు వెల్లువెత్తుతున్న ప్రపంచం..రంగం ఏదైనా అద్భుతంగా రాణించేందుకు ఇప్పుడున్నన్ని అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవని చెప్పడం అవాస్తవం ఏమీ కాదు. అయితే.. విజయాలు సునాయాసంగా రావు. పట్టుదల, సామర్థ్యం, సాధనా పటిమను రంగరించినప్పుడే జయాలు చేకూరుతాయి. నేటి యువత జీవతం వడ్డించిన విస్తరి కాదు. అన్నీ సమకూర్చుకోవాలి..అంతే పట్టుదలతో అన్నింటా రాణించాలి! అప్పుడే ప్రతిభ పదునెక్కుతుంది. విజయాలు పలుకరిస్తాయి. మనం వేసిన అడుగు మనకే సొంతం కావాలి. ఇతరుకు అనుకరణ అంత కంటే కాకూడదు. ఇందుకు యువత చేయాల్సిన పని..తాము ఎంచుకోనున్న రంగంలో రాణించిన వ్యక్తులెవరు..వారు ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి..వాటిని అధిగమించేందుకు వారు కనబరిచిన పట్టుదల, పాటవం ఎలాంటివి..అన్న వౌలిక వివరాల గురించి తెలుసుకోవడం.
================
ఏ ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. ఆ తొలి అడుగు ఎంత ఆచితూచి వేస్తామన్నదానిపైనే తదుపరి ఫలితాలు, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం..ఆమడ దూరంలోనే ఆగిపోవడమూ జరుగుతుంది. భిన్న రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి జీవితాలను లోతుగా పరిశీలిస్తే..ఎన్నో ఆటుపోట్లు కనిపిస్తాయి. ప్రతికూల పరిస్థితులకు నీరుగారిపోకుండా..లక్ష్యాన్ని చేరుకోలేక పోయామేనన్న దిగులుకు ఎంత మాత్రం ఆస్కారం ఇవ్వకుండా వారు ధీమాగా, ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకు పోయిన తీరూ కళ్లకు కడుతుంది. ఇది యువ ప్రపంచం.. యువత తలచుకుంటే అసాధ్యమేమీ లేదన్నంత విస్తృతంగా అవకాశాలు వెల్లువెత్తుతున్న ప్రపంచం..రంగం ఏదైనా అద్భుతంగా రాణించేందుకు ఇప్పుడున్నన్ని అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవని చెప్పడం అవాస్తవం ఏమీ కాదు. అయితే.. విజయాలు సునాయాసంగా రావు. పట్టుదల, సామర్థ్యం, సాధనా పటిమను రంగరించినప్పుడే జయాలు చేకూరుతాయి. నేటి యువత జీవితం వడ్డించిన విస్తరి కాదు. అన్నీ సమకూర్చుకోవాలి..అంతే పట్టుదలతో అన్నింటా రాణించాలి! అప్పుడే ప్రతిభ పదునెక్కుతుంది. విజయాలు పలుకరిస్తాయి. మనం వేసిన అడుగు మనకే సొంతం కావాలి. ఇతరులకు అనుకరణ అంత కంటే కాకూడదు. ఇందుకు యువత చేయాల్సిన పని..తాము ఎంచుకోనున్న రంగంలో రాణించిన వ్యక్తులెవరు..వారు ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి..వాటిని అధిగమించేందుకు వారు కనబరిచిన పట్టుదల, పాటవం ఎలాంటివి..అన్న వౌలిక వివరాల గురించి తెలుసుకోవడం. ఈ ప్రపంచం మనతోనే పుట్టలేదు కాబట్టి..ఏ విజయమైనా మనతోనే ప్రారంభం కాదు కాబట్టి..ఏఏ రంగంలో ఏఏ వ్యక్తులు ఏ రకమైన ప్రభావాన్ని కనబరిచారు.. ఎంత ఉన్నతంగా, ఆదర్శంగా, ఆదర్శనీయంగా రాణించారన్న అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని మనం మార్గనిర్దేశన చేసుకోవాలి. ఏ రంగంలోనైనా గెలుపోటములు సహజమే అయినా..విజయం సాధించిన వ్యక్తి కంటే అనుకున్నది సాధించ లేక పోయిన వ్యక్తిలోనే ఎక్కువ పట్టుదల ఉంటుంది. ఇది సహజం. ఇద్దరూ ఒకే రంగంలో పోటీ పడుతున్నా.. ఒకరు మాత్రమే విజయం సాధించడం..మున్ముందుకు దూసుకు పోవడం అన్నది సహజంగానే ఓటమి పాలైన వ్యక్తిలో పట్టుదలను పెంచుతుంది. ఇలా తొలి పరాజయంతో కుంగి పోవాల్సిన అవసరం లేదు. విజయం సాధించిన వ్యక్తులు పొంగిపోవాల్సిన అవసరమూ లేదు. జయాపజయాలు, గెలుపోటములు రాత్రి పగల్లావంటివి. వెలుగు నీడల్లాంటివి. ఒకదాన్ని అంటి పెట్టుకుని మరొకటి ఉంటుంది. వెలుగులో ఉన్న వ్యక్తి ఇక చీకటి లేదనుకోవడం..అలాగే చీకట్లో ఉన్న వ్యక్తి ఇక తనకు వెలుగు రాదనుకోవడం వట్టి భ్రమే. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని, భవితను నిర్దేశించుకుంటే..ఆలస్యమైనా ఆశించిన విజయం చేకూరుతుంది. అనుభవమే జీవితంలో పాఠాలు నేర్పుతుంది. ఓటమిని తట్టుకుని నిలబడ గలిగే ఓర్పునూ అందిస్తుంది. నేటి యువతకు అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు.. అ మార్గంలో ఎదురయ్యే సవాళ్లపై స్వారీ చేయడమూ తెలుసు. ఇందుకు కావాల్సింది మనమీద మనకు పూర్తి నమ్మకం. ఎదుటివారిపై విశ్వాసం కంటే మనల్ని, మన ప్రతిభను మనం నమ్ముకుంటే అది కచ్చితంగా సరైన మార్గంలోనే నడిపిస్తుంది. ఆ మార్గం సక్రమమా కాదా అన్నది తేలడానికి కొంత వ్యవధి పట్టినా..అంత వరకూ ఆగే ఓర్పు..తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగే నేర్పూ అలవరచు కోవాలి. వ్యాపారమైనా, ఉపాధి అయినా నేటి వాతావరణం పోటీమయం. ఈ స్పృహను ముందు నుంచీ కలిగి ఉంటే దేనికీ బెదరాల్సిన అవసరం లేదు. సవాళ్లను ముఖాముఖీ ఢీకొనవచ్చు.. వాటిపైనే స్వారీ చేసి లక్ష్యాలను సునాయాసంగానూ చేరుకోవచ్చు. *