యువ

చెంచాలతో పర్యావ‘రణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈడిబుల్ స్పూన్స్!
చెంచాల్ని తినడమేంటి అనేగా
మీ సందేహం?
నిజమే. చెంచాల్ని ఎలా తింటాం? కానీ, దీని వెనుకున్న అసలు కథ అర్థమైతే ‘అవును...చెంచాల్నీ తినేయాలి’ అని మీరూ ఒప్పుకుంటారు.
అసలు సంగతికి వద్దాం... మీరు పిక్నిక్‌కో, ఆఫీస్ పని మీద మరో ఊరికో వెడుతున్నారు. దారిలో కారాపి, ఓ హోటల్ దగ్గర ఆగి ఫుడ్ ప్యాక్ చేయించుకున్నారు. వీలైనప్పుడు... దార్లోనే తినాలన్నది మీ ఆలోచన. కాసేపయ్యాక, నెమ్మదిగా ప్యాకెట్ విప్పారు. ప్లాస్టిక్ బౌల్‌లో ప్యాక్ చేసిన పెరుగన్నం, రెండు ప్లాస్టిక్ చెంచాలు. భోజనం కానిచ్చి, ప్లాస్టిక్ బౌల్‌నీ, చెంచాల్ని బయటపారేశారు. దట్సాల్! మీ భోజనం అంతటితో అయిపోయి ఉం డొచ్చు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల తలెత్తే అనర్థాలకు మీకు తెలియకుండానే మీరు ‘తో డ్పాటు’నందించారు. అదెలాగంటారా?
ప్లాస్టిక్... మనిషి జీవితంలో భాగమైపోయింది. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా అర్థవంతంగా వినియోగించుకోలేకపోతే అది మనిషి మనుగడకే ముప్పు తెస్తుం ది. ఈ అనర్థాలకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు...హైదరాబాద్‌కు చెందిన పీసపాటి నారాయ ణ. మనం మొదట చెప్పుకున్న ఈడిబుల్ స్పూన్స్ కానె్సప్ట్‌కు ఆద్యుడు ఆయనే. ఆహార పదార్ధాల వినియోగానికి వాడే ప్లాస్టిక్ కట్లెరీ వల్ల తలెత్తుతున్న అనర్థాలకు చెల్లు చీటీ పాడేందుకు, ప్రజలను జాగృతం చేసేందుకు ఆయన ఈడిబుల్ స్పూన్స్ తయారీకి తెర తీశారు. అలా ఆరేళ్ల క్రితం పీసపాటి... బేకీస్ అనే సంస్థకు శ్రీకారం చుట్టారు.
బేకీస్ తయారు చేసే చెంచాలు వంగిపోవు. ఆహారం తినడానికి వీలుగా మామూలు చెంచాల్లాగే ఇవి ను న్నగా, సున్నితంగా ఉంటాయి. వేడి నీళ్లలో 20 నిమిషాలవరకూ కరగకుండా ఉంటాయి. తినడం పూర్తి చేశాక పారేయకుండా వీటినీ హాయిగా తినేయొచ్చు. (ఇష్టం లేకపోతే ఈ చెంచాలను పారేయొచ్చు కూడా...ఇవి సునాయాసంగా మట్టిలో కలిసిపోయే గుణం కలవిగా ఉంటాయి. పైగా పర్యావరణానికి వీటివల్ల ఎలాంటి హానీ ఉండదు) ఈడిబుల్ స్పూన్స్‌ని ప్రధానంగా జొన్నపిండితో తయారు చేస్తారు. గోధుమ పిండి, బియ్యప్పిండిలతో కూడా వీటిని తయారు చేస్తారు. కానీ వాటి సంఖ్య పరిమితం. ఇలా ఎందుకంటే- వరి పండించడానికి ఎక్కువ నీరు అవసరం. ఓ కిలో బియ్యాన్ని ఉత్పత్తి చేయాలంటే ఐదువేల లీటర్ల నీరు అవసరం. అదే జొన్నల విషయానికొస్తే నీరు ఎక్కువగా అవసరం ఉండదు. కాబట్టే జొన్నపిండిని ఎంచుకున్నామంటారు పీసపాటి. తాము తయారుచేసే ఈడిబుల్ స్పూన్స్‌కు ఎలాటి రంగులు, హంగులు వాడమంటారాయన. ఇప్పటికే 30 లక్షల ఈడిబుల్ స్పూన్స్‌ను విక్రయించిన బేకీస్, ప్లాస్టిక్ వస్తువులతో పోటీ పడేందుకు తమ ఉత్పత్తులను మరింత తక్కువ ధరకు విక్రయించాలని భావిస్తోంది. ఇటీవలే నిధుల సమీకరణకు కిక్‌స్టార్టర్ క్యాంపెయిన్‌కు వెళ్లిన బేకీస్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. నిధుల సమీకరణలో విజయం సాధించడంతో ఈడిబుల్ ఫోర్క్స్, చోప్‌స్టిక్స్, నైవ్స్ వంటివి తయారు చేయాలన్న ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఈడిబుల్ చెంచాను ఒక్కొక్కటి రెండు రూపాయల చొప్పున బేకీస్ విక్రయిస్తోంది. ఈ ధరను మరింత తగ్గిస్తే తమ ఉత్పత్తులకు గిరాకీ మరింత బాగుంటుందని భావిస్తున్న బేకీస్... ఆ దిశగా దృష్టి సారిస్తామంటోంది. జన హితం కోసం ఓ ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చిన పీసపాటి కృషి ఫలించాలని ‘యువ’ కోరుకుంటోంది.
*