యువ

కాఫీ మగ్‌పై బొమ్మలాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది పేపర్ చదువుతూనో లేదా ఏదో ఆలోచిస్తూనో పక్కనే పొగలు కక్కుతున్న కాఫీ/టీ మగ్గును చేతిలోకి తీసుకుని సిప్ చేస్తారు. మూతి కాలాకగాని అందులో ఉన్న ద్రవం వేడిగా ఉందని గమనించరు. అయితే రైజ్ అండ్ షైన్ హీట్ ఛేంజింగ్ మగ్ గనుక మీ చేతిలో ఉంటే, సిప్ చేయకుండానే అందులో ఉన్న కాఫీ లేదా టీ వేడిగా ఉందో, చల్లగా ఉందో చెప్పేస్తారు. ఎలాగంటారా? ఈ కప్‌పై ఉన్న బొమ్మ సీరియస్‌గా ఉంటే అందులో ఉన్న ద్రవం చల్లగా ఉన్నట్టు. బొమ్మ నవ్వులు విరజిమ్ముతుంటే వేడిగా ఉన్నట్టు. పింగాణీతో తయారు చేసిన ఈ కప్‌లోకి వేడివేడి కాఫీ పోస్తే అంతవరకూ బిక్కమొహం వేసుక్కూచున్న బొమ్మ అంతలోనే నవ్వుతుంది. అదే కాఫీ చల్లారిపోతే, బొమ్మలో నవ్వు కూడా మాయమవుతుంది. బాగుంది కదూ ఈ బొమ్మలాట!