శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కనుమరుగవుతున్న వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలం
* ఆపదకాలంలో కూడా రాజకీయాలే
* ఇక అధికారంలోకి రావడం కల
* జగన్ తీరుపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం
నెల్లూరు, నవంబర్ 27: వైకాపా కనుమరుగవుతున్న పార్టీ అని, దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రజలు ఎప్పుడో మరణశాసనం విధించారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్‌పార్క్ వద్ద ఆదిత్యనగర్‌లో ఉన్న టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి పరిస్థితులన్నీ అనుకూలించాక వచ్చిన ఆయన ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తుఫాన్ తాకిడితో వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ముఖ్యమంత్రి జిల్లాలో నష్టపరిహారం అందించడంపై ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం నిజాయతీతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఆపదకాలంలో రాజకీయాలు చేస్తూ అధికారంలోకి రావాలనే కుటిల రాజకీయాలు జగన్ మానుకోవాలని హితవు పలికారు. దీనికి నిదర్శనమే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు ప్రారంభించిన రోజుల్లోనే అధికారం చేపట్టడం ఆనవాయితీగా వస్తోందని, పార్టీ స్థాపించిన టిడిపి, అన్నా డిఎంకె, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలన్నీ పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే అధికారం చేపట్టాయన్నారు. జగన్‌ను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారని, ఆయన పార్టీపై ప్రజలు మరణశాసనం రాశారని, సమీప భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి రావడం కలేనని స్పష్టం చేశారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సమీప దూరంలో లేక, శ్రమజీవి పార్టీకన్నా ఐదువేల తక్కువ ఓట్లతో చివరి స్థానంలో నిలిచిందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ జిల్లాకు వచ్చి మూడురోజులు పర్యటించి వరద బాధితులకు కనీస సహాయ సహకారాలు అందించారా అని సూటిగా ప్రశ్నించారు. పిడబ్ల్యు డిపిఆర్ ఇరిగేషన్ తదితర శాఖలకు ఇప్పిటికే 1450 కోట్ల నిధులతో ఆక్వా, సాగురైతులతో పాటు వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. జగన్ పర్యటనలో భాగంగా బాధితుల ప్రాంతాలకు వెళ్లకుండా వరంగల్‌లో తనపార్టీని పటిష్టపరిచేందుకు వెనుతిరిగారన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాపాడేసరికి ఏమీపాలుపోని స్థితిలో సిఎంపై ఆరోపణలు చేయడం, పరిహారం సక్రమంగా అందడంలేదని విమర్శించడం సరికాదన్నారు. చివరగా ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరికపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ పార్టీలోకి తమ అధిష్ఠానం ఆహ్వానిస్తుందన్నారు. ఈ సమావేశంలో టిడిపి రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కిలారి వెంకటస్వామి నాయుడు, అన్నం దయాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.