శ్రీకాకుళం

యువజనోత్సవాల్లో అదరగొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 8: జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు మంచిపేరు తేవాలని జిల్లా పరిషత్‌చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న కళానైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ యువజనోత్సవాలు తోడ్పడతాయన్నారు.
జిల్లా కళలకు నిలయమని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలవాలని కోరారు. కలెక్టర్ లక్ష్మీనృసింహం మాట్లాడుతూ బాల్య దశనుండి యవ్వనానికి వచ్చిన సమయంలో వారిలో నైపుణ్యంపై అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థి దశలో క్రీడలు, లలితకళలు, శరీరమానసిక వికాసానికి తోడ్పడతాయని చెప్పారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఎంసెట్ పేరుతో చదువుపై ఒత్తిడి తెచ్చి సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. వ్యక్తిత్వ వికాసం, లలితకళలు, క్రీడలు ఆకర్షణీయమైన మారాలని విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లోమంచిపేరు సంపాదించి, సంపన్నులుగా తయారైనవారు కూడా ఉన్నారని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. దేశంలో 66శాతం వరకు యువత ఉందని దేశాభివృద్ధికి యువతే కీలకమన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్యం ప్రదర్శనను పాలకొండ డివిజన్‌కు చెందిన ఎస్.శరత్‌కుమార్, శ్రీకాకుళం డివిజన్‌కు చెందిన మంజులతను అభినందించారు. సెట్ శ్రీ సిఇవో వి.వి.ఆర్.ఎస్ మూర్తి మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో యువజనోత్సవాల్లో మొదటి స్థానం వచ్చినవారికి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం వచ్చినవారికి రాష్ట్ర స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చినవారికి జాతీయ స్థాయి పోటీలను ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహిస్తారని తెలిపారు. 30అంశాలలో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వికలాంగులసంక్షేమ శాఖ ఏడి లక్ష్మణరావు, రామలింగం , విద్యార్థులు పాల్గొన్నారు.