రాష్ట్రీయం

నేడు వైకాపాకి ఆది రాజీనామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 19: కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శాసనసభ సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వైకాపాకు, ఎమ్మెల్యే పదవికి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు తన సన్నిహితులు, అనుచరగణం వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వైకాపాలో కొనసాగుతూ టిడిపిలో చేరడం వల్ల విమర్శలు వస్తాయని భావించి రాజీనామాకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల బరిలో దిగి సత్తాచాటుదామని అన్నట్లు సమాచారం. ప్రత్యర్థిగా ఎవరు ఉన్నా గెలుపు మనదేనని కార్యకర్తలు ఆదికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం తన సోదరుడు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఇతర కుటుంబసభ్యులు, నియోజకవర్గం కేడర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లేందుకు ఆది వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

రూ. కోటి ఎర్ర చందనం స్వాధీనం
రేణిగుంట, డిసెంబర్ 19: అక్రమంగా తరలించడానికి దాచి ఉంచిన కోటి రూపాయలు విలువ చేసే ఎ గ్రేడ్ 39 ఎర్రచందనం దుంగలను శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంట అర్బన్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. మండల పరిధిలోని తారకరామా నగర్‌లోని ప్లాట్ నెం. 74,75లోని పాడుపడిన ఇంటిలో ఎర్రచందనం దుంగలను దాచి ఉంచినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకొని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 39 ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు.

సిలిండర్ పేలి నలుగురి మృతి
ఖాజీపేట, డిసెంబర్ 19: కడప జిల్లా ఖాజీపేట పట్టణం బిసి కాలనీలో జరిగిన సిలిండర్ పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బిసి కాలనీలో ఉంటున్న కందుకూరు అనిల్‌కృష్ణ భార్య సుజాత శుక్రవారం తెల్లవారుజామున వంట చేసేందుకు ఇంట్లో గ్యాస్ స్టౌవ్ వెలిగించగా అప్పటికే లీకైన సిలిండర్‌కు నిప్పంటుకోవడంతో పెద్దశబ్ధంతో పేలిపోయింది. దీంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో సుజాత(24)తో పాటు ఇంట్లో నిద్రిస్తున్న అనిల్‌కృష్ణ(30), వారి పిల్లలు పవన్‌తేజ(6),దీపక్(3)కు తీవ్రగాయాలయ్యాయి. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వీరిని చెన్నైకి తరలించగా అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.

అన్నమయ్య బాటలో తిరుమలకు
రాజంపేట, డిసెంబర్ 19: సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్ళిన మార్గంలో శనివారం పాదయాత్ర ప్రారంభమైంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి శనివారం పెద్దసంఖ్యలో గోవిందమాల ధరించిన భక్తబృందం వెంటరాగా తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా ఆయన ఈ మార్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అన్నమయ్య తిరుమలకు నడిచివెళ్ళిన కాలిబాటను టిటిడి అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

చిన్నారిపై బాలుడి అత్యాచారం
పొన్నూరు, డిసెంబర్ 19: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామంలో చిన్నారిపై ఓ బాలుడు శనివారం అత్యాచారానికి పాల్పడిన ఉదంతం స్థానికులను కలవరపర్చింది. పొన్నూరు రూరల్ ఎస్‌ఐ మహ్మద్ రఫీ కథనం ప్రకారం.. కట్టెంపూడికి చెందిన చిన్నారి స్థానిక అంగన్‌వాడీ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. శనివారం స్కూలుకు వచ్చిన చిన్నారి మధ్యాహ్నం విరామ సమయంలో బయటకు రాగా అక్కడున్న అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదివే పదహారేళ్ల బాలుడు మరుగు ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తమ చిన్నారి రోదిస్తుండటం గమనించి బుజ్జగించిన దరిమిలా జరిగిన అకృత్యాన్ని తెలుసుకున్నారు.

ఘాట్‌లో టెంపోలో మంటలు
తిరుమల, డిసెంబర్ 19: తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 35వ మలుపు వద్ద మధ్యప్రదేశ్ భక్తులు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ వాహనంలో మంటలు చెలరేగాయి. అయితే అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై వాహనం నుండి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనంలో శనివారం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకొన్నారు. స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో 35 మలుపు వద్ద రాగానే ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై భక్తులను దింపేశాడు. అదే మార్గంలో వెళుతున్న భక్తులు వాహనంలో చెలరేగిన మంటలను గుర్తించి అగ్ని మాపక సిబ్బందికి తెలియజేశారు. వారు వచ్చే లోపే టెంపో ట్రావెలర్ పూర్తిగా దగ్గమయింది. ఈ క్రమంలో ఆ భక్తులు తాము వెంట తెచ్చుకొన్న లగేజిని కొంత మేరకు దక్కించుకోగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న సిబ్బంది మంటలను అదుపు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. భక్తులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వారిని తిరుపతికి తీసుకెళ్లారు.

ఏసిబికి చిక్కిన సంగం తహశీల్దార్
నెల్లూరు,డిసెంబర్ 19: నెల్లూరు నగరంలోని హరనాథపురం రెండవ వీధిలో నివాసముంటున్న సంగం మండల తహశీల్దార్ గంట సుశీలమ్మ ఇంటిపై శనివారం ఏసిబి డీఎస్పీ తోట ప్రభాకర్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఏక కాలంలో సుశీలమ్మ కుమారుడు సందీప్, కుమార్తె ప్రియాంక, బెంగళూరులో నివాసం ఉంటున్న అక్క సుజాత, భర్త ప్రభుదాసు, సుశీలమ్మ కుటుంబానికి బినామిగా ఉంటున్న హరనాథపురానికి చెందిని శ్రీనావాసులురెడ్డి తదితరుల ఇళ్లపై కూడా ఏక కాలంలో దాడులు నిర్వహించినట్లు ఏసిబి అధికారులు తెలిపారు. సుశీలమ్మపై భారీ స్ధాయిలో అవినీతి ఆరోపణలు రావటంతో గత కొంత కాలం నుండి పూర్తి స్ధాయిలో విచారించి ఈ దాడులు చేసినట్లు ఏసిబి అధికారులు తెలిపారు. తహశీల్దారు సుశీలమ్మ ఆమె భర్త గత కొంత కాలం నుండి వేర్వేరుగా ఉంటున్నారనీ, సుశీలమ్మ హరనాథపురంలో ఉంటుండుగా భర్త కపాటిపాళెంలో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. సుశీలమ్మ కుటుంబానికి బినామిగా ఉంటున్న ఎస్.శ్రీనివాసులురెడ్డి కూడా హరనాథపురంలో ఉంటున్నారనీ, ఆయన గ్రానైట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులలో నెల్లూరులో 4పాట్లు,5 ఇళ్ళులు,బెంగళూరులో ఒక ఇల్లు ,చేజర్ల మండలంలో 35 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. వీరి బ్యాంక్ ఖాతాలు పరిశీలించాలని ఏసిబి అధికారులు తెలిపారు. పట్టుబడిన ఆస్తులు విలువ ప్రభుత్వ మార్కెట్ ప్రకారం సుమారు రూ.2 కోట్లు ఉండగాప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు 6 కోట్ల వరకు ఉండవచ్చని ఏసిబి అధికారులు తెలిపారు. తహశీల్దారు సుశీలమ్మను ఏసిబి అధికారులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఒంటిమిట్టలో ముక్కోటికి ఏర్పాట్లు
ఒంటిమిట్ట, డిసెంబర్ 19: రెండో భద్రాద్రిగా గుర్తించిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర ద్వారాన్ని రకరకాల పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం తెల్లవారుజామునుంచే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.