యువ

పొత్తి కడుపు చల్లగా ( కొవ్వు కరిగేందుకు ఓ చక్కటి ఆసనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. ఒబేసిటీతో బాధపడేవారి సంగతి అలా ఉంచితే, సాధారణంగా లావుగా ఉండేవారందరికీ బరువు తగ్గాలని, నాజూగ్గా మారాలనీ ఉంటుంది. కానీ, లైపోసక్షన్ వంటి చికిత్సా విధానాల పట్ల భయం. అలాగని బరువు తగ్గడంలో సులభమైన మార్గాలేమిటో తెలియక తికమక. ఇలాంటి వారికోసం ఓ చిన్న సలహా. చాలామందికి పొట్టవద్ద, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా కనబడతారు. మరికొందరికి పొత్తికడుపు వద్ద కొవ్వు పేరుకుపోతుంది. పొట్ట భాగం నాజూగ్గానే ఉన్నా, పొత్తికడుపు లావుగా కనబడుతూ ఎబ్బెట్టుగా ఉంటుం ది. క్రమం తప్పకుండా తేలికపాటి ఆసనం ఒకటి వేయడంద్వారా పొత్తికడుపు భాగం లో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. ఈ ఆసనం పేరు- ఉభయ పదాంగుష్ఠాసనం. దీనిని వేయడం వల్ల పొత్తి కడుపు కండరాలు బిగుతుగా తయారవుతాయి. అలాగే భుజం, నడుము కండరాలు బలపడతాయి. వెనె్నముక కూడా పటిష్ఠమవుతుంది.
ఎలా చేయాలి?
* ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి.
* కాళ్లను మడిచి, రెండు కాళ్ల బొటనవేళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి.
* గట్టిగా గాలిపీల్చి, రెండు కాళ్లనూ చేతులతో పట్టుకునే నెమ్మదిగా పైకెత్తాలి.
* ఇలా చేసేటప్పుడు నడుమును వంచకూడదు.
* కాళ్లను పూర్తిగా పైకెత్తాక, భుజ కండరాల బిగుతును సడలించి, రిలాక్స్ అవ్వాలి.
* నెమ్మదిగా శ్వాస పీల్చి, వదులుతూ 15-20 సెకన్లు ఇదే భంగిమలో ఉండాలి.
* తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ కాలి వేళ్లను వదిలి, కాళ్లను కిందకు దించాలి.
* ఇలా నాలుగైదుసార్లు చేయాలి.
జాగ్రత్తలు
* ఉభయ పదంగుష్ఠాసనాన్ని ఏమీ తినకుండా మాత్రమే వేయాలి.
* చదునైన నేలపై కాకుండా యోగా మ్యాట్‌పై ఈ ఆసనం వేయడం మంచిది.
* కటి వలయం ఎముకలకు గాయాలైనా, కాలి ఎముకలకు గాయాలైనా ఈ ఆసనాన్ని వేయకపోవడమే ఉత్తమం.
* రక్తపోటు (బ్లడ్ ప్రెషర్), కంటి సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా ఈ ఆసనం వేయకూడదు.
* గర్భవతులు, బహిష్టులు కూడా ఉభయ పదంగుష్ఠాసనం వేయకూడదు.
*