యువ

నీకిది తగునా.. బాసూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాస్ ఈజ్ రైట్! ఇది ఉద్యోగులందరికీ అనుభవైక వేద్యం. మీ నుంచి పని ఎలా రాబట్టాలో..ఎంతగా మీ సమర్ధతను వినియోగించుకోవాలో బాసులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీ చేత పని చేయించుకోవడంలో అతడి ప్రతిష్ఠ ఇమిడి ఉంటుంది. అందుకే సిబ్బందిని ఎనలేని వత్తిళ్లకు గురిచేస్తారు! బాసులందు కొందరు బాసుల తీరు వేరయా అంటోంది తాజాగా జరిగిన ఓ సర్వే. దీని వివరాల్లోకి వెళితే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడమే ఆలస్యం! ఎందుకంటే..మిమ్మల్ని మితిమీరిన రీతిలో ప్రభావితం చేసే బాసుల పట్ల మీకు ఉండే విధేయత అంతా ఇంతా కాదు. మరింతగా ఆయన ఆదరణ పొందాలని, మన్ననను సాధించాలని పరితపిస్తారు. ఇదీ తప్పేమీ కాదు..అంతకంటే ఎక్కువగా పని వేళలతో నిమిత్తం లేకుండా మిమ్మల్ని పని చేయించినా ఆనందంగా ఆ పనీ చేసేస్తారు. ఇదంతగా బాసు మెప్పుకోసమే కాదు..ఆయన్నుంచి గుర్తింపును పొం దడం కోసమేనని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ..ఇలా అమితంగా మిమ్మల్ని ప్రభావితం చేసే బాసుల ధోరణి కారణంగా మీరు మీకు తెలియకుండానే మానసికంగా అలసటకు లోనవుతారు. ఆరోగ్యాన్నీ దెబ్బతీసుకుంటారు. అన్నింటికీ మించి అప్రయత్నంగానే మీరు పెట్టే సిక్ లీవుల సంఖ్యా పెరిగిపోతుంది. మీరు చేసే పనంతా బాసు మెప్పుకోసమే అయినా..మీ కెరీర్ కోసమే అయినా ఒక దశ దాటిన తర్వాత ఆయన మాట కాదనలేక ఎదో కారణంతో ఆఫీసులకు సెలవు పెట్టేస్తారని అనేక మంది ఉద్యోగుల మానసిక స్థితిగతులను కూలంకషంగా అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు. బాసు చెప్పింది చేసేయాలన్న ఆతృత, పట్టుదలతో అనారోగ్యంగా ఉన్నా వి ధులకు హాజరయ్యే ఉ ద్యోగులు కూడా కోట్ల సంఖ్యలోనే ఉన్నారని, పని పట్ల వీరి అంకిత భావం ప్రశంసనీయమే అయినా.. దీర్ఘకాలంలో అది అనేక రకాలుగా అనారోగ్య సమస్యలకు, తట్టుకోలేని రుగ్మతలకు దారితీస్తుందన్నది ఈ సర్వే సారాంశం. ఈ సర్వేలో పేర్కొన్న అనేక అంశాలు ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ఆయా సంస్థలు ఏ విధంగా వ్యవహరించాలన్న మార్గనిర్దేశనా చేశాయి. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమమే ఆయా సం స్థల వృద్ధికి, పురోగతికి దోహదం చేస్తుంది. మితిమీరిన స్థాయి లో వారిచేత బాసులు పని చేయించుకున్నా..తమ అరోగ్యాన్నీ ఫణం గా పెట్టి విధులకు హాజరైనా దాని ప్రభావం అప్పటికప్పుడు కాకపోయినా సమీ ప భవిష్యత్తులో కచ్చితంగా ఆ ఉద్యోగులపై కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదో చేసేయాలని పరితపించే బాసుల తమ సిబ్బందినీ అదే స్థాయిలో పరుగులు పెట్టిస్తారు. అన్నీ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని శాసించడమే కాదు.. అందుకు దోహదం చేసే విధం గా తనూ స్ఫూర్తిదాయక నేతృత్వం వహిస్తాడు. ఇలాంటి పరిస్థితికి అలవాటు పడని లేదా బాసు మాట కాదంటే ఏమంటాడోనన్న భయంతో విధులకు వచ్చే ఉద్యోగుల ధోరణి మొదట్లో గుణాత్మకంగానే ఉన్నా అనతి కాలంలో పనివత్తిడి భరించలేక ఏదో సాకుతో సెలవు పెట్టేయాలన్న ఆలోచనకూ ఆస్కారం ఇస్తుందని చెబుతున్నారు. తొందరగా ఎదగాలని భావించే, అనతి కాలంలో తన మార్కు అభివృద్ధిని కనబరచాలని భావించే బాసుల వల్ల అతడితో పనిచేసే సిబ్బంది అనివార్యంగానే మానసిక, శారీరక వత్తిళ్లకు లోనవుతారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే అది కచ్చితంగా సి బ్బంది ఆరోగ్యాన్ని దె బ్బతీయడానికి, ఆ వి ధంగా సంస్థ ఉత్పాదకత తగ్గడానికీ దారితీస్తుందన్న హెచ్చరిక అన్ని సంస్థలకు, దేన్నయినా సాధించేసుకోవాలనుకునే బాసుల కు వర్తిస్తుందని ఈ అధ్యయన ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.

-బి.సుధ