యువ

వారెవా...ఏమి ఫేస్‌బుక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇక ఫేస్‌బుక్ మొహం కూడా చూడకూడదు’ అని ఒట్టేసుకున్నారా? ఫర్వాలేదు...మీ లాంటివారు చాలామందే ఉంటారు. ఇలాంటివారిలో నూటికి 99శా తం మంది వారమో, పది రోజులో పోయాక ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి, మళ్లీ ఫేస్‌బుక్‌లోకి ఎంటరైనవాళ్లే ఉంటారు.
ఫేస్‌బుక్ ఓ వ్యసనంలా మారినవారంతా ఇక ఆ సైట్‌లోకి వెళ్లకూడదనుకుంటూనే ఉంటారు. కానీ ఆ అలవాటును మానుకోలేకపోతారు. ‘సోషల్ మీడియా+సొసైటీ’ అనే పత్రిక నిర్వహించిన ఓ సర్వేలో ఫేస్‌బుక్‌తో అంటకాగడానికి బోలెడు కారణాలు ఉంటాయని తేలిందట. సోషల్ మీడియాకు దూరంగా ఉండలేకపోవడం ఎంత కష్టమో ఈ సర్వే కళ్లకు కట్టిందంటారు ఎరిక్ బౌమర్. ఆయన కార్నెల్ యూనివర్శిటీలో ఇన్‌ఫర్మేషన్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. ఇదే విషయమై 99జ్ఘూకఒ్యచిచిళళజ్యూౄ.ష్యౄ అనే వెబ్‌సైట్ కూడా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారికి ఈ వెబ్‌సైట్ ఓ షరతు విధించింది. అదేమంటే- 99 రోజులపాటు ఫేస్‌బుక్‌కు దూరంగా ఉండాలని. వీరిలో చా లామంది అలా ఉండలేకపోయారట.
మానడం అంత ఈజీ కాదు
ఫేస్‌బుక్ ఓ దురలవాటుగానో, వ్యసనంగానో మారిందని భావించి బాధపడేవారు కూడా దానికి దూరంగా ఉం డలేకపోతున్నారట. వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఓ వ్యక్తి ‘మొదటి పది రోజులూ నేను ఇంటర్నెట్ ఎప్పుడు బ్రౌజ్ చేసినా నా వేళ్లు ముందుగా ఇంగ్లీషు అక్షరం ‘ఎఫ్’ మీదకే వెళ్లేవి’ అనడాన్ని బట్టి ఫేస్‌బుక్ మానవ జీవితంలోకి ఎంతలా చొచ్చుకుపోయిందో ఊహించవచ్చు.
కుతూహలమే కొంపముంచుతోంది!
ఫేస్‌బుక్‌లో తన అకౌంట్‌ను మరొకరు గమనిస్తున్నారని భావించినవారు తిరిగి ఫేస్‌బుక్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కానీ ఇతరులు ఏం చేస్తున్నారో, ఏం పోస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవాళ్లు మాత్రం ఫేస్‌బుక్‌ను వదిలేందుకు ఇష్టపడటం లేదన్నది సర్వే సారాంశం.
మూడ్ కూడా కారణమే..
మంచి మూడ్‌లో ఉండటం కూడా ఫేస్‌బుక్ వ్యసనాన్ని పెంచి పోషిస్తోందట. కులాసాగా, దిలాసాగా ఉన్నవారు వెంటనే చేసేపని ఫేస్‌బుక్‌లోకి వెళ్లిపోవడం. తమ గొప్పల గురించి, ఘనత గురించి పోస్టింగ్స్ చేయడం.
ఇతర సోషల్ మీడియా అవుట్‌లెట్స్...ట్విట్టర్ వంటి ఖాతాలకు అలవాటు పడిన వాళ్లు ఫేస్‌బుక్ మీద పెద్దగా ఆసక్తి కనబరచడం లేదట. ఇలాంటివారు తమ ఫోన్లలో ఫేస్‌బుక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోవడం, తమ అకౌంట్‌లో స్నేహితుల సంఖ్యను కుదించుకోవడం వంటి చర్యల ద్వారా ఫేస్‌బుక్‌కు వీలైనంత దూరంగా ఉంటున్నారట.
*