కర్నూల్

సీమ ఉద్యమానికి వైకాపా ప్రణాళిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెర వెనుక పార్టీ.. ముందు నేతలు..
* నెలాఖరులో తిరుపతిలో సమావేశం..
కర్నూలు, నవంబరు 20 : రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమం నిర్వహించాలని వైకాపా నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. అయితే పార్టీకి సంబంధం లేదన్నట్లుగా తెర వెనుక ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతను పార్టీలోని కడప జిల్లాకు చెందిన కీలక నేతకు అప్పగించినట్లు ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. ఆయన ఆధ్వర్యం లో నెలాఖరులో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం శనివారమే జరగాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన రాయలసీమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వివక్షకు గురవుతోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ కోస్తాంధ్రాకు ఇస్తున్న ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వడం లేదన్న ఆందోళన ప్రజల్లో కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ కోసం గళం విప్పాలని తాము నిర్ణయించామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో పార్టీకి ఇబ్బంది లేకుండా పార్టీకి సంబంధం లేకుండా నిర్వహించాలని తలపెట్టామన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర వాదన చేయబోమని స్పష్టం చేశారు. కేవలం రాయలసీమ హక్కు లు, అభివృద్ధి, అధిక నిధుల కోసం ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. కాగా వైకాపా నేతలు నిర్వహించే ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా రాయలసీమ జిల్లాల్లోని ఇతర పార్టీల్లోని ప్రముఖ నేతలకు ఆహ్వానాలు అందా యి. ఇందులో కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కడప జిల్లా నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి, అనంతపురం జిల్లా నుంచి శైలజానాథ్, చిత్తూరు జిల్లా నుంచి రాయలసీమ ఉద్యమ నేత భూమన్ ఉన్నారు. టిడిపి నుంచి రాయల సీమ ఉద్యమం కోసం పని చేస్తామని ముందుకు వస్తున్న వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారు బహిరంగంగా ముందుకు వచ్చి ఉద్యమాల్లో పాల్గొనలేమని అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని వెల్లడవుతోంది. వైకాపా రాయలసీమ అభివృద్ధిపై ఉద్యమం నిర్వహిస్తుందన్న నిఘా అధికారుల సమాచారంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 జిల్లాల్లో అవసరమైన అభివృద్ధి పథకాల మంజూరుకు అధికారులను ఆదేశించారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టుల మంజూరు, పరిశ్రమల స్థాపన, కొత్త విద్యాసంస్థల ఏర్పాటు తదితర పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా రాయలసీమ జిల్లాల్లో తరచూ పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక వైపు ఉద్యమం, మరో వైపు అభివృద్ధి నినాదంతో రాయలసీమ జిల్లాల్లో రాజకీయం వేడెక్కనుందని పరిశీలకులు భావిస్తున్నారు.