ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా ఎమ్మెల్యేల ధ్వజం

హైదరాబాద్, మార్చి 11: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుసగా మూడో బడ్జెట్‌లో కూడా నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టారని, నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారని వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, విశే్వశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ వారు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఎగగొట్టిన విజయమాల్యా గుర్తుకు వస్తున్నారని వారు ధ్వజమెత్తారు. బోగస్ అంకెలతో ప్రజలను మోసం చేశారన్నారు. రైతుల రుణమాఫీకి కేవలం రూ.3500 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. దీనివల్ల సంపూర్ణంగా రుణమాఫీ చేసేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందని వారు ప్రశ్నించారు. గత రెండు బడ్జెట్‌లలో కలిపి రూ.7500 కోట్లను మాత్రమే రుణమాఫీ కింద ఖర్చు పెట్టారన్నారు. తాజాగా రుణమాఫీ కింద కేటాయించిన నిధులు రుణమాఫీ వడ్డీకి సరిపోవన్నారు. వంటగ్యాస్ సిలిండర్‌కు వంద రూపాయలు సబ్సిడీ కేటాయిస్తామన్నారని, ఇప్పుడా హామీ ఏమైందన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రుణమాఫీపై ఇచ్చిన హామీ ఊసేలేదన్నారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందన్నారు. కాని దీనికి రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించడం వల్ల ఇతర ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణానికి నిధులు భరించే విధంగా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురావడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్టమ్రే భవనాల నిర్మాణానికి రూ.1500 కోట్లు కేటాయించిందన్నారు. కేంద్రం ఎప్పటిలోగా నిధులు కేటాయిస్తుందో బడ్జెట్‌లో పేర్కొనలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం నుంచి నిధులు రాలేదన్నారు.