యువ

పాస్‌వర్డ్‌లతో కుస్తీకి ఇక స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించడం, ఇ కామర్స్ సైట్లలోకి వెళ్లి వస్తువుల్ని కొనుగోలు చేయడం లేదా ఆన్‌లైన్‌లోనే బ్యాంక్ అకౌంట్లను మేనేజ్ చేయడం చిటికెలో పని. అయితే వాటి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడమే పెద్ద తలనొప్పి. స్మార్ట్ఫోన్‌లో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. అయితే ‘ఎవ్విరి కీ’ మీ దగ్గరుంటే పాస్‌వర్డ్‌లను మరచిపోయే ప్రసక్తి ఉండదు. ఇంతకీ ఏమిటీ ఎవ్విరి కీ అనేగా మీ సందేహం? ఇదొక రిస్ట్ బ్యాండ్. బ్లూ టూత్ సహాయంతో పనిచేసే ఈ రిస్ట్‌బాండ్‌లో మీ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఒకసారి ఫీడ్ చేస్తే చాలు. ఇక చీటికీ మాటికీ మీరు వాటిని ఉపయోగించే పని ఉండదు. ఈ రిస్ట్‌బాండ్‌ను మీ స్మార్ట్ఫోన్‌కు లేదా లాప్‌టాప్‌కు మూడు మీటర్ల దూరంలోకి తీసుకువస్తే చాలు... వెంటనే మీ అకౌంట్లు ఓపెన్ అయిపోతాయి. అలాగే స్మార్ట్ఫోన్‌లో మీరు సోషల్ మీడియా అకౌంట్‌లోకి రాగానే ఆటోమేటిగ్గా పాస్‌వర్డ్‌ను ఎవ్విరి కీయే అందిస్తుంది. కేవలం ఆన్‌లైన్ అకౌంట్లే కాదు... స్మార్ట్ డోర్ లాక్స్, స్మార్ట్ లైట్ బల్బులు వంటి వాటిని కూడా ఎవ్విరి కీ ఇట్టే ఆన్ చేస్తుంది. ఈ రిస్ట్‌బాండ్ పోతే ఏమిటనే దిగులు కూడా అక్కర్లేదు. ఎందుకంటే... మీ పాస్‌వర్డ్స్ సర్వర్లలోనూ, రిస్ట్‌బాండ్‌లోనూ సేవ్ కావు. పైగా ఎవ్విరీ కీ పోతే, వెంటనే ఆన్‌లైన్‌లో డీయాక్టివేట్ చేసేయొచ్చు. ఎవ్విరీ కీలో బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 30రోజులపాటు ఏకధాటిగా పనిచేస్తుందట.