ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన మరో వైకాపా ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పి.డేవిడ్ రాజు ఆదివారం ఉదయం ఇక్కడ సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలో చేరాల్సిందిగా బాబు ఆహ్వానించారు. ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే బోండా ఉమా, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.