రాష్ట్రీయం

వైకాపాఎల్పీ సమావేశం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భేటీలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్ర శాసనసభ చివరి రెండు రోజుల సమావేశాలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా శాసనసభాపక్షం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించనుంది. కాల్‌మనీ రాకెట్, వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయడం తదితర అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మళ్లీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. అధికార పార్టీ ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష విధానాలను ఎండగట్టే విషయమై చర్చించనున్నారు. రోజాను ఈ సమావేశాల వరకే సస్పెండ్ చేసి ఉంటే నిరసన తెలిపి సమావేశాలకు హాజరై ఉండేవాళ్లమని, కాని మొత్తం ఏడాది పాటు సస్పెండ్ చేయడమంటే ప్రతిపక్ష సభ్యుల నైతికతను దెబ్బతీసే విధంగా టిడిపి చర్యలున్నాయని ఒక వైకాపా ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయంలో జగన్ వెంటనే ఎమ్మెల్యేలందరూ ఉన్నారని ఆయన చెప్పారు.